Sunday, July 19, 2020

వీరాస్ పోయెట్రీ 2

వీరాస్ పోయెట్రీ 2

1.చక్రం ఆగదు
2.స్వాతి టిఫిన్స్ భద్రాచలం
3.చావని ఆశలు
4.శాసనంకోసం
5.ఆర్డినరీ ఎక్స్ప్రెస్
6.జన్మదిన శుభాకాంక్షలు లలిత
7.ఒకే ఒక ప్రశ్న రమణా జయంతి
8.కొత్త సంవత్సరం
9.వినీలమ్మకు లేఖ
10.ఎప్పుడో మరణించావు
11.శివోహం 1
12.శివోహం 2
13.శివోహం 3
14.శివోహం 4
15.శివోహం 5
16.శివోహం 6
17.ధన్యవాదాలు
18.దేవుడున్నాడు
19. పెట్రోల్ బాటిల్
20.నీకు తెలుసా
21.బడ్డైనా నమస్కరిస్తా
22.కాలం మారింది
23.వెళ్ళిపో
24.తెలిసిందల్లా తనను ప్రేమించడం
25.మూర్తి
26.మరచిపో
27.క్రిష్ణమాయ
28. ఆమె కవిత్వం
29.కొత్త చివుళ్ళు
30.గౌరవం
31.గాజు బొమ్మలు
*****************
1
*చక్రం ఆగదు చరిత్ర నిర్మిస్తుంది*.
ఇది వీరా గుడిపల్లి కవిత
19102019
కథలే విన్నాం కానీ
కనలేదేనాడు సుదర్శన చక్రం
ప్రగతికి మూలం
ప్రజాసేవలో ప్రతినిత్యం పాలుపంచుకుంటున్న  బస్సు చక్రం మాత్రం రోజూ చూస్తున్నాం
రాదారి నొరుసుకుంటూ పోతుంది
పల్లె పల్లె ను పలకరిస్తూ
పట్నం నవ్వేలా చేస్తుంది
పేదోడి పాదమై నడుస్తుంది
నవ్వుల వెన్నెల్ని పంచుతుంది అలుపులేకుండా తిరుగుతుంది
అందరి ఆశలకు జీవం పోస్తుంది
బస్సాగిపోతే బాధెవరికి
కారున్నోల్లకా
మేడున్నోల్లకా
అధికారంతో ఊరేగే వాళ్ళకా
  కాదు
కాళ్లను నమ్ముకున్నోల్లకు
బస్సు చక్రం
తిరగాలా వద్దా అనేది బస్సు ఎక్కనోళ్ళ చేతిలో ఉంది
బస్సు ఎక్కే వాడికి యేహక్కులు లేవు
బస్సు నడిపే వాడికేబాధలు మొదలయ్యాయి
ఆర్టీసీ మాజీవనం
బస్సు చక్రం మా బతుకు
డ్రైవరన్న  మా హృదయ స్పందన
కండక్టర్ మా కంటి వెలుగు
అన్యాయం జరుగుతుందదెవరికి
ప్రతిదారీ  బోసిబోయింది
ప్రతిరోజు పలకరించ చక్రం తిరగడం లేదు గనక
ప్రజాజీవనం ప్రమాదంలో పడింది
బస్సు బుస్సు అన్ననాడు
ఎవరి కస్సుబుస్సులేం చేయవు
ప్రజా రవాణా ప్రైవేట్ పరమైతే
పేదరికం అభివృద్ధి సాధిస్తుంది నా దేశం అంతా పేదలతో కళకళలాడుతుంది
ఆర్టీసీ సీతమ్మతల్లి అయిపోయింది
ఆ చెర విడిపించాల్సిన సమయం వచ్చింది
ఆఖరి దాక నిలబడితే
అశ్వత్థాముని వెనుక
వానర సైన్యంలా మేమంతా తోడుంటాం
ఆర్టీసీ ని కాపాడుకుంటాం
ప్రజా రవాణా ప్రజాజీవితం
తెలంగాణ గుండెచప్పుడు
ఆర్టీసీని ఆగిపోనివ్వం.
