కవితల జాబితా
1.నిశి
2.పానకాల స్వామి
3చైనా వివాదం
4.స్నేహ మాధుర్యం
5.కరోనా అవకాశమా అవరోధమా
6.శ్రావణమా స్వాగతం
7.సినారె
8.ప్రేమ్జీ
9.టెస్ట్యూబ్ బేబి
10.లోకమాన్య
11.జెండా
12.ఇష్టం
13.ముళ్ళపూడి
14.సాయికుమార్
15.పల్లెటూరు
16.సీవీశ్రీ
17.రతన్ టాటా
18.సోను సూద్
19.రాఖీ సాక్షిగా
20.అల్లు రామలింగయ్య
21.స్నేహం
22.చెల్లి
23.వింటూనే ఉంటా
***************""
1PNM5241000077
ఇది వీరా గుడిపల్లి కవిత
20072020
చీకటి
కణిక సమూహం కోసం
********************
అటుతిరిగింది అలవాటుగా
ఇంకేమీ కనిపించడం లేదు.
ఇంతేనా జీవితం అనిపించడానికి కాబోలు
మతిమరుపనుకుందో
మనుషుల గురించి ముందే తెలుసో
రోజూ ఇదే వరుస
ఆశ చాలని మనసు
అరవై గంటలైనా అలాగే తిరుగుతుందనో
బంధాలు బాంధవ్యాలను
పాతరేసి పైసా మాయలో పడతాడనో
పన్నెండు గంటలకోసారి గుడ్డివాన్ని చేస్తుంది.
గుహలిస్తే ఆగామా
గుడారాలు వేశాం . ఈఫిల్ మించిన ఇండ్లను నిర్మించాం.
ఆకులు అలాలు పండూ ఫలమూ
చాలనుకున్నామా పీౙా బర్గర్ల వేటలో పడ్డాం
నీ చుట్టూ నీవే తిరుగుతూ
దారి తప్పుతున్న మమ్మల్ని ఆలోచించు కోమంటూ చీకటి కప్పుతున్నావు.
కరుణామయివి కదా
వేకువ రేకులతో ఉషోదయమవుతుంటే
కోప్పడిన అమ్మ బువ్వ తినమని బుజ్జగిస్తున్నట్లుంటది.
భూగోళమా నీకు జోహార్
..... ఇది వీరా గుడిపల్లి కవిత
2
ఇది వీరా గుడిపల్లి కవిత
20072020
అంశం ః పానకాల స్వామి
శీర్షిక ః తప్పనుకోను
*****************
మనవడిగా
కొడుకుగా
అన్నగా
మామగా
తమ్మునిగా
భర్తగా
ఉపాధ్యాయునిగా
స్నేహితునిగా
ఎన్ని రూపాలు నాకు
అనంత విశ్వమే
ఆత్మీయ బంధాల బందీగా
ప్రతీ రూపం తానై భాసిల్లే
రూపరహిత ధర్మం
సర్వ లక్షణ సమన్విత గా గోచరించే
లక్షణ రహిత పదార్ధ పరిణామం
రంగు రుచీ వాసనలతో
గమనింపుకు తెస్తుంటే
తేపకో రూపం ప్రదర్శించే నాకు
పానకల స్వామిగా
పరమాత్మ నర్ధం చేసుకుని
వేరై పోవడం
దాటలేని ఆగడ్తేం కాదు.
చేవను చేదుకోవడానికి
చేతికర్ర సాయం తప్పనుకోను.
...... ఇది వీరా గుడిపల్లి కవిత
3
ఇది వీరా గుడిపల్లి కవిత
21072020
అంశం ః చైనా ఇండియా వివాదం
శీర్షిక ఃమైత్రి
**********************
నడింగీత గోలేనా నీకూ నాకూ
గాల్వాన్ దగ్గర గొడవలవేగా
దాయాదుల నడుమదూరి
ఆడుకునే నీచబుద్ది.
కమ్యూనిష్టు లంటే మంచోల్లని విన్నానే
పెన్ను, పెన్సిల్, మొబైల్, మోటార్,
షాంపూ నుండి సమస్తం నీ వస్తువులే కొన్నానే
ఆర్థికంగా అంతెదిగావంటే నాదగ్గర వ్యాపారం చేసే కదా
కబళించాలని చూస్తావేం???
ప్రతీ వాడిని గౌరవించడం, భౌగోళిక సరిహద్దులు గుర్తించడం తప్పంటుందా ఏ యిజమైనా
గౌతమబుద్ధుడిని గౌరవించిన గొప్ప దేశం
భారత్ ప్రతిష్టను భరించలేక పోతుందేం
కమ్యునిజం ముసుగెందుకు నేస్తం
నీవు సామ్రాజ్య వాదివే
....... వీరా గుడిపల్లి
4
ఇది వీరా గుడిపల్లి కవిత
21072020
అంశం ః స్నేహ మాధుర్యం
*******************
బండి చక్రాలు
పక్షి రెక్కలు
యేం కోరుకుంటాయి
స్నేహితుడొకడే యెలా చేస్తాడని
తోడునిలుస్తాయి.
భారం కలిసేమోస్తాయి కడదాకా
పక్క పక్కనే నడుస్తూ
మనమంతేగా
ఎప్పుడు కలిశామని
ఒకరికొకరుగా మసలుకోడం తప్ప
కలిసేమో లేదో సందేహమే
యెప్పుడూ విడిపోలేదన్నది నిజం
విడిగా యేమైతామో గానీ
కలిస్తే విజేతలమే
ఏక మూల జనితాలే
ఉరుమూ మెరుపూ కలిసే వస్తాయి విభిన్నాలని తోస్తాయి.
స్నేహమంటే...
అటల్ అద్వానీ వోలె
కృష్ణ కుచేలులోలె
ఒకే చూపు నిచ్చే నేత్రద్వయం
ఒకే శబ్దాన్నిచ్చే గ్రాహక ద్వయం
ఒకరి కొకరుగా ఒక్కటిగ....
...... వీరా గుడిపల్లి
5
ఇది వీరా గుడిపల్లి కవిత
22/07/2020
కరోనా అవరోధమా అవకాశమా
********************
అవరోధాలను
అవకాశాలుగా మలచుకోవడమే జీవితం.
శ్వాసలెన్నో కలిసి సాగితే
దేహానికి చైతన్యం
ప్రతీ క్షణం ఆస్వాదించే హృదయాలే
ప్రాణిస్తాయి
దేహం లేని ప్రాణం వైరస్
ఆధారం కోసం ప్రాకులాటలో అవకాశం గా నిన్నెంచుకుంది
కలిసి సాగే క్రమంలో కడిగేసుకో
దేహం వదిలేశాక
ఎన్ని దేహాలు గా మారుతావో
కరోనాతో తెలిసి రాకపోతే కాలగర్భంలో కలిసిపోతావు.
