11:02 PM, 10/21/2020]
డాడీస్ ఆర్మీ
పోయినేడు వారిదే
ఈ యేడూ వారిదే
ఔనది డాడీస్ ఆర్మీ
ఇట్స్ వీరాస్ వర్డ్.... 1
మూడబిద్రి
ఒకటి కొకటి పోలికే లేదు
వేలిముద్రల్లా కంటి పాపల్లా
ఔనది మూడబిద్రి
ఇట్స్ వీరాస్ వర్డ్.... 2
షబే మేరాజ్
మంచి చెడులు తెలిసిన రోజు
భక్తునితో భగవంతుడు పలికినరోజు
షబే మేరాజ్
ఇట్స్ వీరాస్ వర్డ్... 3
ప్రత్యర్థి
పక్కవారితో పోల్చుకోకు
పైకొస్తావంది పరమేశ్వరణ్
నీకు నీవే ప్రత్యర్థి కావాలి
ఇట్స్ వీరాస్ వర్డ్... 4
డాక్సింగ్ డాగ్
నమ్మకాన్ని ఖూనీ చేశావ్
అభిమానాన్ని అమ్మకానికి పెట్టావు
డాక్సింగ్ డాగ్
ఇట్స్ వీరాస్ వర్డ్...5
హే డే
ఒక్క రోజు తో రాలేదు
ఒక్కడిగా చేరుకోలేదు
హేడే
నీవిచ్చిన ధైర్యమది
ఇట్స్ వీరాస్ వర్డ్... 6
సంగీతా శర్మ
అవసరమై అడుగేసి
నేర్చుకుంటూ నేర్పుతుంది
అనుభవాలకు ఆధునిక తను జోడించమంటుంది సంగీతా శర్మ
అన్నదాతలకాలంబనై
ఇట్స్ వీరాస్ వర్డ్... 7
ఏలేటోడికి మనసుండాలి
గంతలతో నామినేషన్
ఒకేచోట వందల మంది
ఏలేటోడికి మనసుంటే
అన్నీ నిరసన రూపాలే
ఇట్స్ వీరాస్ వర్డ్...8
బ్యూటీ పార్లర్
అందం ఆరోగ్యం కవల పిల్లలే
అందుకే
తీహార్ జైలులో బ్యూటీ పార్లర్
ఇట్స్ వీరాస్ వర్డ్...9
టెడియా భానుమతి
కృంగిపోవడం ఖర్మను కోవడం
మా రక్తం లో లేదు
టెడియా భానుమతి వారసులం
ఇట్స్ వీరాస్ వర్డ్...10
బీ బ్రేవ్
నీదో ఊరు నాదో ఊరు
నిద్రలో గూడా నన్నే కలవరిస్తావు
నీ బాదేంటసలు బీ బ్రేవ్
ఇట్స్ వీరాస్ వర్డ్....11
ఊతమివ్వడం ముఖ్యం
గెలుపోటములు ముఖ్యం గాదు
మేమున్నామని ముందడుగేశావు
లాల్ త్లమౌనీ
ఉనికికి ఊతమవడమే విజయం
ఇట్స్ వీరాస్ వర్డ్...12
మైండ్ ట్రీ
ఓడిపోయే యుద్ధమెందుకు
మధ్యే మార్గం మైండ్ ట్రీ
అందరూ విజేతలే
ఇట్స్ వీరాస్ వర్డ్...13
నిరసన రూపం
బ్రతుకంతా భయం లేకుండా బతకడం
ప్రజా స్వామ్య పరిమళం
చావడానికి యనుమతంటే చక్కని నిరసనరూపం
ఇట్స్ వీరాస్ వర్డ్..... 14
సూర్య కాంతం
ఆపేరు నెంత ప్రేమించిందో
మరెవరూ పెట్టుకోకుండా
సూర్య కాంతంసూపర్ స్టార్
ఇట్స్ వీరాస్ వర్డ్....15
సింపుల్ టన్
నిన్ను నీవు విసిరేసుకోకు
అరిచినంతమాత్రాన అందుతుందా
అందమైన చందమామది
ఇట్స్ వీరాస్ వర్డ్... 16
స్కేర్ క్రో
చేసేదేం లేకున్నా చేయాల్సినదెంతున్నా
నిన్నొదుల్కోం
మనకో స్కేర్ క్రో కావాలి
ఇట్స్ వీరాస్ వర్డ్... 17
వోటు
ఆయనందించిన ఆయుధం
అందరినీ నా గడపకు పంపింది
వేసేతీర్తాను
ఇట్స్ వీరాస్ వర్డ్.... 18
యూ ట్యూబ్
టైం పాస్ కావాలన్నా టైం వేస్ట్ చేయాలన్నా
టైం దిద్దుకోవాలన్నా
అక్కరకొచ్చే చుట్టం యూట్యూబ్
ఇట్స్ వీరాస్ వర్డ్...19
గీతలు
ఆరొందల కోట్లను ఆరు రాశులు జేసి (1200/2,12/2)
చేతుల్లో గీతలు గీసి జెప్పిన
సదువుకుంటవో సదివిచ్చు కుంటవో
ఇట్స్ వీరాస్ వర్డ్... 20
మనింటి ముందుకే
అవసరాలే అన్నీ శాసిస్తాయి
చార్మినార్ సికింద్రాబాద్
మెహదీ పట్నం, ఎల్బీనగర్
మనింటిముందుకే మాంసాహారం
ఇట్స్ వీరాస్ వర్డ్... 21
స్మితా సబర్వాల్
సాధించాలనే సంకల్పం, సాహసాల సమాహారం
నిస్తేజాన్ని ఊడ్చేయడం చైతన్యాన్ని నింపిపోవడం
స్మితా సబర్వాల్ నైజం
ఇట్స్ వీరాస్ వర్డ్.,22
స్మితా సబర్వాల్
రూపెత్తిన మంచితనం,అలదుకున్న యభినివేశం
కదిలొచ్చే ధైర్యం, కనిపించే నమ్మకం
స్మితా సబర్వాల్
ఇట్స్ వీరాస్ వర్డ్... 23
మల్లడగను
ఎండల్ని తగ్గించేస్తా,వానల్ని కురిపించొస్తా
చలిలేకుండా చేస్తా బబ్బాబు వోటెయ్యండి
మల్లడగను నమ్మండి
ఇట్స్ వీరాస్ వర్డ్...24
ఏటీయం
ఎనీ టైం మనీ, ఎనీ టైమ్ వాటర్
ఎనీ టైం వోటుంటే నా సామిరంగా
ఎవ్రీ టైం మావెంటుండే టోళ్ళు గదా
ఇట్స్ వీరాస్ వర్డ్... 25
తప్పే
లేనోని గురించి మాట్లాడుకోవడం తప్పే గాని
రోజు నాల్గుసార్లనుకోవాల్సి వస్తాంది.....