కథలోనే మో సుదర్శన చక్రం
మా కన్నుల్లో  ఆర్టీసీ చక్రం
చక్రం ఆగదు చరిత్ర నిర్మిస్తుంది
..... *వీరా గుడిపల్లి*
2
ఇది వీరా గుడిపల్లి కవిత
*స్వాతీ టిఫిన్స్ భద్రాచలం*
13112019
పార్కింగ్ కోసం
విశాలమైన స్థలం లేదు
పట్టుమని
పది మంది కూర్చునే వీలులేదు
ఎల్ రోడ్డు ఫేస్
బస్టాండ్ దగ్గరలో *స్వాతి టిఫిన్స్*
ప్లేట్ పూరీ కుర్మా కోసం
*చెఫ్ యెవరో గానీ చేతులెత్తి మొక్కాల్సిందే*
ఇది
ఎనిమిదోసారి భద్రాచలం వెళ్లడం
అవధుల్లేనంత
ఆధ్యాత్మిక శోభ
గోప్యత లేకుండా
గోదావరి అందాలు
ప్రభాతవేళ రామభద్రుని దర్శనం సాయంకాలం
సీతమ్మ వాగు దగ్గర ఇప్పపల్లు చప్పరించడం
భద్రాచలం అంటే
రామభద్రుడు
పర్ణశాల
స్వాతి టిఫిన్స్
అంతే మరి.... నావరకు
...... *వీరా గుడిపల్లి*
3
వీరా గుడిపల్లి కవిత
04122019
చావని ఆశలు
కన్నీటి అభిషేకాలు
కరిగించలేని హృదయాలు
పంతాలకు వంతలు పాడే
పరిజనులుండే సభలు
నిరసనలను సహించలేని
నిరంజనులున్నచోటు
హత్యచేసిన ఆత్మహత్యలు
ఆత్మహత్య చేసుకున్న హత్యలు
ఏం సాధించాయో గాని
ఎన్ని సూర్యోదయాలు
అస్తమిస్తున్నా....
చావని ఆశలు
తూర్పున పురుడు బోసుకుంటున్నాయి
....... వీరా గుడిపల్లి
4
వీరా గుడిపల్లి కవిత
11122019
శాసనం కోసం
ఎన్ని ఊహలో, యెన్ని ఆలోచనలో
నావనుకున్నవేవీ నావి కాదని తెలుసు
నాదనుకున్నదేదీ నాది కాదని తెలుసు
మనదనుకోవడానికేముందని
వన్నెస్ సిద్దాంతమంటున్నారెవరో అదర్థమయ్యేలోపు అంతర్థానమవడం ఖాయం
ఇంకాలోచించేదేముంటుంది
ఉషోదయాలు
సంధ్యారాగాలు
,మంచుపూలవాన,
మధురోహలరాత్రులు
  కాలమలదుకున్న అందమైన ప్రయాణం
నాతో నేనే ఎప్పటికీ
విశ్వాంతరాళం నా ఆటస్థలం
ఈర్ష్యాసూయలు మసైపోయి
నాకు నేనే పోటీగా
నేనే శాశ్వత విజేతగా రాయబడ్డ
శాసనం కోసం
వేకువ వరకూ వెతుకుతూనే ఉంటా
నాకు తెలుసు
ప్రతీ ఉదయం అస్తమిస్తుంది మరో ఉదయానికి తూర్పున చోటిస్తూ
....... వీరా గుడిపల్లి
5
ఆర్డినరీ ఎక్స్ ప్రెస్
ఇవ్వాలన్నీ అవే మరి
బోర్డొకటి,బాడీఒకటి
బోర్డేసుకున్నాక
చార్జీలవే, స్టాపులవే,లోపలంతా అంతే
ఆర్డినరీ ఎక్స్ ప్రెస్ అలవాటైపోయింది
మాట్లాడకుండా, మన ప్రయాణం
Thera are no mistakes in life only lessons
6
వీరా గుడిపల్లి కవిత
28/12/2019
జన్మదిన శుభాకాంక్షలు
అనుకున్నవి
అనుకున్నట్లు జరగడమూ అంత సులభం గాకున్నా భగవదనుగ్రహం లభించింది
సాధన,శోధన, వీడక పోవడం విలువైన జీవితాన్నిచ్చింది.
ఈర్ష్యాసూయలను జయించడమంటే పట్టించుకోకపోవడమేననే
రహస్యం తెలిసిన వారింటి ముందు
విజయం నిలబడి తలుపుగొడుతుంది
సాక్ష్యాలక్కర్లేదు తనను చూస్తే తెలుస్తుంది
సాయి సాయుజ్యం కోసం
సేవా మార్గమెంచుకోవడమే ఆధ్యాత్మిక ఉన్నతికి చిహ్నం.
చేసే ప్రతి పనిలో పారమార్థిక విలువల్ని, వెతుక్కుంటూ సాగడమే తెలిసిన
తన ప్రయాణం
ఎక్కడ మొదలైందో గానీ
సంగీత సాహిత్య పురవీధుల్లో సాగుతుంది
పుట్టిన రోజులదేముంది వస్తూనే ఉంటాయి.
Stop judging events as either positive or negative
లక్ష్యం వైపు సాగిపోవడమే....
విజయమనేది  చేరాల్సిన తీరం కాదు. నడవాల్సిన మార్గం.