కొత్తదేం కాదు మొదటిదంతకన్నా కాదు
చివరిదసలే కాదు
అవరోధమే సుమా
అవకాశం గా మార్చుకునే వరకు
..... వీరా గుడిపల్లి
6
ఇది వీరా గుడిపల్లి కవిత
22072019
శ్రావణమా స్వాగతం
*********************
బీడు భూములు నోళ్ళు తెరిచి తొలకరికై చూస్తున్నట్లు
అలా చూసి కలలను కళ్ళారా కలగనకముందే పుట్టింటికి పంపించిన నవవధువు
మోసులెత్తిన పెసర గాయలను సాయంసంధ్య లో కాల్చుకోజూసే రైతు మల్లె
ఉట్లమర్మమెరిగి
ఊళ్ళకు పయనమవజూస్తున్న కన్నయ్య భక్తులు
నూలు వడికే వాడికోసం
అచ్చుల్లో విత్తులెట్టి ఆదాయంపై భరోసాగున్న భూస్వామోలె
అనుకున్నట్లన్నీ జరిగినవని కృతజ్ఞత గా పొలాలమావాస్య కై చూస్తున్న హాలికులు
పచ్చచీర చుట్టుకుని
వయ్యారంగా ఉషోదయంలో వగలుపోతున్న పుడమి
మహంకాళి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే వేళ కోసం
ఆశగా ఎదురు చూస్తున్న జనం
స్వాగతమమ్మా శ్రావణం.
..... వీరా గుడిపల్లి
7
ఇది వీరా గుడిపల్లి కవిత
23072020
సినారె (పాట)
***************
శిలలపై శిల్పాలు చెక్కినారూ
మనవారు సృష్టి కే అందాలు దిద్దినారూ
సింగిరెడ్డి ని ఇలకు పంపినాడూ
వాడు అక్షరాలకు అంద మలదినాడూ
కరీంనగరూ వాడు రైతుబిడ్డోనాడు
ఎంతగా ఎదిగాడొ చూడు
ప్రతిభ మనిషై పెరిగి నట్లు...
ప్రగతి దారుల వెళ్లి నట్లు...
విశ్వ నరుడై నిలిచినాడూ..
తల్లి కొంగును బట్టి
తప్పటడుగులు వేసినపుడూ...
చాట్లబియ్యం బోసి చేయిజాపిన వేళ
కోయదొర
...లన్నమాటను మరవనోడూ
భవిత గీతాలు గీసుకున్నాడు.
ముందుగా తుదిశ్వాస
తీరెరిగి పెరిగినాడూ
సాహితీ సామంతులెందరికొ బాసటగ
చక్రవర్తిగా మెదిలినాడూ
తానె భాషగ మారి
తనువు తెలుగై వెలిగి
దారులెన్నో వేసి
కాంతులిచటే వదిలి
మట్టినే హత్తుకో వెళ్ళినాడు...
భాషలో భావమై
మనవెంటనే ఉంటనని మాటయిచ్చీ వెల్లినాడూ.......
వలదన్న అలదుకుని వదులుకోలేమంటు
శిలలపై శిల్పాలు చెక్కినారూ....
అక్షరాలల్ల.... అతనినే నిలిపినారూ.. మనవారు ఆ సినారెకే.. హారతుల నిచ్చినారూ...
...... *వీరా గుడిపల్లి*
8
ఇది వీరా గుడిపల్లి కవిత
24072020
ప్రేమ్జీ
****************
దేశమును ప్రేమించడమంటే
మట్టిని ప్రేమించడం,మనుషుల్ని ప్రేమించడం.
జిన్నా చెప్పినా
జీవితం జీవనం తరలించలేదు.
భవితకు బాటలు నిజాయితీ లో వెతుక్కున్నాడు.
మతపరదాలను కప్పుకోలేదు
సంపద సృష్టించడం కాదు
పంచడం తెలిసినోడు పెంచడం మరవనోడు.
విప్రో విశ్వరూపమతను
భరతావని ప్రకాశం
విశ్వపరచిన విప్రో ప్రేమ్జీ ప్రగతిదారులకై సాగే మౌన విప్లవం.
...... వీరా గుడిపల్లి
9
ఇది వీరా గుడిపల్లి కవిత
25072020
టెస్టు ట్యూబ్ బేబీ
********************
ఆటాడాలి గాయం కాకుండా
ఆనందించాలి అనర్థాలకు ఊతమివ్వకుండా
రేపటి తరం మూలాలను కూలదోయకుండా
ముక్కు మూసుకోవడం తప్పదంటే ఎలా
మురికిని కడిగేయకుండా
గేయం
గాయం నుండే పుడుతుందంటే
శ్లోకం
శోకం నుండే పుడుతుందంటే
గాయపడని గేయం కోసం
శోకమెరుగని శ్లోకం కోసం
నా అన్వేషణ
ప్రతి సృష్టి చేయడం సత్యాన్వేషణే
నేలవిడవని సాము కోసం మాటలు చెబుతూ కూర్చోను ...
మనిషన్నాక.... అంతే మరి
టెస్టు ట్యూబ్ బేబీ
రేపటి తరానికి రేవెలుగుల సంతకం
........ *వీరా గుడిపల్లి*
10
ఇది వీరా గుడిపల్లి కవిత
23072020
లోకమాన్య
*******************
ఫాదరాఫ్ ఇండియాస్ అన్రెస్ట్ గా రాజ్యం ప్రకటించినా
గణేశ్ చవితిని జనం పండగగా చేసి
స్వాతంత్ర్యోద్యమంలో భాగంచేసి
త్రీడేస్ ఉద్యమ పార్టీల అంతరంగాలను
శుద్ధి చేసిన
రత్నగిరి ముద్దు బిడ్డ
స్వాతంత్ర్యం నా జన్మ హక్కు
సాధించే తీరుతానన్న లోకమాన్యుడు
అధికారంలో
ప్రాధాన్యత ఇస్తామనగానే నమ్మిన
అనిబిసెంట్ తో విభేదించి
హోంరూల్ లీగ్ నడిపించి
తనశైలిని విడనాడని మహానేత
దేశభక్తి గంగాధరుడు
తిలకిస్తే
లోకమాన్యుడతను
.....*వీరా గుడిపల్లి*
11
ఇది వీరా గుడిపల్లి కవిత
27072020
జెండా
***********************
అది నా పొగరన్నాడొక కవి
ఆశయానికి సంకేతమన్నాడో గాయకుడు
పొద్దు పొడుపు లో ప్రతినిత్యం చూస్తున్నానన్నాడో రైతు
పసిపాప నవ్వులో కనిపిస్తుందన్నదో తల్లి
ఎక్కడ చూసినా దర్శనమిస్తుంది.
గాల్వాన్
కల్నల్ సంతోష్ అమరత్వం
కార్గిల్ వీరుల శౌర్యం
కపిల్, తెచ్చిన ప్రపంచకప్
అల్లూరి సంధించిన బాణం
భగత్ సింగ్ నాటిన తుపాకి మొక్క
స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న నినాదం
గరిమెళ్ళ కవనం
బోసినవ్వుల బాపూ ....
భగవద్గీత, ఖురాన్, బైబిల్
ఒకటేమిటి
జెండా ను చూసినప్పుడల్లా విశ్వదర్శనమౌతుంది.
నా జెండా రెపరెపలే రేపటి వెలుగు రేఖలకు ఆహ్వానం.