దేవుడా
ఇట్స్ వీరాస్ వర్డ్...26
చతురంగ బలాలు
ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్
నాల్గవది గా ఇస్రో
పదాతి అశ్విక గజదళాలతో
లొట్టిపిట్టలో,రధాలో
నాడైనా నేడైనా చతురంగ బలాలే
ఇట్స్ వీరాస్ వర్డ్...27
రోడ్లమీద నే
పన్జేసేదెక్కడైనా,అప్పెండౌన్ హైదరాబాద్
సగంజీవితం రోడ్లమీద నే
ఇట్స్ వీరాస్ వర్డ్...28
ఓటమి లేదు
గెలిపించామనుకోవడంలేదు
గెలిచామనుకుంటున్న వోటర్
పోరుబాటకు ఓటమి లేదు
ఇట్స్ వీరాస్ వర్డ్.. 29
అలుగుదాటింది
వోటేసి ఓడిపోవడం అలవాటైన నేను
నన్నే గెలిపించుకున్నానిన్నాళ్ళకు
తనకు వోటేసి
ఆవేశం అలుగు దాటింది
ఇట్స్ వీరాస్ వర్డ్..30
రోడ్లంటుకుంటున్నాయి
అరికాళ్ళు బొబ్బలెక్కుతున్నాయి
ఒళ్ళంతా మంటలు
రోడ్లంటుకుంటున్నాయి
ఇట్స్ వీరాస్ వర్డ్...31
అగ్నిపునీతులు
ఎండాకాలం ఎన్నికలు
అగ్ని పునీతులౌతున్న అభ్యర్థులు
ఇట్స్ వీరాస్ వర్డ్...32
షా ఔట్
అసాధ్యమన్నదే లేదు నొప్పన్నదే తెలీదు
షా ఔట్
జో కామెరాన్ అవనిపై అధ్భుతం
ఇట్స్ వీరాస్ వర్డ్...33
ఎర్రబస్సు
పల్లెవెలుగు వచ్చింది
ఎర్రబస్సు మాయమైంది
యాప్ గా మారి మొబైలెక్కింది
ఇట్స్ వీరాస్ వర్డ్..34
గెలవడం కోసం
గెలిపించేందుకు కాదు ఓటేసేది
గెలవడం కోసం వేయాలి
ఆయుధాన్ని అందించిన అంబేద్కర్ దీవించేలా
ఇట్స్ వీరాస్ వర్డ్...35
నేనోడిపోను
నేనెప్పుడూ ఓడిపోను
ఎందుకంటే
నా లక్ష్యం నీ గెలుపు కదా
ఇట్స్ వీరాస్ వర్డ్... 36
తప్పు
ఆయుధాన్ని తప్పుపట్టడం మూర్ఖత్వం
ప్రేమిద్దాం.... సరిగ్గా చంపినందుకు
ప్రయోగించిన వారిది కదా తప్పు
ఇట్స్ వీరాస్ వర్డ్... 37
బ్రతుకాలనుకున్నాక
ఒక్కటే పని
నన్ను నేను కవిత్వం చేసుకోవడం
బ్రతకాలనుకున్నాక తప్పదు మరి
ఇట్స్ వీరాస్ వర్డ్....38
గీతలు
పొమ్మని ఇక్కడ పాస్పోర్ట్ ఇవ్వాలి
రమ్మని అక్కన్నుండి వీసా రావాలి
ఎవరు గీసిన గీతలవి
ఇట్స్ వీరాస్ వర్డ్...39
ఉన్నట్లా
అక్షరమై ఇక్కడ వాలి
వాక్యమై నీకోసం కదలనపుడు
ఉన్నట్లా ఇంకా
ఇట్స్ వీరాస్ వర్డ్...40
మార్పు
బావి నీళ్లు ,బోరు నీళ్లు,వాగునీళ్ళు నాడు
కిన్లీ,బిస్లరీ,ఆక్వా నేడు
మార్పు మంచిదేనా
ఇట్స్ వీరాస్ వర్డ్....41
చప్పట్లే
అన్ని మస్తకాలు కలిసినచోట
ఎన్ని పుస్తకాలు కన్పిస్తాయో అనుకుంటే
దుప్పట్లు చప్పట్లే
ఇట్స్ వీరాస్ వర్డ్.... 42
రుచి
వండిన వంటలోనో
వడ్డించే చేతుల్లోనో కాదు
ఆకొన్నవాడి ఆకల్ని బట్టి ఉంటుంది
ఇట్స్ వీరాస్ వర్డ్...43
నీ మాట
ఏటికాల్వకు మాకులేశి పంచుకున్నట్లు
నీ నవ్వు
నేలదారుల మాటమీద ఊరంతా నడిచినట్లు
నీమాట
ఇట్స్ వీరాస్ వర్డ్...44
పంచాంగం
పీఆర్సీ రాకుండా నే
ఆదాయవ్యయాలు ఐదూబై రెండు
రాజపూజ్యం ఐదూబై నాల్గు
ఇట్స్ వీరాస్ వర్డ్..45
పుణ్యం=
కూలిపోతుందనుకున్న దూలాన్ని
మొగురం బోయి ఆదుకున్నది
మండువా లోగిలి ఏం పుణ్యం చేసుకుందో
ఇట్స్ వీరాస్ వర్డ్...46
ఛాన్సుందా
నా మాటే నెగ్గాలని నీవు
నీమాటే నెగ్గాలని నేను
మనం గెలిచేఛాన్సుందా
ఇట్స్ వీరాస్ వర్డ్...47
ఏంట్రా ఇది
కాలం దైవసమానమంటాడు వాడు
మతిలేనోడు కూడా చికాకు పెడుతున్నాడంటే నవ్వెళ్ళిపోతావు
ఏంట్రా ఇది
ఇట్స్ వీరాస్ వర్డ్...48
నమ్మవేంట్రా
బ్రతికే ఉన్నాడంటే నమ్మవేంటి
ఉగాది నాడు
నీ దదే ప్రశ్న నాదిదే జవాబు
నమ్మవేంట్రా
ఇట్స్ వీరాస్ వర్డ్... 49
సాహితీ సేద్యం
అక్షరం నీవై .. వాక్యం నేనై
కవితంతా మనమై
సాహితీ సేద్యం చేస్తున్నాం
ఇట్స్ వీరాస్ వర్డ్...50
హరివిల్లు
ఆకాశం లో లేౙర్ లైట్
చినుకూ చిఱుఎండ ల
కాపురానికి సాక్ష్యం
ఇట్స్ వీరాస్ వర్డ్..51
గాలిగోపురం
కాలిగోపురం గాలిగోపురమైంది
దగ్గర కొచ్చావచ్చేయమని పిలిచే
మూగ కట్టడం
ఇట్స్ వీరాస్ వర్డ్...52
పంచాంగం
ఎవరికి నచ్చిన జాతకం వారికి చెబుతున్నారు
పంచాంగం కూడా ఏ గడప పాట ఆగడపదగ్గరే
ఇట్స్ వీరాస్ వర్డ్... 53
రజనీ
ఊరిస్తున్న ఊపిరి
ప్రజా హృదయాలు పరితపిస్తున్న
పాదరసం
ఇట్స్ వీరాస్ వర్డ్...54
లిబియా
నాడు గడాఫీ నేడు హఫ్తార్
నేలవిడిచి సాము జేసిన
సంపన్నుల కన్నుబడ్డ సంపన్న దేశం
ఇట్స్ వీరాస్ వర్డ్...55
తప్పు కాదు
వెటరన్స్ కు విశ్రాంతి నివ్వడం
వెఱ్ఱి పోకడనుకుంటున్నావు
జాతి క్షేమమే
లక్ష్యమని చాటిచెప్పిన నేత తాను
విశ్రాంతి నివ్వడం తప్పుకాదు
ఇట్స్ వీరాస్ వర్డ్...56
ఎఫెసు చర్చి
ఏమైనా జరిగుండొచ్చు
నేడు శిథిలావస్థలో పడుండొచ్చు
జనావళిని జాగృతం చేసిన జ్ఞానక్షేత్రం
ఇట్స్ వీరాస్ వర్డ్... 57
పేటెంట్
ఈ పండుగ లెందుకో పాతబడవసలే
కొత్త వెందుకు బుట్టడం లేదో
పేటెంట్ ఆనాటినుండున్నట్లుంది
ఇట్స్ వీరాస్ వర్డ్...58
గెలుపు
మౌనానికి చెరోవైపు మనం
ప్రకటించని యుద్ధం చేస్తున్నాం
ఒకరి గెలుపు మరొకరు కోరుకుంటూ
ఇట్స్ వీరాస్ వర్డ్...59
కోరుకునే వాళ్ళం
గుడ్లురుమని అమ్మానాన్నలు
కన్నెర్ర జేయని ఉపాధ్యాయులుంటే బాగుండు
పిల్లలుగానే ఉండాలని కోరుకునే వాళ్ళం
ఇట్స్ వీరాస్ వర్డ్...60
తుడుచుకుంటున్నట్లుంది
బుగ్గలపై ధారలు
మనసు తడిసిపోయింది
కళ్ళు మూతలు పడుతున్నాయి
తడి తుడుచుకుంటున్నట్లుంది
ఇట్స్ వీరాస్ వర్డ్...61
ఎందుకింత పగ
మూడు ముళ్లు, ఏడడుగులు, నూరేళ్ళు పోనీలే అనుకుంటే
ఏడేడు జన్మలట !!ఎందుకింత పగ వీడికి