..... వీరా గుడిపల్లి
7
*రమణ మహర్షి పుట్టినరోజు(జయంతి) సందర్భంగా*
*30/12/2019/వీరా గుడిపల్లి*
*ఒకే  ఒక్క ప్రశ్న*
యెవరూ సమాధానం చెప్పలేనిది
యెవరికి వారే తెలుసుకోవాల్సింది
తెలిశాక చెప్పడానికేమీ మిగలనిది
*ఒకే ఒక్క ప్రశ్న*
వెతుక్కుంటూ వెల్లాల్సిందే తప్ప
యెక్కడిదాకో తెలియనిది
మాటలకు చిక్కనిది
మౌనానికి దక్కేది
*ఒకే ఒక్క ప్రశ్న*
తిరుచ్చి లో పుట్టింది
తిరువన్నామలై లో దొరికింది
రమణుల మౌనమై నవ్వింది
*ఒకే ఒక్క ప్రశ్న*
తెలిసినట్లే ఉంటుంది
తెలియదని తెలుస్తోంది
తెలుసుకోవాలనుంటుంది
*ఒకే ఒక్క ప్రశ్న*
తెలిశాకేముంటుంది
చెప్పలేని మౌనం
మాటల్లో ఒదగదన్న సత్యం
*ఒకే ఒక్క ప్రశ్న*
నాన్ యార్
Who am i
నేనెవరు
ఒకే ఒక్క ప్రశ్న
.......  *వీరా గుడిపల్లి*
8
వీరా గుడిపల్లి కవిత
31122019
*ఎందుకంత కోపం*
  నేనంటే ఎందుకంత కోపం
పరాయింటి నుండి వచ్చాననా
మీతో కలవలేదా ,మీలో ఒదగలేదా
మీ పుట్టినరోజు
మీ చదువులు మీ లెక్కలు అన్నింటికి
ఉపయోగపడుతున్నాను కదా
పరాయింటి నుండే వచ్చాను
నేను మీలో ఒకరిగా ఉందామని వచ్చాను
కలిసి నడవాలని కలగన్నాను
ఇంకా శతృవుగా చూస్తారేం వదిలేయండి చాతనైతే
నేను వచ్చేటప్పుడు పండగ చేసుకున్నారు
నేనడిగానా
తాగి పడిపో మన్నానా
నిత్యం నాతో సేవలు చేయించుకుంటూ
తిట్టిపోస్తున్న మీ విజ్ఞతకో నమస్కారం
జీతాలు
జీవితాలు
లాభాలు
ఆనందాలు అన్నీ నాతోనే ముడిపడ్డాయి
మీకు నా అవసరం ఉంది
అన్నింటికీ  నేనే కావాలి
ఆఖరికి తిట్టడానికి కూడా నేనే కావాలి
మా మా అంటున్నారే
కనీసం నెలల పేర్లు అయినా తెలుసా మీకు
తిథులన్నవి  జ్ఞాపకం ఉన్నాయా
పంచ విభాగాల విషయం ఏమిటని ప్రశ్నించుకున్నారా
వారం వర్జ్యం అర్థాలు తెలుసా
మీ గురించి మీకేం తెలుసని
మీ అవసరాలను తీర్చేది నేనే కదా
తినేది ఒకరి సొమ్ము పాడేది ఒకరి పాట
అన్నింటికి నేనే కావాలి
31 డిసెంబర్ వస్తే చాలు తిట్లదండకం మొదలెడతారు
పోనీలే
ఏ కోడలు సుఖ పడినట్లు చరిత్రలో చదువుకోలేదు కదా
నేను అంతకంటే ఎక్కువేం కాదు
విజ్ఞత మీకుండాలి
అవసరానికి వాడుకుంటున్నారు
అనవసరంగా తిడుతున్నారు
  మీ ప్రేమకు నోచుకోకున్నా
నేను మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను
..........2020 నూతన సంవత్సరం
...... వీరా గుడిపల్లి
9
వినీలమ్మా !!!!
నేను వీరా అన్నను మాట్లాడుతున్నాను.
అమ్మ తిరిగి రాని లోకానికి వెల్లిందని తెలిసింది. ఇలాంటి సమయంలో యేం మాట్లాడాలో నాకు తెలియదు.
అమ్మను కోల్పోవడమనేది మామూలు విషయం కాదు. యే ఓదార్పు కూడా తీర్చలేని బాధ.
మనమెవరం యెందుకొచ్చాం ఈలోకం లోకి.
సంతోషం ఆనందం అభిమానం అనురాగం అన్నీ
అలదుకోవడానికి వీలున్న లోకానికి ఆహ్వానం పలికిన దేవత అమ్మ.
యెవరూ నమ్మనంతగా మనల్ని నమ్మిన నమ్మకం తాను.
మన పాదాలకు తన చేతుల్ని చెప్పులు చేసి నడిపించిన దైవం.
మాటలు నేర్పిన శారదాంబ తాను
భవిష్యత్తుకు బాటలు వేసిన బ్రహ్మ రాత తానే
కళ్ళల్లో పెట్టుకొని కాపాడుకున్నది.
క్షణం ఆలస్యం ఐతే అల్లల్లాడి పోయిన పసిమనసు.
మనమెవరమని తనకేమౌతామని ???
అన్నీ తానై సాకింది.
నడిచినంతమేర పల్లేర్ల నేరింది
అమ్మా !! అంటే వడిలో చోటిచ్చింది.
ఆకలననకముందే అన్నం పళ్ళెం ముందు పెట్టింది.