....... వీరా గుడిపల్లి
12
ఇది వీరా గుడిపల్లి కవిత
27072010
ఇష్టం
**********************
నీవంటే చాలా ఇష్టం
అకారణ ద్వేషం
పెంచుకునేవారుంటారని
పరనిందే
పాయసంగా సేవించే వారుంటారని
నవ్వులు చిందిస్తూ
నాశనం చేయడానికి ప్రణాళికలు రాయవచ్చని
వేరు పురుగు
లక్షణాలు మస్తిష్కంలో పుష్కలంగా నింపుకుని
పచ్చని జీవితాలు
భుజించే వారుంటారని
నిన్ను చూసేవరకు తెలియనే లేదు
అందుకే నీవంటే ఇష్టం.
ఉత్తరేణి, పల్లేరు,
కనిపిస్తే పీకేయడమే లోకరివాజు
ఔషధాలుగా
ఉపయోగించుకోవడం తెలియనంత వరకు
ఎడారి మొక్కల్నీ ప్రేమించాలి
వట్టిపోయిన
హృదయాలపట్ల జాలి లేకపోతే ఎలా
..... వీరా గుడిపల్లి
13
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
పున్నమి కోసం
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
****************
పాకుడు రాళ్లు దాటుకుని దాటుకుని రావాల్సిందే పాతాళం నుంచి పైకి రావాలంటే
సంకల్పం సరియైనదైతే
సాధ్యం కాని దేముంటుంది
అంటుగొమ్మలా నాటిందే కావచ్చు ఆంధ్ర షుగర్స్
ఎదిగిన తీరేంటి
పన్నెండు వేల కుటుంబాలకాధారమై నిలిచింది.
అరవై మూడేళ్ల ప్రస్థానంలో
అసహనం మొలకెత్తని పారిశ్రామిక క్షేత్రం
రాజకీయ వారసత్వం
రాణించని ఆర్థిక వటవృక్షం ఉంటుందా
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
అష్టా చెమ్మా సినిమాలో అన్నట్లు
ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉన్నట్లుంది
సైలెంట్ వైబ్రేషన్
..... ఇది వీరా గుడిపల్లి కవిత
14
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
సాయికుమార్
****************
మాటే మంత్రము
పలుకే యంత్రము
తెరవెనుక యెవరో తెలిస్తే
అంకుశం దిగేదో లేదో ...
ఓం యాంగ్రీ యంగ్ హీరో ఆ రోజుల్లో తెలుగు వారి హృదయాలు కబ్జా పెట్టేవాడో కాదో
మంత్రాలకు చింతకాయలు రాలతాయా
సాయికుమార్ సాక్షిగా
మాటలకా శక్తి ఉంది
శబ్దం శాసిస్తుంది
ఓంకారమే సర్వ సృష్టికి మూలాధారమనేది
నమ్మకం కాదు సత్యం
శబ్దాన్ని స్వరంగా మార్చి
సినీ జగత్తులో
యెందరి తలరాతలో మార్చిన నాదబ్రహ్మ
సాయి కుమార్... సాక్షిగా
..... వీరా గుడిపల్లి
15
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
పల్లెటూరు
***************
పావురంగ రాయమంటివి
ఇక దేనిగురించి రాయగలం
గావురంగ బెంచిన అమ్మ
పావురంగ జూసుకున్న పల్లె
ఇంకేముంటుంది
పైసా మొఖం జూడకుండా పదిరోజులు గడిచిందానడుమ
సార్ అన్న పదం పలుకకుండ సానకాలం మశిల్న
వరుసపిలుపులే దప్ప ఉట్టుట్టి మాటలే లేవు
గీనడుమ రోడ్లైనయి గని
దారెమ్మడి నడిస్తే జిమ్నాస్టిక్సే
బాయికాడికని బయల్దేరి
యెంత పొద్దుబోయిన
ఆకల్తో నకనకలాడుతూ వచ్చిన యాదిలేదు
అడివంటే అమ్మేనాయె ఆకలెట్లైతది
షెంట సుక్కకు సెంటు వాసన
పచ్చడి మెతుకులకు పరమాన్నం రుచి
పానంబోకుండ సూశే ఆరెంపీ
గెట్టుమీది కొమ్మలకై
గాల్వాన్ గొడవలు మర్శిపోయే ప్రేమ
చెట్టుకు పుట్టకు మొక్కడం
సావైనా బతుకైనా
ఊరంతా ఒక్కకాడ జేరడం
ఒక్కని కోసం అందర మేడుస్తం
పసులనుగూడ పాణమిచ్చి పెంచుకుంటం
*శ్రీ కాంత్*...
పావురంగ రాయమంటివి
యేం రాస్త జెర జెప్పు
గావురమంటే అమ్మ
పావురమంటే పల్లె
....... *ఇది వీరా గుడిపల్లి కవిత*
16
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
సీవీశ్రీ (పుట్టినరోజు సందర్భంగా)
*************
మరిచాడో, మజిలీయో
అదేంటక్కడున్నాడనుకున్నా
ఈ మనిషికి అక్కడేం పననుకున్నా
జవం జీవం జాతి గౌరవం ఎక్కడుందో తనకున్న అభిప్రాయం
మానవ సంబంధాల విలువలముందు
మరకలంటిన చొక్కాలను కొక్కెంనుండి జరపడం ఆలస్యమైతేనేం
ఉద్యమ కారుల్ని స్వాగతిస్తూ తోరణాలు కట్టి ఉత్తేజాన్ని నింపిన చేతులు
ప్రణాళికలు సిద్ధం చేసుకుని పిడికిళ్ళెత్తడానికి సమాయత్తమవుతున్న సందర్భం
అది విప్లవాల గడ్డ వారసత్వం
అనుకున్న చోటికి చేరడానికి
అక్కడ కాసేపాగాడంతే.
తన జెండా ఎగురవేయడానికి సమయం కోసం చూశాడో సందర్భాలను సృష్టించుకున్నాడో
తన చెట్టు కిందికే చేరాడు.
లక్ష్య సాధనలో .... నిరాటంకంగా
ఇప్పుడక్కడే.....
........ *వీరా గుడిపల్లి*
17
పున్నమి దిన పత్రిక కోసం
ఇది వీరా గుడిపల్లి కవిత
29072020
రతన్ టాటా
***************
నోనో అంటూ మోకాలడ్డినా
ప్రతీ వాడు కారులో తిరగాలన్న కలకోసం
రాజకీయ చట్రంలో నెగ్గి
నానోను రోడ్డెక్కించాడు.
వ్యాపార దిగ్గజమంటే తానెదగడం కాదని
సమూహాలకు నాయకత్వం వహించడమని కొత్త అర్థం కల్పించాడు.
ఒక్క పుస్తకం
ఐఐటీ యాస్పిరెంట్స్ కు ఆదర్శం గా అందించాడు
తానెదగాలన్న స్పృహ నెపుడో వదిలేశాడు
జాతి ఎదుగుదలే ఆశయమై సాగుతున్న
భారత రత్న మతను
తొలి విమానం నుండి తనదదేమాట
అదే బాట
రతన్......