ఇట్స్ వీరాస్ వర్డ్...62
వస్తుంది
ఆత్మ ఎప్పుడో అణచి వేయబడింది
మనసు చే తొక్క బడింది
బయటపడే రోజొస్తుంది
ఇట్స్ వీరాస్ వర్డ్...63
మూసుకోవాల్సిందే
నాగోల్ మూసీ పక్కన నిలబడితే ముక్కు
నీ పక్కన నిలబడితే చెవులూ
మూసుకోవాల్సిందే
ఇట్స్ వీరాస్ వర్డ్...64
ఆపలేక బోయింది
నల్లజెర్వు కట్ట మాయమైతుంది(ఉప్పల్)
కట్టమైసమ్మ టెంపుల్ మాత్రమే కనబడుతుంది
అమ్మ గూడ ఆపలేక పోతుంది
ఇట్స్ వీరాస్ వర్డ్...65
ఐపీఎల్
అంతర్జాతీయం గా ఎదురే లేదు
స్థానికంగా గెలుపే లేదు
ఐపీయల్ చెప్పిన జాతకం
ఇట్స్ వీరాస్ వర్డ్...66
భుజోడీ
గుజరాత్ పార్లమెంటు భవనం
రేర్ రెప్లికా
భుజోడీ మినీ పార్లమెంట్
ఇట్స్ వీరాస్ వర్డ్...67
శ్వేతా షాహీ
బదరీ నలందా బీహార్ మార్గం
యూట్యూబ్ దిద్దిన ఛాంపియన్
రగ్బీ లో రాణించిన శ్వేతా షాహీ
ఇట్స్ వీరాస్ వర్డ్...68
పెద్దపల్లి
పొత్తిళ్ళలో నల్లబంగారం
వెల్గులు జిమ్మే యన్ టీ పీసీ
గోదావరందాల కాళేశ్వరం
కడుపులో దాచుకున్న భూతల స్వర్గం
ఇట్స్ వీరాస్ వర్డ్... 69
జెఫ్ బెజోస్ మెకంజీ బెజోస్
విడిపోయినట్లుందా
తొలిప్రేమలో పడినట్లుంది
దటీజ్ అమెజాన్ పేర్
ఇట్స్ వీరాస్ వర్డ్... 70
నువ్వు మారవు
అందమైన మోసం నీ ప్రేమ
గెట్టుదగ్గర కాపలా బెట్టి
నువ్వు మారవు
ఇట్స్ వీరాస్ వర్డ్...71
నమ్మిస్తున్నా
మంత్రాలకు రాలని చింతకాయ
నేనే తెంపాలి
మంత్రాలకే రాలిపడిందని నువ్వు నమ్మిస్తున్నా
ఇట్స్ వీరాస్ వర్డ్...72
ఐపిటీ యూ
ఆకాశం పై ఉమ్మేయడం ప్రమాదమని ఈపాటికే తెలిసుండాలి
ఇంకా తెలియరాలేదంటే ఐ పిటీ యూ డియర్
ఇట్స్ వీరాస్ వర్డ్... 73
తప్పదు
నిన్ను తలుచుకోకుండా ఉండలేని వారో నలుగురున్నారంటే
వారి కోసమైనా ముందుకు వెల్తుండాలి.
ఇట్స్ వీరాస్ వర్డ్...74
వెలుగు కోసం
చుక్కలన్నీ
చూపుడు వేళ్ళపై చేరాయి
వేలెత్తి చూపడానికి కాదు వేకువరేకల వెలుగు కోసం
ఇట్స్ వీరాస్ వర్డ్...75
భరోసా
చూపుడు వేలు పై చుక్క
మరకమంచిదే
భవిష్యత్తు కు భరోసా నటిస్తూ
ఇట్స్ వీరాస్ వర్డ్... 76
నిర్ణేత
ఈ సీౙన్ బాగుంది, అన్నీ ఎలక్షన్సే
రాజూ మంత్రీ వోటరే
ఎన్నికలనిర్ణేత కదా
ఇట్స్ వీరాస్ వర్డ్...77
తెలిసీ
ఇప్పుడందరూ
చుక్కలయుధ్ధం చేస్తున్నారు
ఓటమి తప్పదని తెలిసీ
ఇట్స్ వీరాస్ వర్డ్... 78
జయిద్దామనే
న్యాయానికి న్యాయమెప్పుడు జరిగిందని
అన్యాయినికి అన్యాయమెప్పుడు జరిగిందని
చూపుడు వేలు పై చుక్క తో జయిద్దామనే..
ఇట్స్ వీరాస్ వర్డ్.. 79
చుక్క
తినకు వచ్చిన లాభమేంటి
తనకు జరిగిన నష్టమేంటి
చూపుడు వేలు పై చుక్కేనా
ఇట్స్ వీరాస్ వర్డ్..80
పోనీలే
ఒక్క పూట బువ్వదిని
జీవితాన్ని తన పాదాలనభిషేకించడానికి కెటాయించావు
నీ జాతి పొట్ట గొట్టావు
విశ్వాసమా విశ్వాసఘాతుకమా
ఇట్స్ వీరాస్ వర్డ్.. 81
మంచి వాళ్ళు ఉంటారు
బాబాసాహెబ్ ను పంపించాడు కదా
భగవంతుడున్నాడు... అందరూ శ్రీ రామచంద్రులు కాలేరు
మంచివాళ్ళుంటారు
ఇట్స్ వీరాస్ వర్డ్...82
రాయైపోయిండు
రాశిపెట్టున్నది తప్పించు కోలేమట
రాశినోడేమో రాయైపోయిండు
ఇట్స్ వీరాస్ వర్డ్...83
నిధీ! యూ ఆర్ కరెక్ట్
దిమాఖ్ ఖరాబ్ చేస్తానంటే నవ్వొచ్చింది
ఉంటేగదా చేయడానికి
నిధీ! నీ మాటే కరెక్ట్
ఇట్స్ వీరాస్ వర్డ్....84
కోతకో మేతకో
నిన్నే నమ్మిన ప్రాణాలవి
తీస్కెల్లేది కోతకో మేతకో
ఇట్స్ వీరాస్ వర్డ్..85
ఛాన్సే లేదు
అమ్మ నాన్న తమ్ముడు
అక్కా చెల్లీ అన్నా ఏబంధానికీ తాడు లేదు
విడి పోయే ఛాన్సేలేదు
ఇట్స్ వీరాస్ వర్డ్. ..86
మనోభావాలు
మంచుంటే స్వీకరించి
అవసరం లేనివి వదిలేద్దాం
ఇది మనోభావాల యుగం
ఇట్స్ వీరాస్ వర్డ్.. 87
మెట్రో ట్రైన్
సౌకర్యాలకు కొదవే లేదు
సమయపాలన సమస్యే కాదు
అందనంత ఎత్తులో వెల్తున్నా ఆకాశయానం కాదు
ఇట్స్ వీరాస్ వర్డ్.. 88
విశ్వనగరం
భయమేస్తుంది కానీ భద్రతనిస్తుంది భవిష్యత్తు కు భరోసానిస్తుంది
విశ్వసిస్తే విశ్వనగరం.. భాగ్యనగరం
ఇట్స్ వీరాస్ వర్డ్.. 89
ఆశలరెక్కలు
అడుగులు అమీర్ పేట నుండే పడుతున్నా
ఆశలరెక్కలు అమెరికాలో విప్పుకుంటాయి
ఇట్స్ వీరాస్ వర్డ్.. 90
సీపీయస్ వ్యూహం
పోరాటరూపం పోటీ చేయడమేనా
నాడు నల్గొండ,నిన్న నిజామాబాద్
రేపెక్కడో..సీపీయస్ వ్యూహం
ఇట్స్ వీరాస్ వర్డ్...91
వీళ్ళు
ఖండాంతరాలు దాటెల్తూ వాళ్ళు
గడపదాటలేని స్థితిలో వీళ్ళు
ఆనందభాష్పాలు రాలుస్తూనే
ఇట్స్ వీరాస్ వర్డ్...92
ఏమా పరిమళం
ఏమా పరిమళం
ఏ కలం నుంచి జారిపడిన వాక్యమో
మనసెల్తుంది వెతుక్కుంటూ
ఇట్స్ వీరాస్ వర్డ్...93
చిత్తలూరికి కృతజ్ఞతలతో
తను కనిపించే సరికి
పులకింత, ఈ వయసులో కూడా
ఆనందాంబుధి లో ఈదులాడుతూ
తను కనిపించే సరికి
ఇట్స్ వీరాస్ వర్డ్...94
ఏమో
అక్కడేదో టెంటు మొలిచింది
ఎత్తిన పిడికిల్లు కనిపిస్తున్నాయి
ఏమో నేను పోగొట్టుకున్న వాక్యం దొరకొచ్చు
ఇట్స్ వీరాస్ వర్డ్...95
చిత్తలూరికి కృతజ్ఞతలతో
ప్రశంస
మనసంతా ఉడుకుతోంది,
కడుపు మండిపోతుంది
వాళ్ళెవరో నా పక్కవాన్ని ప్రశంసిస్తున్నారు
ఇట్స్ వీరాస్ వర్డ్... 96
బంగారం
అందరి వల్లౌతుందా బంగారాన్ని గుర్తించడం
గుర్తిస్తే వదులుకుంటారా
నా వాక్యం బంగారం
ఇట్స్ వీరాస్ వర్డ్...97
రాయడమెందుకు
అర్థం కాలేదా నా నోట వినాలనా
ప్రతిదీ విడమర్చి చెప్పాలంటే..