అలిగి కూర్చుంటే అన్నంముద్ద నోటికందించింది.
అమ్మా !! అన్నందుకే ఇంత చేసింది
తన  తర్వాత చూసుకోవడానికి రామ్మోహనుడి చేతికందించింది.
వినీలమ్మా !!!! అన్నా అని ఎంత ఆప్యాయంగా పలకరిస్తావు. ఆ ఆప్యాయత అమ్మ చలువే కదా
అమ్మ లేని బాధ అనుభవించే వారికే తెలుస్తుంది. యేం చెప్పాలో తెలియడంలేదు.
ఐనా .. తానెక్కడికి పోతుంది
నీ శ్వాస గా , ధ్యాసగా నిత్యం నీతోనే ఉంటుంది..... Be brave
....... వీరా గుడిపల్లి
10
20012020
ఎప్పుడో మరణించావు
బతికున్నాననుకుంటున్నావా
వేకువ ల్ని వేటాడలేక ,అస్తమయం కోసం పరుగెడుతూ
కుళ్ళిపోయిన ఆలోచనలపై రంగు వస్త్రాన్ని కప్పుకుంటూ బతికానను కుంటున్నావు.
చురుకైన ఆలోచనల్ని చిలుక్కొయ్యకు వేలాడదీసి
నీవెప్పుడో మరణించావు.
సింహం కూర్చున్నచోటే సింహాసనం. సింహం ఉన్నంత వరకే అది సింహాసనం.
11
శివోహం...1
గొంతులో
విషాన్ని నింపుకున్నంతమాత్రాన
నాకు శత్రువు కాలేవు
అసుర సమూహానికి
ఆరాధ్యుడివైనంత మాత్రాన
సురశ్రేష్ఠుడివన్నది అబద్ధం కాదు
చిత్తశుద్ధి కావాలంతే
శివమెత్తి సాగాలంటే
........ వీరా గుడిపల్లి
12
శివోహం...2
సగం దేహం
సరదాగా ఇచ్చేసినోడికి
సాంతంగా
సమర్పించుకోవడానికి
సిద్దంగా ఉన్నా
చిత్తశుద్ధి కి కొదవేం లేదు
చిత్తగించవయ్యా
.... వీరా గుడిపల్లి
13
శివోహం... 3
స్మశానం లోనే ఎందుకున్నావో
తెలియదనుకోకు
ఎక్కడ తిరిగినా
అక్కడికే వస్తానని కదూ
బద్దకమనుకోనా
బాధ్యత నుకోనా
...... వీరా గుడిపల్లి
14
శివోహం... 4
నీళ్ళే చాలటగదా నీకు
పాములు పారాడిన దేహమాయె
నీవుబూడిద బూసు కోవడమేంటి
మేము అభిషేకాలు చేసుకోవడమెందుకు.
మట్టిలో ఆడుకునే పిల్లాడికి
తల్లి స్నానంబోసినట్లు
.‌.. వీరా గుడిపల్లి
15
శివోహం..5
విషమ నేత్రుడు
ఎగుడు దిగుడు కళ్ళున్నా
యెంతందంగున్నావో
నచ్చినవాళ్ళెట్లున్నా
మెచ్చుకోకుండా ఉండలేం
అది మా బలహీనత మరి
...... వీరా గుడిపల్లి
16
శివోహం...6
మాతో ఉండడమంటే
మమేకమవటం కాదు
అందరిలో ఉంటూ
అంతర్ముఖం కావడం
నిన్ను తెలుసుకోవడం కష్టం
నన్ను నేనే తెలుసు కోలేదింకా
...... వీరా గుడిపల్లి
17
ఉదయపు
నడకలో కనిపించే ఇనబింబం
నా ప్రతీ
కదలికను గమనించే కాంతి రేఖ
నాకోసమే
సృష్టించే అక్షర సమూహాలు
ఆత్మీయులందరికీ... నమస్సులు.
పుట్టిన రోజు సందర్భంగా నన్ను అభినందించిన మితృలందరికీ
ధన్యవాదాలు
ఈ సమూహాం
నాపై చూపించిన అభిమానానికి మనసారా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
మీ ఆశీర్వర్షం ఎల్లప్పుడూ నాపై ఇలాగే కురవాలని కోరుకుంటూ
మరోసారి శుభాకాంక్షలు తెలిపిన మిత్రుడలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
మీ అభిమానం అక్షరమై
నా కంటికి విందై , మనసుకు ఆనందాన్ని పంచిన క్షణాలు  ఈ హృదయంలో పదికాలాలు పదిలపరుచు కుంటాను.
Thank you friends
Life is great for only two things
One is inventing something in mathematics
Seccond.. teaching mathematics
ఎక్కడో చదివాను
......వీరా గుడిపల్లి
18
*వీరా గుడిపల్లి కవిత*
30012020
*దేవుడున్నాడు*
ఎవరండీ దేవుడు లేదన్నది
తెలియకపోతే ఊరుకోండి
దేవుడున్నాడు.