మన జాతి రత్నం
..... ఇది వీరా గుడిపల్లి కవిత
18
ఇది వీరా గుడిపల్లి కవిత
29072020
సోను సూద్
*********************
పైపైన చూస్తే ఎలా
పనసపండు మల్లె
తొనలు తొలుస్తున్న కొద్దీ రుచుల తీరు మెరుగవుతున్నట్లు
బండమీద రాశిన బలుసుపండ్ల మాదిరి
పాదుల పెరిగిన దొండాకు పసరు మల్లె
అవసరానికి అతడున్నాడు
కంటబడితే చాలు
కాదనకుండా చేయందిస్తాడు
విలన్ వేషాలు వేసి
కధలెన్నో రక్తి కట్టించాడు.
హీరోగా ఆపన్నులకు అండగా నిలిచాడు
పనసైనా బలుసైనా పైకంతేగానీ
లోనంతా సోనూ తీరే
మనకెంతున్నా మట్టిలో కలిసే వరకే
మానవత్వం పరిమళిస్తే మనిషున్నంత వరకూ.....
మానవతిప్పుడు సోనూ గా తిరుగుతుంది.
ఇంటెనుక దొండపాదై కనిపిస్తుంది
...... వీరా గుడిపల్లి
19
ఇది వీరా గుడిపల్లి కవిత
29072020
రాఖీ సాక్షిగా
******************
బొమ్మరిల్లు కట్టిచ్చాను
బతుకమ్మను పేర్చాను
గోరింటాకు తెచ్చాను
నడిచే దారిలో రాళ్ళేరేశా
మాటలు వింటూ మురిసి పోయా
నా చెల్లి
కలకాలం హాయిగా ఉండాలని
పసితనం నుండే ప్రణాళికలు రచించా
కాలమెపుడూ
ఒకే తీరు గుంటుందా
ఎంత పుణ్యం చేసుకున్నారో
మేమెంత ఋణపడి ఉన్నామో
బావా
అనే పిలుపొక్కటి ఇచ్చినందుకు
ఆ యింటి ఎనుగర్రై
వంశానికి రక్షారేకై అందరికీ గొడుగై
తల్లి వేరై కాచుకుంటూ
నా చెల్లి అక్కడ..... ఇప్పుడు
తనదో ప్రపంచం
ఐతేనేం
చుట్టూ వైఫై లా
ఇప్పటికీ నేనే ఎప్పటికీ నేనే
యేటేటా తనుగట్టే రాఖీ సాక్షి గా
...... *వీరా గుడిపల్లి*
1.నిశి
2.పానకాల స్వామి
3చైనా వివాదం
4.స్నేహ మాధుర్యం
5.కరోనా అవకాశమా అవరోధమా
6.శ్రావణమా స్వాగతం
7.సినారె
8.ప్రేమ్జీ
9.టెస్ట్యూబ్ బేబి
10.లోకమాన్య
11.జెండా
12.ఇష్టం
13.ముళ్ళపూడి
14.సాయికుమార్
15.పల్లెటూరు
16.సీవీశ్రీ
17.రతన్ టాటా
18.సోను సూద్
19.రాఖీ సాక్షిగా
20.అల్లు రామలింగయ్య
21.స్నేహం
22.చెల్లి
23.వింటూనే ఉంటా
***************""
1PNM5241000077
ఇది వీరా గుడిపల్లి కవిత
20072020
చీకటి
కణిక సమూహం కోసం
********************
అటుతిరిగింది అలవాటుగా
ఇంకేమీ కనిపించడం లేదు.
ఇంతేనా జీవితం అనిపించడానికి కాబోలు
మతిమరుపనుకుందో
మనుషుల గురించి ముందే తెలుసో
రోజూ ఇదే వరుస
ఆశ చాలని మనసు
అరవై గంటలైనా అలాగే తిరుగుతుందనో
బంధాలు బాంధవ్యాలను
పాతరేసి పైసా మాయలో పడతాడనో
పన్నెండు గంటలకోసారి గుడ్డివాన్ని చేస్తుంది.
గుహలిస్తే ఆగామా
గుడారాలు వేశాం . ఈఫిల్ మించిన ఇండ్లను నిర్మించాం.
ఆకులు అలాలు పండూ ఫలమూ
చాలనుకున్నామా పీౙా బర్గర్ల వేటలో పడ్డాం
నీ చుట్టూ నీవే తిరుగుతూ
దారి తప్పుతున్న మమ్మల్ని ఆలోచించు కోమంటూ చీకటి కప్పుతున్నావు.
కరుణామయివి కదా
వేకువ రేకులతో ఉషోదయమవుతుంటే
కోప్పడిన అమ్మ బువ్వ తినమని బుజ్జగిస్తున్నట్లుంటది.
భూగోళమా నీకు జోహార్
..... ఇది వీరా గుడిపల్లి కవిత
2
ఇది వీరా గుడిపల్లి కవిత
20072020
అంశం ః పానకాల స్వామి
శీర్షిక ః తప్పనుకోను
*****************
మనవడిగా
కొడుకుగా
అన్నగా
మామగా
తమ్మునిగా
భర్తగా
ఉపాధ్యాయునిగా
స్నేహితునిగా
ఎన్ని రూపాలు నాకు
అనంత విశ్వమే
ఆత్మీయ బంధాల బందీగా
ప్రతీ రూపం తానై భాసిల్లే
రూపరహిత ధర్మం
సర్వ లక్షణ సమన్విత గా గోచరించే
లక్షణ రహిత పదార్ధ పరిణామం
రంగు రుచీ వాసనలతో
గమనింపుకు తెస్తుంటే
తేపకో రూపం ప్రదర్శించే నాకు
పానకల స్వామిగా
పరమాత్మ నర్ధం చేసుకుని
వేరై పోవడం
దాటలేని ఆగడ్తేం కాదు.
చేవను చేదుకోవడానికి
చేతికర్ర సాయం తప్పనుకోను.
...... ఇది వీరా గుడిపల్లి కవిత
3
ఇది వీరా గుడిపల్లి కవిత
21072020
అంశం ః చైనా ఇండియా వివాదం
శీర్షిక ఃమైత్రి
**********************
నడింగీత గోలేనా నీకూ నాకూ
గాల్వాన్ దగ్గర గొడవలవేగా
దాయాదుల నడుమదూరి
ఆడుకునే నీచబుద్ది.
కమ్యూనిష్టు లంటే మంచోల్లని విన్నానే
పెన్ను, పెన్సిల్, మొబైల్, మోటార్,
షాంపూ నుండి సమస్తం నీ వస్తువులే కొన్నానే
ఆర్థికంగా అంతెదిగావంటే నాదగ్గర వ్యాపారం చేసే కదా
కబళించాలని చూస్తావేం???
ప్రతీ వాడిని గౌరవించడం, భౌగోళిక సరిహద్దులు గుర్తించడం తప్పంటుందా ఏ యిజమైనా
గౌతమబుద్ధుడిని గౌరవించిన గొప్ప దేశం
భారత్ ప్రతిష్టను భరించలేక పోతుందేం
కమ్యునిజం ముసుగెందుకు నేస్తం
నీవు సామ్రాజ్య వాదివే
....... వీరా గుడిపల్లి
4
ఇది వీరా గుడిపల్లి కవిత
21072020
అంశం ః స్నేహ మాధుర్యం
*******************
బండి చక్రాలు
పక్షి రెక్కలు
యేం కోరుకుంటాయి
స్నేహితుడొకడే యెలా చేస్తాడని
తోడునిలుస్తాయి.