రాయడమెందుకు
ఇట్స్ వీరాస్ వర్డ్..98
ఫైరింజన్
తాగడం తప్పంటావా
జ్ఞాపకాలంటుకుంటుంటే ఫైరింజన్ పనిచేయదుకదా
ఇట్స్ వీరాస్ వర్డ్...99
ఇష్టం మరీ
జీ హుౙూరనే వాక్యాలను జోకొడుతాను
తిరుగుబాటు నేర్పే వాక్యాలను ప్రేమిస్తాను
నీవంటే నాకిష్టం మరీ
*ఇట్స్ వీరాస్ వర్డ్... 100
TBA 00038
[11:03 PM, 10/21/2020] Veera Gudipally: వీరాస్ సెటైర్స్
మరవడమెలా
వాడు చేసిన ద్రోహం మరవడమెలా
రోజంతా మెడచుట్టూ వేలాడుతుంటే
ఇట్స్ వీరాస్ వర్డ్ 101
వాడంతే
కట్టేశాననుకుంటున్నాడు
కసితో
రగిలిపోతున్న విషయం తెలీదు
వాడంతే
ఇట్స్ వీరాస్ వర్డ్...102
పొరబడి
మెడలో గుత్పేసినపుడే అనుకున్నా
మనిషి లా చూడలేవని
మారతావనుకున్నా మనిషని పొరబడి
ఇట్స్ వీరాస్ వర్డ్...103
కవి
కవి అంటే యెవరని అడిగింది తాను కానిదెవరన్నాను నేను
తెలుసన్న మాటనుకుంటూ క్రీగంట చూసెళ్ళిపోయింది
ఇట్స్ వీరాస్ వర్డ్...104
వెళ్ళింది
ఒకరి గెలుపు మరొకరి ఓటమికదా వెక్కిరింతలవసరమా అన్నది తాను
కవిరాయని వాక్యాలుంటాయన్నాను
కాసేపాగు వస్తానంటూ వెళ్లింది
ఇట్స్ వీరాస్ వర్డ్...105
బంధు గణం
జయరాములు సార్ మెసేజ్ చూశావా అన్నది తాను
సార్ మనసంతా చిత్తలూరేనాయె మనమంతా బంధు గణమే కదా అన్నాను
మెల్లగా అలా సుతారంగా నా బుగ్గ గిల్లి వెళ్లింది
ఇట్స్ వీరాస్ వర్డ్.. 106
విజేత
అగ్రాహంకారానికి సవాలయ్యాక శరణార్థిని కాపాడే ధైర్యం వాడికెక్కడిది
కథకోసం చూడాలంతే
వికీలీక్స్ అసాంజే విజేతే కదా
ఇట్స్ వీరాస్ వర్డ్..107
ఎంతదృష్టం
కోడె దూడటగా అన్న దామె
ఔనన్నాను
ఏంపని చేయకుండా ఎంతదృష్టం
బీ హ్యాపీ అంటూ వెళ్లి పోయింది
ఇట్స్ వీరాస్ వర్డ్..108
తెలుస్తోంది
అందరూ అరుణామేడమ్ నే అభినందిస్తున్నారేంటి అన్నాన్నేను
నిస్వార్థంగా పనిచేయడం నేర్చుకో తెలుస్తోందంటూ వెళ్లి పోయింది తాను
ఇట్స్ వీరాస్ వర్డ్.. 109
నెవర్
ఆమె కతనో పసిపాప అతనికామె అరాధ్యదేవత
ఆ బంధం మంతే సున్నాతో భాగహారం
నాట్ డివిజిబుల్ నెవర్ డివిజిబుల్
ఇట్స్ వీరాస్ వర్డ్..110
వెల్తున్నా
ఎంతబాగా రాస్తున్నాడతడన్నాను
పైనింకా శాలువాపడనట్లుందంది
నాపైబడిన శాలువాలు లెక్కించుకోవడాని కెల్తున్నా
ఇట్స్ వీరాస్ వర్డ్... 111
న్యాయ దేవత
న్యాయం మొలిచింది నమ్మకం పెంచింది
వందేళ్ళుగా పరిమళిస్తుందీగడ్డపై
తెలంగాణహైకోర్టు
ఇట్స్ వీరాస్ వర్డ్ 112
వేరేమున్నాయ్
లెక్కలొస్తే బతకొచ్చు, కవిత్వం తెలిస్తే జీవించొచ్చు
ఆరెండూ తప్ప వాడికేం తెల్సంటున్నారు
వేరే మున్నా య్
ఇట్స్ వీరాస్ వర్డ్...113
పిడికిలి
సమస్యే తప్ప మనిశెప్పుడూ శతృవు కాదు
చేతులు జోడించి నపుడు పనికాకపోతే పిడికిలి బిగించక తప్పదు కదా
ఇట్స్ వీరాస్ వర్డ్.. 114
మనూరి బస్సు
ఏవీ అఖ్ఖర్లేని వారికి అన్నీ వాటంతటవే వస్తాయి
పనిలేకుండా నిలబడి నప్పుడు వచ్చే మనూరి బస్సుల్లా
ఇట్స్ వీరాస్ వర్డ్...115
భ్రమలో
నిన్నన్నప్పుడు కోపం రాలేదు వాడిననగానే ఎగిరి పడ్డావు
బాధ్యతన్నా కావాలి భ్రమలోనన్నా ఉండాలి
ఇట్స్ వీరాస్ వర్డ్..116
జవాబిస్తామా
అభియోగాలపై దిగజారిపోయి ఖండించలేనన్నాడతను
నోరు పారేసుకున్న ప్రతోరికీ జవాబిస్తామా
ఇట్స్ వీరాస్ వర్డ్...117
సాక్షి 12/21042019
వ్యవసాయమే
నాకోపాన్నిట్టే మింగేస్తుంది
క్షణాల్లో ఓ చిఱునవ్వును నాటెల్తుంది.
తనదీ వ్యవసాయమే
ఇట్స్ వీరాస్ వర్డ్.118
టెలీపతీ తెలుసేమో
నేననుకున్నానని యెలా తెలుస్తుందో
అలారం మోగుతుంది చెవిలో చేరిపోతుంది
టెలీపతీ తెలుసేమో
ఇట్స్ వీరాస్ వర్డ్..119
మాయంటదేకదా
తెలియకప్పుడు తెలిసిప్పుడదే పొరపాటు
ఎదిగానంటూ ఏమార్చుకుంటున్నావు
మాయంటదేకదా
ఇట్స్ వీరాస్ వర్డ్...120
అవసరం
జోకేంటో తెలియదుగానీ
నవ్వాల్సిందే. ఆయనజెప్పాడు గదా
అవసరమలాంటిది
ఇట్స్ వీరాస్ వర్డ్...121
లక్ష్యం
నో కాంప్రమైజ్ అనే సందేశం ఇవ్వడానికి
ఎన్నిసార్లు కాంప్రమైజ్ అయ్యానో
లక్ష్యం చేరడం కదా కావాల్సింది.
ఇట్స్ వీరాస్ వర్డ్..122
సాక్షి/22042019
రజనీ
వస్తాడట అసెంబ్లీ వరకాగమంటున్నాడు
ఎప్పుడు రావాలో తెలిసినోడు
ఊరించడం కొత్తేం కాదు లే
ఇట్స్ వీరాస్ వర్డ్.. 123
అంతర్మధనం
తాను పరిచయం చేసినంత మాత్రాన తనకంటే పైకెదగ వద్దా
ది మోస్ట్ బ్యూటిఫుల్ ఫేస్ ఆన్ ఇండియన్ స్క్రీన్ అంతర్మధనం
ఇట్స్ వీరాస్ వర్డ్...124
కుర్సీ నాది మరీ
గెలిచే వరకూ పోటీ చేస్తా సాలీడు కథ చదువుకోలేదా
ఆ కుర్సీ నాది మరీ
ఇట్స్ వీరాస్ వర్డ్...125
ఆ యిద్దరు
గెస్ట్ హౌజ్ ఘటనదేముంది
గెస్ట్ ఆఫ్ ఆనర్ ముఖ్యం
ఒకే వేదికపై ఆ యిద్దరు.