దేవుడొక్కడంటున్నారట
యెవరన్నారు ???
మస్తు మంది దేవుళ్ళు న్నారు.
*పొద్దున్నే ఒక దేవుడు పేపరేసి పోతాడు* మా యింట్లో
ప్రపంచాన్ని తెలుసుకోమని
కాసేపాగి *మరో దేవుడొచ్చి*
పాలపాకెట్లిచ్చి పోతాడు. ఆరోగ్యంగా ఉండమని
ఇంకో దేవత వచ్చి *అంట్లు తోమిపోతుంది*
త్వరగా వంట చేసుకొని తినమని
నిత్యం
నా కష్టాన్ని లెక్కగట్టి
నెలానెలా అక్కౌంట్ నింపే *దేవుడు రోజూ గనపడతాడు*
*నాకోసం తపిస్తూ నా బాగోగులు చూసుకునే దేవత నాతోనే ఉంటుంది*
హాయిగా బడికెల్తానా
ఏమీ తెలీనట్లు అన్నీ నన్నడిగి తెలుసుకుంటూ నాకానందాన్ని పంచే చిన్నారి దేవుళ్ళు నాలుగింటి దాకా నాతోనే ఉంటారు.
ఎవరండీ దేవుడు లేడన్నది ?
నాస్తికులంటే నచ్చదు నాకు
దేవుడు కాదు దేవుళ్ళున్నారు.
*I Love GODS*
......
19
పెట్రోల్ బాటిల్
ఇప్పుడదో ఆయుధమై పోయింది
వైతరణిని భువికి దించినట్లుంది
భాగీరథిపారేనేలను
భాగాలు పంచుకుంటుంటే చూస్తూ నాలుక చాపే వారినొదిలి
కాపలాదారు ల్ని
కాలబెట్టాలనే ఆలోచనలు మొలకెత్తిన చోట
వైతరణీ ఉప్పొంగుతుంది
పొట్ట కూటికి
 రేయింబవళ్లు నిద్రాహారాలు మాని సాధించిన ఉద్యోగాలు
ముప్పయ్యేళ్ళ నిర్విరామశ్రమ
పెట్రోల్ పోసి దహనం చేయించుకోడానికా
కంటికి
 కునుకు లేకుండా చదివిన చదువులు కన్నవాళ్ళననాధలుగా మార్చుకోవడానికా
భూమికి
కాపలాదారులమే కానీ నీకేమైన పాలివారమా
నీకోసం
 పనిచేసే ఉద్యోగులమే కాని నీకేమైనా శత్రువులమా
పెట్రోల్ బాటిల్ విసిరేదెందుకు నేస్తం
 నాకూ బతకాలని ఉండదా
నేనూ మనిషినే నీలాగ
పిల్లల్ని
చూసుకోవాలనుండదా
నేనూ అమ్మనే / నాన్ననే  నీలాగ
మాకూ బతకాలనుంది. మిత్రమా !!!!

కొత్త ఆయుధాలు
ఆఫీస్ లో పెట్రోల్ బాటిల్
హైస్కూల్ లో కారప్పొడి
కాలం మారింది
........ వీరా గుడిపల్లి
20
31012020
...... *వీరా గుడిపల్లి*
నీకు తెలుసా
అడవి అంటుకుంటే ఆర్పడం కష్టం
అమెజాన్ మంటల సాక్షి గా
అసూయ నలదుకుంటే
తుడిపేయడం కష్టం. నల్లరేగడి బురదలో  సాగిలబడ్డ అరకోలె.
నీకు తెలుసా
తవ్వకాల్లో దొరికే సాక్ష్యాలు మాట్లాడుతున్నా
విశ్లేషణ కందని సమాజం సమాధిచేయబడ్డ నిజం
నీకు తెలుసా
నీరు పల్లమెరుగన్నది పాక్షిక సత్యం
కాళేశ్వరమెపుడైనా గమనించుంటే తెలిసేది.
నీకు తెలుసా
రాల్లకూ ప్రాణముందని
యాగంటి బసవన్న రంకె సంగతేమో గాని
యాటేటా పెరగడం లేదా...
నీకు తెలుసా
నాల్గక్షరాలు, రెండు ముచ్చట్లు యెంతమందిని జైలుపాలు చేశాయో
నీకు తెలుసా
తగలబడుతున్నదేదైనా తనున్నంతకాలం కమురుకంపు కొడుతుంది
నీకు తెలుసనుకుంటా
అక్షరాలు ఆర్పలేని మంటలన్నవి లేవని
నీకు తెలుసనుకుంటా
అసూయా తొడుగుల నంటుబెట్టి
లోకాస్సమస్తా సుఖినోభవంతు...
అనుకోగలిగితేనే ఆనందమని.
..... *వీరా గుడిపల్లి*
21
ఎంత గొప్ప విషయం???