భారం కలిసేమోస్తాయి కడదాకా
పక్క పక్కనే నడుస్తూ
మనమంతేగా
ఎప్పుడు కలిశామని
ఒకరికొకరుగా మసలుకోడం తప్ప
కలిసేమో లేదో సందేహమే
యెప్పుడూ విడిపోలేదన్నది నిజం
విడిగా యేమైతామో గానీ
కలిస్తే విజేతలమే
ఏక మూల జనితాలే
ఉరుమూ మెరుపూ కలిసే వస్తాయి విభిన్నాలని తోస్తాయి.
స్నేహమంటే...
అటల్ అద్వానీ వోలె
కృష్ణ కుచేలులోలె
ఒకే చూపు నిచ్చే నేత్రద్వయం
ఒకే శబ్దాన్నిచ్చే గ్రాహక ద్వయం
ఒకరి కొకరుగా ఒక్కటిగ....
...... వీరా గుడిపల్లి
5
ఇది వీరా గుడిపల్లి కవిత
22/07/2020
కరోనా అవరోధమా అవకాశమా
********************
అవరోధాలను
అవకాశాలుగా మలచుకోవడమే జీవితం.
శ్వాసలెన్నో కలిసి సాగితే
దేహానికి చైతన్యం
ప్రతీ క్షణం ఆస్వాదించే హృదయాలే
ప్రాణిస్తాయి
దేహం లేని ప్రాణం వైరస్
ఆధారం కోసం ప్రాకులాటలో అవకాశం గా నిన్నెంచుకుంది
కలిసి సాగే క్రమంలో కడిగేసుకో
దేహం వదిలేశాక
ఎన్ని దేహాలు గా మారుతావో
కరోనాతో తెలిసి రాకపోతే కాలగర్భంలో కలిసిపోతావు.
కొత్తదేం కాదు మొదటిదంతకన్నా కాదు
చివరిదసలే కాదు
అవరోధమే సుమా
అవకాశం గా మార్చుకునే వరకు
..... వీరా గుడిపల్లి
6
ఇది వీరా గుడిపల్లి కవిత
22072019
శ్రావణమా స్వాగతం
*********************
బీడు భూములు నోళ్ళు తెరిచి తొలకరికై చూస్తున్నట్లు
అలా చూసి కలలను కళ్ళారా కలగనకముందే పుట్టింటికి పంపించిన నవవధువు
మోసులెత్తిన పెసర గాయలను సాయంసంధ్య లో కాల్చుకోజూసే రైతు మల్లె
ఉట్లమర్మమెరిగి
ఊళ్ళకు పయనమవజూస్తున్న కన్నయ్య భక్తులు
నూలు వడికే వాడికోసం
అచ్చుల్లో విత్తులెట్టి ఆదాయంపై భరోసాగున్న భూస్వామోలె
అనుకున్నట్లన్నీ జరిగినవని కృతజ్ఞత గా పొలాలమావాస్య కై చూస్తున్న హాలికులు
పచ్చచీర చుట్టుకుని
వయ్యారంగా ఉషోదయంలో వగలుపోతున్న పుడమి
మహంకాళి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసే వేళ కోసం
ఆశగా ఎదురు చూస్తున్న జనం
స్వాగతమమ్మా శ్రావణం.
..... వీరా గుడిపల్లి
7
ఇది వీరా గుడిపల్లి కవిత
23072020
సినారె (పాట)
***************
శిలలపై శిల్పాలు చెక్కినారూ
మనవారు సృష్టి కే అందాలు దిద్దినారూ
సింగిరెడ్డి ని ఇలకు పంపినాడూ
వాడు అక్షరాలకు అంద మలదినాడూ
కరీంనగరూ వాడు రైతుబిడ్డోనాడు
ఎంతగా ఎదిగాడొ చూడు
ప్రతిభ మనిషై పెరిగి నట్లు...
ప్రగతి దారుల వెళ్లి నట్లు...
విశ్వ నరుడై నిలిచినాడూ..
తల్లి కొంగును బట్టి
తప్పటడుగులు వేసినపుడూ...
చాట్లబియ్యం బోసి చేయిజాపిన వేళ
కోయదొర
...లన్నమాటను మరవనోడూ
భవిత గీతాలు గీసుకున్నాడు.
ముందుగా తుదిశ్వాస
తీరెరిగి పెరిగినాడూ
సాహితీ సామంతులెందరికొ బాసటగ
చక్రవర్తిగా మెదిలినాడూ
తానె భాషగ మారి
తనువు తెలుగై వెలిగి
దారులెన్నో వేసి
కాంతులిచటే వదిలి
మట్టినే హత్తుకో వెళ్ళినాడు...
భాషలో భావమై
మనవెంటనే ఉంటనని మాటయిచ్చీ వెల్లినాడూ.......
వలదన్న అలదుకుని వదులుకోలేమంటు
శిలలపై శిల్పాలు చెక్కినారూ....
అక్షరాలల్ల.... అతనినే నిలిపినారూ.. మనవారు ఆ సినారెకే.. హారతుల నిచ్చినారూ...
...... *వీరా గుడిపల్లి*
8
ఇది వీరా గుడిపల్లి కవిత
24072020
ప్రేమ్జీ
****************
దేశమును ప్రేమించడమంటే
మట్టిని ప్రేమించడం,మనుషుల్ని ప్రేమించడం.
జిన్నా చెప్పినా
జీవితం జీవనం తరలించలేదు.
భవితకు బాటలు నిజాయితీ లో వెతుక్కున్నాడు.
మతపరదాలను కప్పుకోలేదు
సంపద సృష్టించడం కాదు
పంచడం తెలిసినోడు పెంచడం మరవనోడు.
విప్రో విశ్వరూపమతను
భరతావని ప్రకాశం
విశ్వపరచిన విప్రో ప్రేమ్జీ ప్రగతిదారులకై సాగే మౌన విప్లవం.
...... వీరా గుడిపల్లి
9
ఇది వీరా గుడిపల్లి కవిత
25072020
టెస్టు ట్యూబ్ బేబీ
********************
ఆటాడాలి గాయం కాకుండా
ఆనందించాలి అనర్థాలకు ఊతమివ్వకుండా
రేపటి తరం మూలాలను కూలదోయకుండా
ముక్కు మూసుకోవడం తప్పదంటే ఎలా
మురికిని కడిగేయకుండా
గేయం
గాయం నుండే పుడుతుందంటే
శ్లోకం
శోకం నుండే పుడుతుందంటే
గాయపడని గేయం కోసం
శోకమెరుగని శ్లోకం కోసం
నా అన్వేషణ
ప్రతి సృష్టి చేయడం సత్యాన్వేషణే
నేలవిడవని సాము కోసం మాటలు చెబుతూ కూర్చోను ...