పగలూ పంతాలు పదవులకంటేనా
ఇట్స్ వీరాస్ వర్డ్...126
వదలడన్నమాట
బావులన్నీ మాయమైనా
కూపవేధాదోషం మాత్రం మాయం కాలేదట
సంప్ , ట్యాంకులుగా వేధిస్తుంటే
వాస్తుదోస్తు వదలడన్నమాట
ఇట్స్ వీరాస్ వర్డ్..127
అరిచాయంట
మారరింక మీరింకమారరంతే
ఎవడి గొప్ప వాడిదే ఎందుకిప్పుడు రాద్ధాంతం
ఆర్నెల్ల తర్వాత అవేవో అరిచాయంట
ఇట్స్ వీరాస్ వర్డ్...128
ముందు
షాంగ్రీలా, సినమన్ గ్రాండ్, కింగ్స్బరీ ,జియోన్ ఇంకా సెబాస్టియన్
ఎన్ని వందలమందిని చంపావు
నీరాజ్యం సల్లగుండ నువ్వు మారరా ముందు
ఇట్స్ వీరాస్ వర్డ్...129
దీపాలీ
కన్నబిడ్డకు కష్టమొస్తే కలబడతాం కలిబెడతాం
చిఱుతైనా, సివంగైనా,ఎదురుగనున్నది యెవరైనా
పేగుబంధమది దీపాలీ !!!
ఇట్స్ వీరాస్ వర్డ్..130
సాక్షి 9/23042019
కంఫర్ట్ కాస్ట్యూమ్
వీనెక్ హైనెక్ టర్టిల్ నెక్ స్లీవ్ లెస్ బ్లాక్ డీప్ టాంటాంషేప్ ఏదైతేనేం
వన్నెలీనుతుంది వయసు తగ్గిస్తుంది
కంఫర్ట్ కాస్ట్యూమ్ టీషర్ట్
ఇట్స్ వీరాస్ వర్డ్..131
0=99
నేటి సున్నా రేపటి తొంబై తొమ్మిది
ఐనిస్టీనైనా ఐజాక్ న్యూటనైనా పుట్టుకతోనే సిద్ధాంతాలు కనిపెట్టలే
ఇంటర్ బోర్డు యేంచేసింది పాపం
ఇట్స్ వీరాస్ వర్డ్..132
బాయిజాబాయ్
పనిలేకుండా తిరిగే ఫకీరును ద్వారకామాయి (షిర్డీ) దాటకుండా చేసింది
తనపని తాను చేసుకుంటూ బాయిజాబాయ్
ఇట్స్ వీరాస్ వర్డ్...133
వెతుకుతున్నా
ఎన్ని డైలాగులుగొడితేనేం ఎవడిపైబడి యేడిస్తేనేం
ఆఖరికారంగేగదా బూసుకునేది
రంగులు మార్చనోడేడుండని వెతుకుతున్నా
ఇట్స్ వీరాస్ వర్డ్..134
నమ్మిస్తారు
యుద్ధం మొదలయ్యాక నిజాలతో పనేముంది
గెలిచిందే సత్యమని నమ్మిస్తారు సత్యమే గెలవాలనుకుంటాంకదా
ఇట్స్ వీరాస్ వర్డ్...135
పట్కపోతుండు
ఆటకు బానిసైనోడు ఆడొక్కడే బోతుండు
మతానికి బానిసైనోడు మనందరినీ బట్టుక పోతుండు
ఇట్స్ వీరాస్ వర్డ్...136
పలకరిస్తుంది
అభివృద్ధి జరగలేదన్నదెవరు
నాలుగు చినుకులు పడితే చాలు చెఱువే మాయింటికి వచ్చి పలకరిస్తుంది
ఇట్స్ వీరాస్ వర్డ్..137
గొంతెత్తి చెబుతుంది
అప్పుడే బాగుండెనన్నమాట యెప్పుడూ వినిపిస్తోంది
సబ్బండ వర్గాల సమ్మెతర్వాత గూడ వినబడ్తదనుకోలేదు
సత్యం గొంతెత్తుకుని చెప్తుంది
ఇట్స్ వీరాస్ వర్డ్ ..138
పుస్తకం
ప్రపంచమనే పుస్తకం లో అక్షరమై యొదగాలి
యెదపై వాల్చిన చెవిలో ఆ సంగీతం వినగలగాలి
నలబై పేజీలుకుట్టిన ప్రతిదీ పుస్తకమౌతుందా
ఇట్స్ వీరాస్ వర్డ్..139
రైసన్
రైసన్ గ్రామంతరించిపోయింది
భారతదేశం గర్వించదగ్గ నాయకున్నిచ్చింది
హీరాబా కలల పంట
ఇట్స్ వీరాస్ వర్డ్..140
తడుముకోరామరి
నాలుగు లైన్లు రాశాను నలబైమంది తిరగబడ్డారు
నలబైకోట్లమందికోసం కదా రాశింది
ఆమాత్రం తడుముకోరామరి
ఇట్స్ వీరాస్ వర్డ్...141
పావురాలు
పావురాలు ఎగురుతున్నాయి కాళ్ళకు కట్టిన ఉత్తరాలతో కాదు
కంటికి కనిపించని నీటి తావులకోసం
ఎండాకాలం మరి
ఇట్స్ వీరాస్ వర్డ్...142
ఏంచేశావు
నిన్నే ఎందుకు ప్రేమించాలి ఎన్ని సార్లు వేసుకున్నానో ఈ ప్రశ్న .. సమాధానందొరకదు.
నన్ను నేనైనా ప్రేమించుకుందామంటే మనసు రాదు
యూ ఫూల్ ఏంచేశావు
ఇట్స్ వీరాస్ వర్డ్..143
Is it love
ఏముంది నీలో
నన్నారాధించడమనే అవగుణం తప్ప
ఏముంది నాలో నిన్ను అందుకోవడమనే ఆశ తప్ప.. ఇదీ ప్రేమేనా
ఇట్స్ వీరాస్ వర్డ్..144
Dad I love you
నీ కన్నీరు చూడాలని అనుకోను
క్షణం ఆలస్యమై తే జలజలా రాలుతుటుంటాయి తట్టుకోలేనని తెలిసీ
ఎందుకింత వలపు నాపై... Dad I love you
ఇట్స్ వీరాస్ వర్డ్..145
తెల్వనిస్తరా
వాడు లేడని తెలిస్తే ఎంతకష్టం
చింతకాయలు రాల్తాయని చెప్పేవాళ్ళకు
పరాన్న భుక్కులు తెల్వనిస్తరా
ఇట్స్ వీరాస్ వర్డ్..146
పోయేకాలం
ఆకురాలే కాలమొచ్చాక గలగలలకు లోటేముంటది
కొత్త చివుళ్ళెదురు చూస్తున్నాయి
పోయేకాలం మరి
ఇట్స్ వీరాస్ వర్డ్...147
టైమొచ్చింది
పులిపిరెంతకాలం భరిస్తారు
బ్యూటీ స్పాట్సనే భ్రమలో
సర్జరీ కి టైమొచ్చింది
ఇట్స్ వీరాస్ వర్డ్..148
తలచుకుంటే
గోదావరి ఊరూరు జేరింది
నదులు నల్లాలలో ప్రవహిస్తున్నాయి
మనిషి తలచుకుంటే
ఇట్స్ వీరాస్ వర్డ్...149
తప్పదేమో
తను కనబడింది ఏవేవో జ్ఞాపకాలు
తనెళ్ళిపోయింది జ్ఞాపకాలను తీసుకుపోలే
మోయక తప్పదేమో
ఇట్స్ వీరాస్ వర్డ్..150
నీఇష్టం
ఎప్పటి దాకో ఎక్కడిదాకో గానీ ప్రయాణాన్ని ఆపగూడదంతే
తలెత్తుకు సాగిపోవడమా, తలొంచుకుని వెళ్లి పోవడమా నీఇష్టం
ఇట్స్ వీరాస్ వర్డ్.151
సర్వం
ఎన్ని ఎకసెక్కాలు,
బలహీనతలను కప్పేసుకోడానికి
నన్నొదిలుండలేకున్నా యెన్నివిసుర్లు
స్మార్ట్ ఫోన్ కాదు సర్వం నేనే నీకు
ఇట్స్ వీరాస్ వర్డ్..152
కాదనవనుకుంటాను
సాయి దేవుడంటావు నీవు
సామాన్యుడు దేవుడైతే నీవన్నది నిజమంటాను నేను
కాదనవను కుంటాను
ఇట్స్ వీరాస్ వర్డ్...153
గ్లోబరీనా
బోర్డు కెఱుకలేకుండనే బోలెడు పనులు జేసిందట
నమ్మినా నమ్మక పోయినా నిజమేమైన
పోరగాళ్ళపాణమెవరెన్కకు దెస్తరు
గోల్మాల్ గ్లోబరీనా
ఇట్స్ వీరాస్ వర్డ్...154