మాటలు చెప్పడం లో నీతి ఉంటే చాలు
విషయ వాసనలొదలమన్నోడేనా
కోరికలను జయించమన్నోడేనా
కర్తవ్యం దైవమాన్వితమన్న వాడేనా
సంధి కుదిరితే ప్రమాదమని యెత్తగొట్టేందుకెలా మాట్లాడాలో చెప్పినోడేనా
చీరలు దొంగిలించినోడేనా
చిలిపి పనులని సరిపెట్టుకుందాం
గీత వాడినోట ఎలా పలికిందోకదా
కర్మణ్యేవాదికా... ఇదొక్కటే కదా వాడు పలికిన మంచిపదం
అవును మరోటుంది... మనవాడైతే చాలు జూదగాడినైనా కాపాడాలి
వన్ మోర్ ... మర్చేపోయా
మేనమామైనా సరే ... తప్పు చేస్తే ఒప్పుకోవద్దు
మొనగాడే కానీ... రాధా విధేయత ...లోని రహస్యం.
ఎనమండుగురెలా భరించాబరో
బువ్వ ...... తెలీదు.
పదహారు వేల మంది ... యేమోలే...
మా నిత్యానంద స్వామి యేం జేస్తుండో
కలియుగం దొంగల ను క్షమించదు.
మాయలోడెప్పుడూ.... మహా మొనగాడే
గీతను బోధించిన వాడు
బడ్డైనా... సరే... నమస్కరిస్తా
...... వీరా గుడిపల్లి
22
కాలం మారింది
మంచిరోజులు వచ్చాయి
వేలమందిని వేధించినా
పదుల్లో పెళ్ళాడినా
వావీ వరుస లేకుండా ప్రేమించినా
డయల్ హండ్రెడ్ లేదు
షీ టీమ్ లేదు
ఆడింది ఆట పాడింది పాట
నువ్వాకాలంలో లేవు.
నీ ఆటలు సాగవు
Be careful
23
....., వీరా గుడిపల్లి
*వీరా గుడిపల్లి కవిత*
01022020
*వెల్లిపో*
దూరంగా వెల్లిపోతున్నావు
నీకు ఇష్టమైతే అలాగే కానీ
నిష్కారణంగా దూషిస్తున్నావు
నీకు ఇష్టమైతే అలాగే కానీ
నిన్ను తప్ప మరెవరినీ ప్రశంసించకూడదంటే నావల్ల కాదు
అసూయను
ఆలింగనం  చేసుకుంటున్నావు
అమాయకంగా మొహం పెడుతున్నావు.
వెల్లిపో...
నీకు ఆనందం గా ఉంటుందంటే
*కవిచౌడప్ప కౌగిట్లో నలిగిపో*
సముద్ర మంత సౌందర్యానికి ఫేరండ్ లౌలీ అవసరం లేదు
ఎవరెస్టును
ఎక్కనివ్వనని అలిగిందట నిచ్చెన
పసిఫిక్ లోకూడా
మునగవు చేపలు
వాటికి ఈత తెలుసు మరీ !!!!....
కళ్ళు మూసుకుని ఆకాశాన్ని అవమానించలేం....
సూర్యోదయపు అందాలను చూడనంటూ వెల్లిపోతున్నావు. వెల్లిపో నేస్తమా
........ *వీరా గుడిపల్లి*
24
వీరా గుడిపల్లి కవిత
03022020
రాస్తున్నాను
రాయినై పడున్నాను
తంతున్నారు
దెబ్బ తగిలిందని ఏడుస్తున్నారు
తొక్కుతున్నారు
ఒత్తుకుంటుందని
మొత్తుకుంటున్నారు
మొక్కుతున్నారు
మొక్కులు చెల్లిస్తున్నారు
మోసపు కోరికల చిట్టా విప్పుతున్నారు.
నేరాయినై పడున్నా
రాతలు రాస్తున్నా.
నుదుటి పలకపై ఆరని సిరాతో
చదవలేక వాడు. చదివి మారిపొమ్మని నేను
తొక్కా లనుకుని,తన్నాలనుకుని
చేతకాక చేతులెత్తి మొక్కుతున్న తనంటే
నాకిష్టం.
నాకు తెలిసిందల్లా తనను ప్రేమించడమొక్కటే.... మరి
.....వీరా గుడిపల్లి
ఉన్మత్త వేష ప్రచ్ఛన్నాః
పిచ్చి వాడి వైతేనేం
ఆ వేషం లో ఉంటేనేం
వదిలేస్తామా
వల్లకాటికెల్లేవరకు ... నీ వడిని చేరేవరకు
25
..... వీరా గుడిపల్లి
*మూర్తి గారికి. నడుస్తన్న గణిత శిఖరానికి, ఉపాధ్యాయులకే ఉపాధ్యాయుడైన
లెక్కల సారుకు*
*జన్మదిన శుభాకాంక్షలు*
మరో మైలు రాయి దాటారన్నమాట
కాలమెంత వేగంగా వెల్లిపోతుంది
మొన్ననే జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన గుర్తు
గణితం నడక నేర్పిందా
గణితానికి నడకనేర్పారా యేదైతేనేంలే
మనల్నైతే గణితం కలిపింది.