మనిషన్నాక.... అంతే మరి
టెస్టు ట్యూబ్ బేబీ
రేపటి తరానికి రేవెలుగుల సంతకం
........ *వీరా గుడిపల్లి*
10
ఇది వీరా గుడిపల్లి కవిత
23072020
లోకమాన్య
*******************
ఫాదరాఫ్ ఇండియాస్ అన్రెస్ట్ గా రాజ్యం ప్రకటించినా
గణేశ్ చవితిని జనం పండగగా చేసి
స్వాతంత్ర్యోద్యమంలో భాగంచేసి
త్రీడేస్ ఉద్యమ పార్టీల అంతరంగాలను
శుద్ధి చేసిన
రత్నగిరి ముద్దు బిడ్డ
స్వాతంత్ర్యం నా జన్మ హక్కు
సాధించే తీరుతానన్న లోకమాన్యుడు
అధికారంలో
ప్రాధాన్యత ఇస్తామనగానే నమ్మిన
అనిబిసెంట్ తో విభేదించి
హోంరూల్ లీగ్ నడిపించి
తనశైలిని విడనాడని మహానేత
దేశభక్తి గంగాధరుడు
తిలకిస్తే
లోకమాన్యుడతను
.....*వీరా గుడిపల్లి*
11
ఇది వీరా గుడిపల్లి కవిత
27072020
జెండా
***********************
అది నా పొగరన్నాడొక కవి
ఆశయానికి సంకేతమన్నాడో గాయకుడు
పొద్దు పొడుపు లో ప్రతినిత్యం చూస్తున్నానన్నాడో రైతు
పసిపాప నవ్వులో కనిపిస్తుందన్నదో తల్లి
ఎక్కడ చూసినా దర్శనమిస్తుంది.
గాల్వాన్
కల్నల్ సంతోష్ అమరత్వం
కార్గిల్ వీరుల శౌర్యం
కపిల్, తెచ్చిన ప్రపంచకప్
అల్లూరి సంధించిన బాణం
భగత్ సింగ్ నాటిన తుపాకి మొక్క
స్వరాజ్యం నా జన్మ హక్కు అన్న నినాదం
గరిమెళ్ళ కవనం
బోసినవ్వుల బాపూ ....
భగవద్గీత, ఖురాన్, బైబిల్
ఒకటేమిటి
జెండా ను చూసినప్పుడల్లా విశ్వదర్శనమౌతుంది.
నా జెండా రెపరెపలే రేపటి వెలుగు రేఖలకు ఆహ్వానం.
....... వీరా గుడిపల్లి
12
ఇది వీరా గుడిపల్లి కవిత
27072010
ఇష్టం
**********************
నీవంటే చాలా ఇష్టం
అకారణ ద్వేషం
పెంచుకునేవారుంటారని
పరనిందే
పాయసంగా సేవించే వారుంటారని
నవ్వులు చిందిస్తూ
నాశనం చేయడానికి ప్రణాళికలు రాయవచ్చని
వేరు పురుగు
లక్షణాలు మస్తిష్కంలో పుష్కలంగా నింపుకుని
పచ్చని జీవితాలు
భుజించే వారుంటారని
నిన్ను చూసేవరకు తెలియనే లేదు
అందుకే నీవంటే ఇష్టం.
ఉత్తరేణి, పల్లేరు,
కనిపిస్తే పీకేయడమే లోకరివాజు
ఔషధాలుగా
ఉపయోగించుకోవడం తెలియనంత వరకు
ఎడారి మొక్కల్నీ ప్రేమించాలి
వట్టిపోయిన
హృదయాలపట్ల జాలి లేకపోతే ఎలా
..... వీరా గుడిపల్లి
13
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
పున్నమి కోసం
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
****************
పాకుడు రాళ్లు దాటుకుని దాటుకుని రావాల్సిందే పాతాళం నుంచి పైకి రావాలంటే
సంకల్పం సరియైనదైతే
సాధ్యం కాని దేముంటుంది
అంటుగొమ్మలా నాటిందే కావచ్చు ఆంధ్ర షుగర్స్
ఎదిగిన తీరేంటి
పన్నెండు వేల కుటుంబాలకాధారమై నిలిచింది.
అరవై మూడేళ్ల ప్రస్థానంలో
అసహనం మొలకెత్తని పారిశ్రామిక క్షేత్రం
రాజకీయ వారసత్వం
రాణించని ఆర్థిక వటవృక్షం ఉంటుందా
ముళ్ళపూడి హరిశ్చంద్ర ప్రసాద్
అష్టా చెమ్మా సినిమాలో అన్నట్లు
ఆ పేరులోనే ఏదో వైబ్రేషన్ ఉన్నట్లుంది
సైలెంట్ వైబ్రేషన్
..... ఇది వీరా గుడిపల్లి కవిత
14
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
సాయికుమార్
****************
మాటే మంత్రము
పలుకే యంత్రము
తెరవెనుక యెవరో తెలిస్తే
అంకుశం దిగేదో లేదో ...
ఓం యాంగ్రీ యంగ్ హీరో ఆ రోజుల్లో తెలుగు వారి హృదయాలు కబ్జా పెట్టేవాడో కాదో
మంత్రాలకు చింతకాయలు రాలతాయా
సాయికుమార్ సాక్షిగా
మాటలకా శక్తి ఉంది
శబ్దం శాసిస్తుంది
ఓంకారమే సర్వ సృష్టికి మూలాధారమనేది
నమ్మకం కాదు సత్యం
శబ్దాన్ని స్వరంగా మార్చి
సినీ జగత్తులో
యెందరి తలరాతలో మార్చిన నాదబ్రహ్మ
సాయి కుమార్... సాక్షిగా
..... వీరా గుడిపల్లి
15
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
పల్లెటూరు
***************
పావురంగ రాయమంటివి
ఇక దేనిగురించి రాయగలం
గావురంగ బెంచిన అమ్మ
పావురంగ జూసుకున్న పల్లె
ఇంకేముంటుంది
పైసా మొఖం జూడకుండా పదిరోజులు గడిచిందానడుమ
సార్ అన్న పదం పలుకకుండ సానకాలం మశిల్న
వరుసపిలుపులే దప్ప ఉట్టుట్టి మాటలే లేవు
గీనడుమ రోడ్లైనయి గని
దారెమ్మడి నడిస్తే జిమ్నాస్టిక్సే
బాయికాడికని బయల్దేరి
యెంత పొద్దుబోయిన
ఆకల్తో నకనకలాడుతూ వచ్చిన యాదిలేదు
అడివంటే అమ్మేనాయె ఆకలెట్లైతది
షెంట సుక్కకు సెంటు వాసన
పచ్చడి మెతుకులకు పరమాన్నం రుచి
పానంబోకుండ సూశే ఆరెంపీ
గెట్టుమీది కొమ్మలకై
గాల్వాన్ గొడవలు మర్శిపోయే ప్రేమ
చెట్టుకు పుట్టకు మొక్కడం
సావైనా బతుకైనా
ఊరంతా ఒక్కకాడ జేరడం
ఒక్కని కోసం అందర మేడుస్తం
పసులనుగూడ పాణమిచ్చి పెంచుకుంటం
*శ్రీ కాంత్*...