*గరికపాటి *
లక్షకుంకుమ,, కోటి తులసి అర్చనలన్నీ ఉత్తయేనట
గరికపాటి చెప్తున్నాడు నమ్మాలి కదా
అవధాని అంతరంగం మరీ
ఇట్స్ వీరాస్ వర్డ్..155
28/04/2019 ఈనాడు
అవధాని అంతరంగం
విప్లవ మైనా వీరశైవ మైనా
ఆదిశంకరుడైనా ఆ చెగువేరా ఐనా చెప్పిందొకటే
అంధవిశ్వాసాలు
అసలు నిజాలనుతొక్కేస్తున్నాయంట
అవధాని అంతరంగం
ఇట్స్ వీరాస్ వర్డ్...156
28/04/2019 ఈనాడు
మొలక
పడుకుంటే పాడె, నిల్చుంటే నిచ్చెన, చూసేవాడికి సైటుంటే కష్టం
చినుకు పడితే చాలు మోసులెత్తదా మొలక
ఇట్స్ వీరాస్ వర్డ్...157
నిర్ణయం
పడుకుంటే పాడె నిల్చుంటే నిచ్చెన
ఏదైనా పైకి పోవడానికే
నిర్ణయం నీదే మరి
ఇట్స్ వీరాస్ వర్డ్.158
ఖర్చేం లేదుకదా
వీలైతే శాలువా కుదిరితే ఓ కవిత
ఫోటో కు ఖర్చేలేదు
వెల్లొస్తే సరిపాయె
ఇట్స్ వీరాస్ వర్డ్..159
నమ్మకం
విషం నింపుకున్న అంతరంగం నవ్వుతూ పలకరిస్తుంది
వాడికి పనిముఖ్యం
నమ్మకాలు పెట్టుబడిగా సాగే కాలమిది
ఇట్స్ వీరాస్ వర్డ్...160
జీవితం మరి
ఏది చివరి మాటో ,ఆటో తెలియదు
ప్రతిదీ తొలియడుగన్నంత ఉత్సాహంగా సాగాలి జీవితం
ఇట్స్ వీరాస్ వర్డ్...161
అంతేమరి
అవసరం లేని వాటిని మోయడం అనవసరమని తెలుసుకునేవరకే
చాలా దూరం మోశాను
ఇంగువ గుడ్డంతేమరి
ఇట్స్ వీరాస్ వర్డ్... 162
కొన్నిసార్లంతే
విలువలు పెంచేవారో, విలువైన వారో ఉండాల్సిన చోటది
తప్పేముంది లే అన్నిచోట్లా అర్హులే ఉన్నారా
కొన్నిసార్లంతే
ఇట్స్ వీరాస్ వర్డ్...163
రీకాల్
కామెరూన్ పేల్చిన బుల్లెట్ ఇన్నాళ్లకు దిగింది
ఫియోనా ఒనసాన్య రీకాల్ జరిగింది
ఇట్స్ వీరాస్ వర్డ్...164
తెలుగే
గగనసఖి చరవాణి మొబైలాఫ్ ఎయిర్ హోస్టెస్
కంగారేంలేదు ఈనాటి తెలుగే
ఇట్స్ వీరాస్ వర్డ్...165
వలంటూరిజం
సేవా,భక్తీ,ముక్తీ కలగలసిన యాత్ర లిపుడు
ఆశలు, ఆశయాల, కొనసాగింపు గా
వలంటూరిజం
ఇట్స్ వీరాస్ వర్డ్ ..166
నేమ్
సిరాకో, పాసత్ , జెట్టా గాలి పేర్లు గావు
జరామా,గలరాడోలు ఎడ్లపేర్లూ కావు
చరిత్ర మింగిన కార్లపేర్లవి
నేమ్ లోనేముందంటారేం
ఇట్స్ వీరాస్ వర్డ్... 167
వెగ్బాండ్
ఇంకెంతకాలమోలే అనుకుంటూ ప్రపంచాన్ని చుట్టొద్దామంటే
అదీ జబ్బేనంటారేంటో వెగ్బాండ్ న్యూరోసిస్
ఇట్స్ వీరాస్ వర్డ్..168
(164 to 168 daily paper 03052019 ఆధారంగా)
శభాష్
పొని తుఫాన్ చెప్పిన నిజం
ప్రచారం కోసం పనిచేసే వారు కొందరు
పనిచేసే వారు కొందరని
శభాష్ సెక్రటరీ గారు
ఇట్స్ వీరాస్ వర్డ్..169
*శాల్ *
ఏదోటి రాసెయ్ చదివేదెవరు
చప్పట్లు గొట్టి శాలువా గప్తరుగని
ఇట్స్ వీరాస్ వర్డ్..170
మునియాండీ
మునియాండీ కెల్లొస్తా
మటన్ బిర్యానీ ప్రసాదంగా పెడతారట మనసెరిగిన దేవుడు
పులిహోర, పొంగలి, లడ్డూ ఎంతకాలం దింటాం
ఇట్స్ వీరాస్ వర్డ్...171
ఈ దేవాలయం లో ప్రసాదంగా మటన్ బిర్యానీ పెడతారు 05052019 ఈనాడు
స్తోమత
ఆ కవిత కు బహుమతి వచ్చింది తెలుసా
భోజనాలు తానే స్పాన్సర్ చేశారట కదా
ఔనా !!!! నాకంత స్తోమత లేదులే
ఇట్స్ వీరాస్ వర్డ్..172
అమ్ముకోవచ్చు
కవిత్వం అవసరమా ఆలంబనా వ్యాపారమా
వాడకాన్ని బట్టి ఏదైనా కావచ్చు
అక్షరాల నమ్ముకోవచ్చన్నమాట
ఇట్స్ వీరాస్ వర్డ్ 173
చిన్న విషయం
అతనున్నాడా
నీకవసరముంటే ఉంటాడు
ఇంతచిన్నవిషయం అర్థం కాలేదింతకాలం
ఇట్స్ వీరాస్ వర్డ్..174
ఎందుకని
ఎందుకు నా జీవితంలో కి వచ్చావు అర్థరహితం గా జీవిస్తున్నాననా
అర్థాంతరంగా వెళ్లి పోతానంటావేం మరి
ఎండా వానా లేనిచోట గొడుగెందుకని
ఇట్స్ వీరాస్ వర్డ్..175
నేను
ఎంత పెద్ద గుత్పేశినా ఎదిరించే ప్రయత్నమక్కడ
చిన్న తాడేస్తే తప్పించుకోలేక యిక్కడ
ఇట్స్ వీరాస్ వర్డ్...176
యెవడు రాశిన జాతకం
కలలు నావి కష్టపడేది నీవు
ఫలితంమారితే ఉరేసుకున్నది నీవు ఊపిరి పోయింది నాది
యెవడురాశిన జాతకమిది
ఇట్స్ వీరాస్ వర్డ్..177
బాల్యం
అందమైన లోకంలో అనంతానందాలయానమానాడు
మూడేళ్ల నుండి ముప్పయ్యేళ్ళదాక కార్పోరేట్ సంకెళ్లీనాడు
బాల్యం
ఇట్స్ వీరాస్ వర్డ్..178
నీవెళ్ళిపోయాక
ఋణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయా.. ఏదో అంటారు
అరక్షణం అలా అనిపించింది నీవెళ్ళిపోయాక
ఇట్స్ వీరాస్ వర్డ్..179
విలవలేరుకోలేం
కోల్పోవడం మొదలయ్యాక కామాలే, ఫుల్ స్టాపుండదు
అహం ఎరువుగా చల్లి విలువల్నేరుకోలేవు
ఇట్స్ వీరాస్ వర్డ్ ..180
నమ్మలేదు
పిచ్చుక పై బ్రహ్మాస్త్రం
పెప్సీ వర్సెస్ పేదరైతులు
చలిచీమల గెలిచాయంటే నమ్మలేదప్పుడు
ఇట్స్ వీరాస్ వర్డ్...181
కొత్తేం ముంది
ఏవా గళాలు , ఎక్కడా కలాలు
పదవులు మేస్తున్నాయి
కొత్తేముంది
ఇట్స్ వీరాస్ వర్డ్...182
యెవరని
అంగలార్చేదందుకేగదా
యాంటీ జెండరంటే పడిపోనిదెవరని
ఇట్స్ వీరాస్ వర్డ్...183
మెఱుగైన సమాజం
ఆమాత్రం ఫోర్జరీ అవసరమేమో
మెఱుగైన సమాజం కోసం
ఇట్స్ వీరాస్ వర్డ్..184
ఓపికెక్కువ
అక్క తిడితేమాత్రం కోపమొస్తుందా
ఆశీస్సులనుకుంటాంగానీ
ఆయనకసలే ఓపికెక్కువ
ఇట్స్ వీరాస్ వర్డ్..185
ఆమె సాధించిందేముంది ??