మొహమాటంతో పెన్ను పెడితే లెక్కలు రావు
కసిగా సాగాల్సిందే.
అందుకేనేమో  నిర్మొహమాటంగా మాట్లాడడం అలవాటు మీకు
ఇంటిని, ఇల్లాలిని ఎంతగా ప్రేమిస్తారో అర్థమౌతుంది.
లెక్కలను ప్రేమిస్తూ లెక్కలేనంత అభిమాన బలగాన్ని సొంతం చేసుకున్నారు కదా
ఆ చిరు నవ్వు చెబుతోంది
మీరందరి వాడని, కాకుంటే కాకతాళీయంగా కలిసిన మనం ఎంత మంచి మిత్రులమయ్యాం.

ఆహార్యం చెబుతుంది నిర్మోహత్వానికి ప్రతీకని
సత్సంగత్వే నిస్సంగత్వం
నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మోహత్వే నిశ్చలతత్వం
శంకర భగవత్పాదులన్నారు కదా...
అందుకే
సదా మీ సత్సాంగత్యం కోరుకుంటున్నాం
జన్మదిన శుభాకాంక్షలు సార్
........ వీరా గుడిపల్లి
26
*వీరా గుడిపల్లి కవిత*
04022020
*మరచిపో*
కళ్ళు మూసినా
కనులు తెరిచినా
కలగన్నా
కలతపడినా
కన్పిస్తున్నది నేనే ఐతే
క్షమించేస్తా మిత్రమా
నన్నిక మరచిపో
నిద్రలేని రాత్రులకు
నిడివి తెలియని బాధలకు
నిమ్మలమెరుగని మనసుకు
నా తలపే కారణమైతే
క్షమించేస్తా నేస్తమా
నన్నింకా మరచిపో
కళ్ళలోన
నన్ను నిలుపుకుని
మనసులోన
మంచెవేసుకుని
నా అనుమతి లేకుండా
నామజపం చేస్తున్నావు
పెద్దమనసుతో
క్షమిస్తున్నా మిత్రమా
నన్నిక మరచిపో
సమస్తాన్ని శాసించేది
అవసరాలే
స్వార్థమనుకున్నాసరే
సమాజం మనవెంటే నడుస్తుంది
అవసరమున్నంత వరకు
నిజం తెలిస్తే
నీదే ఈకధ
అర్థం కాకపోతే
కధలో నీవుంటా వంతే
క్షమించేశా నేస్తమా
నన్నింకా మరచిపో
....... *వీరా గుడిపల్లి*
27
05022020
వీరా గుడిపల్లి కవిత
శీర్షిక ః  క్రిష్ణ మాయ
*పూతనను చంపినా*
పోతన రాతల్లో చిక్కినా
*ప్రేయసి కౌగిలిలో బంధీయైనా*
పద్దెనిమిది అధ్యాయాల భగవద్గీత ను యుధ్ధక్షేత్రంలో అందించినా
*శిశుపాలుని వధతో*
*సంప్రదాయానికి విలువివ్వడం నేర్పినా*
పాండవుల పక్షాన నిలబడి ధర్మాన్ని కాపాడినా
*ఇచ్చిన మాటకోసం ప్రియసఖుడు పార్ధుని తోనే గొడవకు దిగినా*
అవసరం కోసం కర్ణుడిని పాండవ పక్షం చేరమనడిగినా
అన్న మాటను కాదని చెల్లి వివాహం పార్థుడితో జరిపించినా
*ధర్మ రక్షణ మాత్రమే కనిపించింది*
*ధరణీ సౌఖ్యమే ధ్వనించింది*
ఎనమండుగురితో వివాహం
రాధతో ప్రేమాయణం
మురళీరవం మాయతో మురిపించిన దెందరినో....
ఇదీ  ధర్మం కోసమేనా ...
ఐనా సరే ఓ అభిసారికలా.... *గోపిక*
హే క్రిష్ణా!!!!! ఏమిటీ మాయ!!!