పావురంగ రాయమంటివి
యేం రాస్త జెర జెప్పు
గావురమంటే అమ్మ
పావురమంటే పల్లె
....... *ఇది వీరా గుడిపల్లి కవిత*
16
ఇది వీరా గుడిపల్లి కవిత
28072020
సీవీశ్రీ (పుట్టినరోజు సందర్భంగా)
*************
మరిచాడో, మజిలీయో
అదేంటక్కడున్నాడనుకున్నా
ఈ మనిషికి అక్కడేం పననుకున్నా
జవం జీవం జాతి గౌరవం ఎక్కడుందో తనకున్న అభిప్రాయం
మానవ సంబంధాల విలువలముందు
మరకలంటిన చొక్కాలను కొక్కెంనుండి జరపడం ఆలస్యమైతేనేం
ఉద్యమ కారుల్ని స్వాగతిస్తూ తోరణాలు కట్టి ఉత్తేజాన్ని నింపిన చేతులు
ప్రణాళికలు సిద్ధం చేసుకుని పిడికిళ్ళెత్తడానికి సమాయత్తమవుతున్న సందర్భం
అది విప్లవాల గడ్డ వారసత్వం
అనుకున్న చోటికి చేరడానికి
అక్కడ కాసేపాగాడంతే.
తన జెండా ఎగురవేయడానికి సమయం కోసం చూశాడో సందర్భాలను సృష్టించుకున్నాడో
తన చెట్టు కిందికే చేరాడు.
లక్ష్య సాధనలో .... నిరాటంకంగా
ఇప్పుడక్కడే.....
........ *వీరా గుడిపల్లి*
17
పున్నమి దిన పత్రిక కోసం
ఇది వీరా గుడిపల్లి కవిత
29072020
రతన్ టాటా
***************
నోనో అంటూ మోకాలడ్డినా
ప్రతీ వాడు కారులో తిరగాలన్న కలకోసం
రాజకీయ చట్రంలో నెగ్గి
నానోను రోడ్డెక్కించాడు.
వ్యాపార దిగ్గజమంటే తానెదగడం కాదని
సమూహాలకు నాయకత్వం వహించడమని కొత్త అర్థం కల్పించాడు.
ఒక్క పుస్తకం
ఐఐటీ యాస్పిరెంట్స్ కు ఆదర్శం గా అందించాడు
తానెదగాలన్న స్పృహ నెపుడో వదిలేశాడు
జాతి ఎదుగుదలే ఆశయమై సాగుతున్న
భారత రత్న మతను
తొలి విమానం నుండి తనదదేమాట
అదే బాట
రతన్......
మన జాతి రత్నం
..... ఇది వీరా గుడిపల్లి కవిత
18
ఇది వీరా గుడిపల్లి కవిత
29072020
సోను సూద్
*********************
పైపైన చూస్తే ఎలా
పనసపండు మల్లె
తొనలు తొలుస్తున్న కొద్దీ రుచుల తీరు మెరుగవుతున్నట్లు
బండమీద రాశిన బలుసుపండ్ల మాదిరి
పాదుల పెరిగిన దొండాకు పసరు మల్లె
అవసరానికి అతడున్నాడు
కంటబడితే చాలు
కాదనకుండా చేయందిస్తాడు
విలన్ వేషాలు వేసి
కధలెన్నో రక్తి కట్టించాడు.
హీరోగా ఆపన్నులకు అండగా నిలిచాడు
పనసైనా బలుసైనా పైకంతేగానీ
లోనంతా సోనూ తీరే
మనకెంతున్నా మట్టిలో కలిసే వరకే
మానవత్వం పరిమళిస్తే మనిషున్నంత వరకూ.....
మానవతిప్పుడు సోనూ గా తిరుగుతుంది.
ఇంటెనుక దొండపాదై కనిపిస్తుంది
...... వీరా గుడిపల్లి
19
ఇది వీరా గుడిపల్లి కవిత
29072020
రాఖీ సాక్షిగా
******************
బొమ్మరిల్లు కట్టిచ్చాను
బతుకమ్మను పేర్చాను
గోరింటాకు తెచ్చాను
నడిచే దారిలో రాళ్ళేరేశా
మాటలు వింటూ మురిసి పోయా
నా చెల్లి
కలకాలం హాయిగా ఉండాలని
పసితనం నుండే ప్రణాళికలు రచించా
కాలమెపుడూ
ఒకే తీరు గుంటుందా
ఎంత పుణ్యం చేసుకున్నారో
మేమెంత ఋణపడి ఉన్నామో
బావా
అనే పిలుపొక్కటి ఇచ్చినందుకు
ఆ యింటి ఎనుగర్రై
వంశానికి రక్షారేకై అందరికీ గొడుగై
తల్లి వేరై కాచుకుంటూ
నా చెల్లి అక్కడ..... ఇప్పుడు
తనదో ప్రపంచం
ఐతేనేం
చుట్టూ వైఫై లా
ఇప్పటికీ నేనే ఎప్పటికీ నేనే
యేటేటా తనుగట్టే రాఖీ సాక్షి గా
...... *వీరా గుడిపల్లి*
20
ఇది వీరా గుడిపల్లి కవిత
30072020
అల్లూ రామలింగయ్య
*******************
అవకాశాలు
అందుకోవడం అందరివల్లా కాదు
హాస్యాన్ని
పండించడమంత సులభం కాదు
సినీ జగత్తును శాసించే స్థాయికి
కుటుంబాన్ని నడిపించడం మాటలు కాదు
మెగా ప్రణాళికలతో
రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని మార్చగలిగే వ్యవస్థకు
పునాదులేశిన మాన్యుడతను
హేతువాదిగా మొదలైన ప్రస్థానం
మంజునాథ చరణారవిందాల దగ్గర విశ్రమించిన తీరు
అల్లూ వారి తరాలకో అర్దం కల్పించి
పద్మశ్రీ నందించిన పావన మూర్తి
క్షీరారామం
రామలింగేశ్వర వరపుత్రుడతను
పాలకొల్లు ప్రతిభావంతుల పుట్టిల్లు మరి
....... వీరా గుడిపల్లి
21
ఇది వీరా గుడిపల్లి కవిత
31072020
స్నేహం
******************
మామా, బావా, అన్నా
చిచ్చా, అన్నా
ఒరేయ్ అన్నా, అరేయ్ అన్నా
పలికేటోడు
వెనుకాముందాలోచించకుండా
యే విషయమైనా పంచుకునేదెవరితో
తప్పా ఒప్పా అని
ఆలోచించకుండా వెంటొచ్చేదెవరు
తిట్టినా కొట్టినా
తిరిగొచ్చి తోడు నిలిచేది??
బాధలో కన్నీటి చుక్కై రాలేది
కధగా మారితే కలమై నడిపేది ???
ఓడిపోయి నపుడు ఓదార్పు
గెలిచొస్తే ఆనందమై
నా చాదస్తాన్ని హరించి
మూర్ఖత్వాన్ని భరించి
మది మీటై
హృది బాటై
నా
నేనై నడిపించే నేస్తం
...... వీరా గుడిపల్లి
22.