ఆ మాటకూ తన చిరునవ్వే సమాధానం
నీకంటూ ఓ చిరునామా తానే కదా
ఇట్స్ వీరాస్ వర్డ్...186
ఖాయం
ఫ్లైయోవర్ సంస్కృతి వంటబట్టింది
గెలుపు ఖాయం
కధమారేలాలేదు
ఇట్స్ వీరాస్ వర్డ్ 187
ఆకాశం
తను కన్నుగీటగానే భయపడ్డాను
వెంటనే భయంకరం గా అరిచింది.. లోపలికెళ్లాను
ఏడ్వడం మొదలుపెట్టింది
ఇట్స్ వీరాస్ వర్డ్..188
మా ఊరు మారింది
వారసులంతా పట్నంలుంటే అమ్మానాన్నలను తనుజూసుకుంటుంది.
మనవల్లూ, మనవరాళ్లు మరో దేశం పోతుంటే ,
మూడుతరాల ముచ్చటై ఊరు మారింది
ఇట్స్ వీరాస్ వర్డ్.....189
లేదు
ఐ లవ్యూ చెప్పాలని ఉంది మనసు రావడం లేదు
చందమామ చక్కదనం చిక్కి పోతుంటే
ఇట్స్ వీరాస్ వర్డ్..190
చందమామ
రవితాపం తట్టుకోలేక మామమోము పగుళ్లు వారుతుంది
ఎంతందమైనా యెంతకాలం
మామా ! చందమామా!
ఇట్స్ వీరాస్ వర్డ్..191
అన్నట్లు గుర్తు
కాలానుగుణంగా మారలేని రోగం తప్ప
చావు లేనిది కమ్యూనిజం
వీరన్నన్నట్లు గుర్తు
It's veeras word 192
పట్టించుకోవు
నిన్నందుకోలేనివారు తిడుతుంటారు
నువ్వందుకోలేనివారు పొగడుతుంటారు
నిన్ను నిన్నుగా చూసేవాళ్ళను పట్టించుకోవు
ఇట్స్ వీరాస్ వర్డ్..193
ఉన్నాడు
ఉన్నాడేమో విశ్రాంతి వర్గం
ఉంటే ఉండెలే శ్రామిక వర్గం
ఉన్నాడు దోపిడి వర్గం
ఇట్స్ వీరాస్ వర్డ్...194
ఎంతబాగుందో
వ్యక్తిత్వ శవాలంకరణకై వేసినదండతో
ఊరేగింపులో భాగమైపోతున్నాడు
చిత్తలూరి అన్వయం ఎంతబాగుందో
ఇట్స్ వీరాస్ వర్డ్..195
ఎంతకాలం
ఎడారిమొక్కలపై బడి జీవిస్తూ
వసంతమని బులపరించే గీతాలనాలపిస్తూ
శాలువాలతో ఊరేగడం
ఎంతకాలం
ఇట్స్ వీరాస్ వర్డ్.. 196
తడద్దుకోవాలనుకుంటే
అబద్దాల తుప్పిర్ల వర్షరాగ మారిపోనున్నది
శాలువాలతో తడద్దుకోవాలనుకుంటే
ఇట్స్ వీరాస్ వర్డ్..197
మత్తు
ప్రశ్నంటే భయం వాడికి
బాకాలకలవాటు పడ్డాడు
మనువాద మత్తులో తూగుతున్నాడు
ఇట్స్ వీరాస్ వర్డ్...198
అంతేమరి
ఆ ముసుగు
సహజలక్షణాలను కప్పలేక పోతుంది
వర్గలక్షణం వాసనలంతేమరి
ఇట్స్ వీరాస్ వర్డ్ ...199
అంతే
ఇలా జరుగుతుందని ముందే తెలుసు
మేకప్ తొలగి పోయిందంతే
ఇట్స్ వీరాస్ వర్డ్..200
[11:03 PM, 10/21/2020] Veera Gudipally: గెట్ రెడీ
ప్రణాళికేమఖ్యం
యుద్ధానికి సిద్ధం కావాలంటే
గెలుపోటములదేముంది don't give up
Get ready
ఇట్స్ వీరాస్ వర్డ్...201
ప్రజలే విజేతలు
ఆ గెలుపు స్వయం కృషి
ఈ ఓటమి స్వయంకృతం
ప్రజలే విజేతలని రుజువైంది
ఇట్స్ వీరాస్ వర్డ్...202
అనుకున్నంత మాత్రాన అది సొంతమైపోతుందా
పనితనం పలుచబారినప్పుడు
స్మృతి ఇరానీ షోన్ ద ఫ్యాక్ట్
ఇట్స్ వీరాస్ వర్డ్.. 203
ఒకటి కానట్లు
ఖండన, విమర్శ ఒకటెలా అవుతాయి
ప్రౌత్సహించడ, పొగడడం ఒకటి కానట్లు
బ్రతకడానికీ, జీవించడానికున్నంత తేడా
ఇట్స్ వీరాస్ వర్డ్...204
మిత్రమా
సమస్యంటే యుద్ధం చేసే అవకాశం
గెలిచావా విజయం,ఓడితే అనుభవం
పారిపోకు మిత్రమా
ఇట్స్ వీరాస్ వర్డ్...205
ప్రవాహ ధర్మం
టాజిల్స్ ఆనాటియాధునికత
వేంచేశాయి లట్కన్సీనాడు
ప్రవాహధర్మమంతే
ఇట్స్ వీరాస్ వర్డ్...206
అవి..నీతి
ఆలయాల్లో అవినీతి
ఆయన ముందే ఆడుకుంటుంటే
పసివాళ్ళనుకుంటున్నాడేమో
ఇట్స్ వీరాస్ వర్డ్.207
ప్రజాస్వామ్యం
****
నైతిక విజయమంటే
మరోసారి ప్రయత్నిస్తాడని
ప్రజలెప్పుడూ విజేతలే
ఇది ప్రజాస్వామ్యం
....... వీరా గుడిపల్లి
మేటర్ హార్న్
చప్పట్లైనా,దీపాలైనా
సంఘీభావ సంకేతాలే
మేటర్ హార్న్ మ్యాటర్ లాగా
ఇట్స్ వీరాస్ వర్డ్..209
హ్యాలో థెరపీ
****-
రుచులకు మూలం ,రోగాలు మాయం
ఆ గాలి పీల్చి తే ఆరోగ్యం
హ్యాలో థెరపీ రహస్యం
ఇట్స్ వీరాస్ వర్డ్...210
లూమ్ క్రాఫ్ట్స్
****-
అపార్ట్ మెంట్సంటే పిట్టగూళ్ళు
కదిలే ఇండ్లే హౌౙాన్ వీల్స్
థాట్ ఆఫ్ లూమ్ క్రాఫ్ట్స్
ఇట్స్ వీరాస్ వర్డ్...211
కనిపించలేదని కాలుబయట పెడితే
ఖతమై పోతావు నేస్తం
ఇది కరోనా పురాణం
ఇట్స్ వీరాస్ వర్డ్...212
కిమ్ కేమైంది
******
ఆ సంకేతాలు
అబద్దమైతే బాగుండు
బ్రేవ్ ఫీల్డ్ బ్రైన్ డెడ్ కిమ్ కేమైంది
ఇట్స్ వీరాస్ వర్డ్....213
22042020
కొట్టివేతలే
***
వర్జిన్ క్వాంటాస్
యేదైతేనేం ఎక్కడైతేనేం
కోవిడ్ నైంటీన్ కొట్టివేతలే
ఇట్స్ వీరాస్ వర్డ్ ...214
20200422
ఆయనకూడా
***-
అర్చనలైనా హారతులైనా
అక్కడ దాకా అవసరం లేదు
ఆయనకూడా ఆన్లైన్ లోనే
ఇట్స్ వీరాస్ వర్డ్....215
20200422
రిలయన్స్ లో ఫేస్బుక్ పెట్టుబడులపై
ఈనాడు వ్యాసం చదివాక