*అంతా క్రిష్ణ మాయ*
........ *వీరా గుడిపల్లి*
28
05022020
వీరా గుడిపల్లి కవిత
అలలు తీరాన్ని తాకనీ
యే మౌతుంది
ఉదయాలకు కొరతుండదు
అస్తమయాలు ఆగిపోవు
అలలు తీరాన్ని తాకనీ
యేమౌతుంది
సముద్ర స్వరం వినిపించదా
అలలు తీరాన్ని తాకనీ
యేమౌతుంది
నయాగరా నయగారాల నాణ్యత తగ్గుతుందా
అలలు తీరాన్ని తాకనీ
యే మౌతుంది
ప్రపంచం పరవశిస్తుంది
ఆమె కవిత్వం సముద్రస్వరం
ఆమె కలం దధీచి వెన్నెముకను వజ్రాయుధంగా చెక్కగా రాలిన రవ్వల సముదాయం
ఆకలం పైపైకి ప్రయాణించ జూసే అగ్నిజ్వాల
అలసట తెలియని
బల్లూరి ఉమాదేవి గారి కవనానికి
వీరాభిమాని
ఈ వీరా గుడిపల్లి
జన్మదిన శుభాకాంక్షలు మేడమ్
29
వీరా గుడిపల్లి కవిత
06022020
కోలుకోలేక పోతున్నావట
కోలుకోలేక పోతున్నావట
యేమైంది
యెవరో యేమో అన్నారనా
వారు సత్యసంధులనుకుంటున్నావా
*నీ ఆనందాన్ని*
వారి చేతుల్లో పెడుతున్నావు
అవసరం లేదు
నీవు కోలుకోవలసిన పనేలేదు
యెవరి
ఫోన్ కోసమో ఎదురు చూడడం
రోడ్డెక్కగానే
హెడ్ ఫోన్స్ ధరించడం
పరిసరాలు మర్చిపోయి మాటల్లో పడడం
నీకంటూ
ప్రపంచం లేదా దానికి నీవే రాజువు కాదా
నీ ఆనందాన్ని
ఎవరి చేతుల్లోనో పెట్టడమెందుకు
ఇంకా
కోలుకోవాల్సిన పనేముంది.
*మనవసరం*
శాసించాలి వాల్లను
*మన మనుగడ*
వాడికి జీవితాన్నిచ్చేదై ఉండాలి
*మన ప్రాణం*
మనకంటే వారికే ఎక్కువ అవసరమనిపించాలి.
*కోలుకుంటావు.*
సమాజం నిన్నే కోరుకుంటుంది.
ఆకుపచ్చ ప్రపంచంలో
*పండుబారిన ఆకులు రాలిపోక తప్పదు*
*కొత్త చివుళ్ళకు చోటివ్వడానికి*
30
....  *వీరా గుడిపల్లి*
గ్రూపు :-సాహితీశ్రేష్ఠులు
అంశం :- గౌరవం
తారీఖు :- 07022020
పేరు:- వీరా గుడిపల్లి
శీర్షిక ః  *గౌరవమంటే*
గౌరవమంటే
మన ఉనికి గుర్తించబడడం
వీచే గాలికి
చిటారు కొమ్మలు తలలూపడం
వేకువ రాకను గమనించి
కోడికూత గూయడం
వసంతాగమనానికి
కోయిల పాట పాడడం
*నా రాకను గమనించి*
*తను చిరునవ్వు నవ్వడం*
మీ రాకను గమనించి
నేను లేచి నిలబడడం
తన కవితను చదివి
నా మనసుప్పొంగడం
గౌరవమంటే
*శ్రమజీవి చెమట చుక్కకు*
*పుడమి గర్భం  చీల్చుకొని మొక్క తొంగి చూడటం*
గౌరవమంటే
*నాన్నరాకకై*
*అమ్మ చూసే ఎదురు చూపు*
ఎదుటి వారి
ప్రత్యేకతను మనసారా అంగీకరించడం
గౌరవం అంటే
నీ ఉనికిని గుర్తించి  ఆనందించడం
*గౌరవించడం అంటే*
*నిన్ను నేను గుర్తించడం*
*ఆ సంస్కారం నాకుండడం*
.....     *వీరా గుడిపల్లి*
31
గ్రూపు :-సాహితీశ్రేష్ఠులు
అంశం :- గాజు బొమ్మలు
తారీఖు :- 08022020
పేరు:- వీరా గుడిపల్లి
శీర్షిక ః  *గాజు బొమ్మలు*
వీరా గుడిపల్లి కవిత
08022020
సహారా సౌందర్యం
థార్ రాజసం
మూసీ సౌజన్యం
ఎవరెస్ట్ వన్నెలు
కాంచనగంగ తిన్నెలు
అర్వపల్లి గుట్ట అందాలు
అనుష్క ఆలోచనలు
సమంత హృదయం
నయనతార అంతరంగం
వెన్నెల వెలుగులు
శీతల సమీరాలు
మానస శిఖరాలు
పవన్ రాజకీయం
చిరు ఆశీస్సులు
అల్లూ అరవింద్ యశస్సు
గోఖలే మార్గం
భగత్ సింగ్ మానసం
అల్లూరి అంతరంగం
తెలంగాణ తేజం
ఆంధ్రా రాజసం
భారతీయుల పౌరుషం
గాజు బొమ్మలనుకుంటున్నారా
దూరంగా చూశారు కాబోలు
వేదనాదంవినిపించే..‌..
విశాఖ తీరంలో నిలబడి
... ఆకాశం వైపు చూస్తూ
తారలు చెప్పే కబుర్లు వినండి
మీరు గాజు బొమ్మలనుకునే ఘనకీర్తుల వివరాలకోసం
...... వీరా గుడిపల్లి

No comments:

No comments:

Post a Comment

వీరానుగమనం 3

వీరానుగమనం...3 ప్రేమకధ తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి. టీ తాగాను చెల్లి తెచ్చిచ్చింది. బాలేదని చెప్పి వె...