ఇది వీరా గుడిపల్లి కవిత
01082020
చెల్లి
*******************
అదే కొమ్మ వారసత్వంగా
చెరోదరిగ
సాగుతున్న ఒకే ప్రవాహం మనం
కొట్టుకునే వేళ ద్విత్వాక్షరాలం
కొట్లాటకు వెళ్ళేటపుడు
సంయుక్తాక్షరాలం
అమ్మా నాన్నలపై
అలిగినపుడు అనునాసికాలం
ఒకరికొకరం గుణవర్ణాలం
యే సంధికి చోటివ్వని పదబంధాలం
హల్లులు గా మసలుతున్న అచ్చులం మనం
భాషా స్వరూపమై
భాసిల్లే బంధం మనది
ఏడు జన్మలది కాదు
ఎన్ని జన్మలకైనా వీడనిది
ఏకకేంద్ర జనితాలై
పాయలుగా విడిపోయినా
కలిసి ఉండే ప్రాణం మనది
యేటా నీ రాఖీ కోసం
చేయిచాపి గడపదగ్గర ఎదురు చూస్తుంటా
అన్నయ్యా అంటే చాలు
అమాంతంగా వాలిపోతా
పాదరక్షనై సదా
నీ గల్మదగ్గరే ఉండిపోతా
..... వీరా గుడిపల్లి
23
ఇది వీరా గుడిపల్లి కవిత
03082020
వింటూనే ఉంటా
******************
అలగడం నీకు అలంకారం
గొడవ పడడం నిత్య కృత్యం
ఐతేనేం
ప్రణాళికా రచనలో రాజీపడడం తెలీదు
అనుకున్నది సాధించే వరకు
అలిసిపోవడం తెలీదు
విసిగిస్తావనిపిస్తుంది కానీ
విజయం వైపు అడుగులు వేస్తుంటావని అర్థమైంది.
కోకిలలు పక్కకు తప్పుకునే స్వరం
సాయి నామ పారాయణమే
సర్వస్వం గా భావించే మనసు
అన్నయ్యా అన్నప్పుడల్లా ఆనందంగా ఉంటుంది.
ఆ పిలుపు కోసం ఎప్పటికీ
ఎదురు చూస్తూనే ఉంటా....
ఈ రాఖీ సాక్షిగా
ఎన్ని మార్లైనా వింటూనే ఉంటా...
రాఖీ కానుకేమైనా ఇవ్వాలనుంది
నీ మాట కంటే చల్లనిది
మనసుకంటే గొప్పనైనది
యెక్కడుంటుంది
అందుకే నాన్నా అని పిలవడం తప్ప
మరేమీ ఇవ్వలేనమ్మా
.......... *వీరా గుడిపల్లి*
ఇది వీరా గుడిపల్లి కవిత
30072020
అల్లూ రామలింగయ్య
*******************
అవకాశాలు
అందుకోవడం అందరివల్లా కాదు
హాస్యాన్ని
పండించడమంత సులభం కాదు
సినీ జగత్తును శాసించే స్థాయికి
కుటుంబాన్ని నడిపించడం మాటలు కాదు
మెగా ప్రణాళికలతో
రాష్ట్ర రాజకీయ స్వరూపాన్ని మార్చగలిగే వ్యవస్థకు
పునాదులేశిన మాన్యుడతను
హేతువాదిగా మొదలైన ప్రస్థానం
మంజునాథ చరణారవిందాల దగ్గర విశ్రమించిన తీరు
అల్లూ వారి తరాలకో అర్దం కల్పించి
పద్మశ్రీ నందించిన పావన మూర్తి
క్షీరారామం
రామలింగేశ్వర వరపుత్రుడతను
పాలకొల్లు ప్రతిభావంతుల పుట్టిల్లు మరి
....... వీరా గుడిపల్లి
21
ఇది వీరా గుడిపల్లి కవిత
31072020
స్నేహం
******************
మామా, బావా, అన్నా
చిచ్చా, అన్నా
ఒరేయ్ అన్నా, అరేయ్ అన్నా
పలికేటోడు
వెనుకాముందాలోచించకుండా
యే విషయమైనా పంచుకునేదెవరితో
తప్పా ఒప్పా అని
ఆలోచించకుండా వెంటొచ్చేదెవరు
తిట్టినా కొట్టినా
తిరిగొచ్చి తోడు నిలిచేది??
బాధలో కన్నీటి చుక్కై రాలేది
కధగా మారితే కలమై నడిపేది ???
ఓడిపోయి నపుడు ఓదార్పు
గెలిచొస్తే ఆనందమై
నా చాదస్తాన్ని హరించి
మూర్ఖత్వాన్ని భరించి
మది మీటై
హృది బాటై
నా
నేనై నడిపించే నేస్తం
...... వీరా గుడిపల్లి
22.
ఇది వీరా గుడిపల్లి కవిత
01082020
చెల్లి
*******************
అదే కొమ్మ వారసత్వంగా
చెరోదరిగ
సాగుతున్న ఒకే ప్రవాహం మనం
కొట్టుకునే వేళ ద్విత్వాక్షరాలం
కొట్లాటకు వెళ్ళేటపుడు
సంయుక్తాక్షరాలం
అమ్మా నాన్నలపై
అలిగినపుడు అనునాసికాలం
ఒకరికొకరం గుణవర్ణాలం
యే సంధికి చోటివ్వని పదబంధాలం
హల్లులు గా మసలుతున్న అచ్చులం మనం
భాషా స్వరూపమై
భాసిల్లే బంధం మనది
ఏడు జన్మలది కాదు
ఎన్ని జన్మలకైనా వీడనిది
ఏకకేంద్ర జనితాలై
పాయలుగా విడిపోయినా
కలిసి ఉండే ప్రాణం మనది
యేటా నీ రాఖీ కోసం
చేయిచాపి గడపదగ్గర ఎదురు చూస్తుంటా
అన్నయ్యా అంటే చాలు
అమాంతంగా వాలిపోతా
పాదరక్షనై సదా
నీ గల్మదగ్గరే ఉండిపోతా
..... వీరా గుడిపల్లి
23
ఇది వీరా గుడిపల్లి కవిత
03082020
వింటూనే ఉంటా
******************
అలగడం నీకు అలంకారం
గొడవ పడడం నిత్య కృత్యం
ఐతేనేం
ప్రణాళికా రచనలో రాజీపడడం తెలీదు
అనుకున్నది సాధించే వరకు
అలిసిపోవడం తెలీదు
విసిగిస్తావనిపిస్తుంది కానీ
విజయం వైపు అడుగులు వేస్తుంటావని అర్థమైంది.
కోకిలలు పక్కకు తప్పుకునే స్వరం
సాయి నామ పారాయణమే
సర్వస్వం గా భావించే మనసు
అన్నయ్యా అన్నప్పుడల్లా ఆనందంగా ఉంటుంది.
ఆ పిలుపు కోసం ఎప్పటికీ
ఎదురు చూస్తూనే ఉంటా....
ఈ రాఖీ సాక్షిగా
ఎన్ని మార్లైనా వింటూనే ఉంటా...
రాఖీ కానుకేమైనా ఇవ్వాలనుంది
నీ మాట కంటే చల్లనిది
మనసుకంటే గొప్పనైనది
యెక్కడుంటుంది
అందుకే నాన్నా అని పిలవడం తప్ప
మరేమీ ఇవ్వలేనమ్మా
.......... *వీరా గుడిపల్లి*
No comments:
Post a Comment