23/04/2020
అసలైన సమాధానం
కరోనాకైనా సరె
పారిశుధ్యమే ప్రామాణికం
ఐమ్యాప్నైన్ అసలైన సమాధానం
ఇట్స్ వీరాస్ వర్డ్ 216
ఆలోచనే వేరు
జియోప్లాట్ ఫామ్ పై
ఫేస్బుక్ అడుగేసింది
ఆరయ్యల్ ఆలోచనే వేరు
ఇట్స్ వీరాస్ వర్డ్ 217
పిల్లలే కదా
వాట్సాప్ ఇన్స్టాగ్రాం
ఈకామర్స్ పై కన్నేస్తున్న
ఫేస్బుక్ పిల్లలే కదా
ఇట్స్ వీరాస్ వర్డ్ 218
పడాలంతే
అమేజాన్ ఫ్లిప్ కార్ట్
అవెంత దూరమని
జుకెన్ బర్గ్ దృష్టి పడాలంతే
ఇట్స్ వీరాస్ వర్డ్ 219
తీరుతుంటే
పదిశాతం వాటదేముంది
పరపతి పెరుగుతుంటే
ఆరయ్యల్ అప్పులు తీరుతుంటే
ఇట్స్ వీరాస్ వర్డ్ 220
పల్లవీ ఠాకూర్
******
సీతే గీత గీసింది
యెవరూ దాటకుండా చూస్తుంది
పల్లవీ ఠాకూర్ పంజాబ్
ఇట్స్ వీరాస్ వర్డ్ 221
షారూఖ్ చెప్పాడు
******
గొప్ప సింగిల్ మాత్రమేనా
సల్మాన్ ఖాన్ సింగర్ కూడా
షారూఖ్ చెప్పాడు
ఇట్స్ వీరాస్ వర్డ్ ...222
పుణ్య మేమరి
*****
గావిలోని యా
నెట్టిల్లు దిద్దిన మాడల్
క్వింట్ బర్గోస్ పుణ్యమేమరి
ఇట్స్ వీరాస్ వర్డ్ 223
ఉప్మా రుచించలేదంటే
ఆకలితో లేడన్నమాట
అదంతే మరి
ఇట్స్ వీరాస్ వర్డ్..224
పచ్చగడ్డి
******
కాల్చాలనే చూస్తున్నాడింకా
కాకపోతే
మన నడుమ వేస్తున్నాడు
ఇట్స్ వీరాస్ వర్డ్...225
బాల్యదశ
******
ఆశలు తీరాల్సుంది
అనుకున్నవి జరగాల్సుంది
ఇంకా బాల్యదశే...ఆరేళ్ళేగా నిండింది!!
ఇట్స్ వీరాస్ వర్డ్....226
️⃣️⃣*️⃣
మట్టిలో కలవకముందే
మనిషనిపించుకోవాలి
దీపం ఉండగానే...తెలిసిందే గా
ఇట్స్ వీరాస్ వర్డ్...227
️⃣️⃣️⃣️⃣
అందమైన క్షణాలాగం చేసుకోకు
అక్కరకు రాని వాటిని
ఆలింగనం చేసుకుంటూ
ఇట్స్ వీరాస్ వర్డ్..228
సావిత్రి
భర్త ప్రాణాలు సాధించింది
ఆనాటి సావిత్రి
రిటైర్మెంట్ వాయిదా వేయించింది
ఈనాటి సావిత్రి
ఇట్స్ వీరాస్ వర్డ్...229
యేముంది
ఫెయిల్ అనే మాటంటే నచ్చదు
పరీక్షలు రాయకపోయినా పాసవ్వాల్సిందే
కరోనా తలుచు కుంటే కానిదేముంది
ఇట్స్ వీరాస్ వర్డ్...230
కోవిడ్నైంటీన్ బ్యాచ్
******
నవ్వుతావేం
నవ్వుకోడానికొకరు కావాలి కదా
రాక్షసులీనాడు లేరనుకున్నా
ఇట్స్ వీరాస్ వర్డ్ 231
కరోనా పురాణం
********
వాడున్నాడంటే ఉన్నాడు
యెవరుండి చేసేదేముంది
నీవు ఉండడం ముఖ్యం
ఇట్స్ వీరాస్ వర్డ్..232
బడిగంట
****
అప్పటికప్పుడు
అనుకోకుండా పోయిండ్రు
ఎప్పుడొస్తరో యేమో
బాధపడుతున్న బడిగంట
ఇట్స్ వీరాస్ వర్డ్...233
బడిగంట
*****
నా వాళ్ళంతా వస్తారీవేళ
ఆశగా ఎదురు చూస్తున్న బడిగంట
మూడు నెలలాయె
ఇట్స్ వీరాస్ వర్డ్...234
బడిపంతులు పరిస్థితి
*********
పరాయి దేశంలో
ఉంటున్న పిల్లల కోసం చూస్తున్న
అమ్మా నాన్నల ఓలె ఉంది
ఇట్స్ వీరాస్ వర్డ్...238
జీతాలు
****
బడి తెరుస్తారటనా
పాఠాలు చెప్తామా మనం
జీతాల సంగతి తేలకనే గదా
ఇట్స్ వీరాస్ వర్డ్....239
రగిలి పోతున్నారు
*****
కమ్యూనిస్టులం
సంతోషంగా ఉన్నాము
కమ్యూనిస్టులమనుకునే వాళ్ళు
రగిలి పోతున్నారు
ఇట్స్ వీరాస్ వర్డ్...240
సమస్యంతా
******
కమ్యూనిస్టులంతా మంచి వాళ్ళు
యే మాత్రం సందేహం లేదు
కమ్యూనిస్టులమని అనుకునే వారితోనే... సమస్యంతా...
.... ఇట్స్ వీరాస్ వర్డ్ ... 241
యేమనకుంటే చాలు
*******
చైనాను ప్రేమిస్తే
నాకెందుకు కోపం
నా దేశాన్నేమనకుంటే చాలు
ఇట్స్ వీరాస్ వర్డ్...242
అర్థమౌతుందా
****
పాము కాటు బారిన పడకుండా ఉండాలంటే
అరవడం, వాదించడం, అవసరమా
దానికర్ధమౌతుందా, చంపడమే
ఇట్స్ వీరాస్ వర్డ్...243
మంచోడివి గనుక
**""**"
అందరినీ గౌరవించాలా
ఎందుకు??
నీవు మంచోడివి గనుక
ఇట్స్ వీరాస్ వర్డ్
.........244
ఆనవాళు
****
ఆషాఢమాసం గోరింటాకు
అన్నా చెల్లి అనుబంధం
పుట్టింటి ఆనవాళు
ఇట్స్ వీరాస్ వర్డ్..245
గెలుపు కాదు
*****
ఎవరెంత యెగిరినా
సూర్యుడు రోజుకొకేసారి ఉదయిస్తాడు
ఆరాటం గెలుపు కాదు
ఇట్స్ వీరాస్ వర్డ్...246
మర్శిపోయిండ్రా
****
పిల్లలు రారు పంతుల్లు కనబడ్త లేరు
పెద్దసారొచ్చి సప్పుడు జేయకుండ బోయిండు
నన్ను మర్శిపోయిండ్రా.. బడిగంట
ఇట్స్ వీరాస్ వర్డ్...247
ఇట్లన్లే
**
బడికి వెళ్ళాలని ఉంది
అవకాశం లేదంటున్నారు
చిన్నప్పుడొక్కసారిగూడా ఇట్లన్లే
ఇట్స్ వీరాస్ వర్డ్.. 248
ఆమెకైనా అతనికైనా
*******
అప్పులోనికైనా, ఆఖరికా దేవునికైనా
చుట్టూ తిప్పుకోవడమంటే ఇష్టం.
ప్రదక్షిణ ఫలితాన్నిస్తుంది
ఇట్స్ వీరాస్ వర్డ్......249