Tuesday, July 11, 2023

వీరానుగమనం 3

వీరానుగమనం...3
ప్రేమకధ
తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి.
టీ తాగాను
చెల్లి తెచ్చిచ్చింది.
బాలేదని చెప్పి వెల్లాను
మాకిది మామూలే. మల్లీ చేసి తెచ్చిచ్చేది
తోబుట్టవు కదా‌. కోపమంటే తెలీదు తనకు.
మంచితనానికి మానవరూపం.
ఈరోజేంటో...
తను టీ తాగలేదు అన్నయ్యా అన్నది.
టీ చేసింది నేను కాదన్నది.
అవునా...
తనంటే అభిమానం అంకురించిందపుడేనా అంటే కచ్చితంగా చెప్పలేను.
చాలా సార్లనిపించింది
తనను మొదటిసారి చూసినప్పటి నుండి
ఎక్కడికెల్లినా తనదగ్గరేదో వదిలి వచ్చినట్లనిపించేది
మనసంతా దిగులుగా
 ఏదో కోల్పోయినట్లుగా
ఏంటో అర్థం కాకపోయేది.
ఇప్పటికీ తెలీదు.
ప్రేమే నేమో అనిపించేది. కానీ ఇప్పటికీ అలాగే ...
నా మనసంతా తానేనని
తనతో గొడవ పడిన సందర్భాలు లేవు.
 ప్రతి క్షణాన్ని కళ్ళతో ఆస్వాదించాం
మొబైల్ లేని రోజుల్లోనూ మాటలకు సెలవివ్వలేదు
టెలీపతి కమ్యూనికేషన్ లో తేలిపోయాము.
కరస్పర్శ నెరుగుని అభిమానం
మనసులు పెనవేసుకున్న మధుర భావన
ఆ  మనసెందుకో నన్నల్లుకుని బందీని చేసింది
తన ఆలోచనలేని క్షణం నేను గడిపిన గుర్తైతేలేదు.
ఇది ప్రేమో కాదో
ఎవరి పనుల్లో వాల్లం
కనపడగానే .... అంతే అదేంటో
ఇప్పటికీ తెలీదు ఏమైందో ఆక్షణం ఎవరికి యెవరమో యేమౌతామో
ఇది ప్రేమకథా!!!
కాకుంటే ..ప్రేమకధలనేవే ఉండవు మరి
ప్రేమంటే నిజం తెలిసింది
ఒకరికొకరు సర్వస్వం అనిపించడం
ప్రేమంటే యేంటో తెలిసింది
తలుపులన్నీ తానై బతకడం

ప్రేమంటే దేహాలొకటవ్వడమే ననే ఆలోచన రాకపోవడం
దేశంకంటే మిన్నగా అభిమానించడం

ప్రేమంటే యేమీ ఆశించక పోవడం
ప్రేమంటే తనే తలపై గమిం
చడం.
అవును తనగురించి చెప్పాలి.
లేదంటే ప్రేమంటేమిటో యెలా తెలుస్తుంది

మౌనంగా ఉన్నానంటే తనతో మాట్లాడుతున్నాననేకదా
కళ్ళు మూసుకున్నానంటే తనను చూస్తున్నాననే కదా
తనను ప్రేమిస్తున్నాననే అనిపిస్తుంది.
 నిజమే
తొలి సారి చూసిందెపుడు
ప్రేమకు కొలతలూ, లెక్కలుంటాయా
నీటిలో ఈదుతూ నీరంటే యేమిటన్న సందేహం
యేది ప్రేమ కాదో చెప్పగలం.
ప్రేమంటే తెలిసిపోతుంది తెలపలేం
చెట్లనూ పొదలనూ ప్రేమించండి
చెట్లమాటున పొదలమాటున కాదు బోర్డుందక్కడ
ప్రేమంటే చాటు మాటు వ్యవహారం కాదు
జీవితమంటే ప్రయాణం
ఎవరి మార్గం వారిదే
ఎప్పటికీ మరువలేని జ్ఞాపకంగా తనను మోస్తూ
ఎప్పటికీ చూస్తున్నా

 కనిపిస్తే చాలు  మానస సరోవర తీరంలో మౌనంగా ఉన్నట్లనిపిస్తుంది.
ఎవరెస్ట్ శిఖరం పై ఏకాంతంగా ఉన్నట్లనిపిస్తుంది.
ఆ పాదం మోపిన చోట పూలు చల్లి పూజించాలని అనిపించదు
ఆపాదాలు తనవై పోవడానికి ఏంచేశాయో కదా అనిపిస్తుంది.
తనంటే దేహమన్న ఆలోచన కాదు
ఆ దేహం నాదైపోవాలన్న ఆలోచన రాదు.
ప్రేమంటే ప్రేమించడమే !!!!
రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటుండె
యండమూరి నవలకు సెల్యూలాయిడ్
ప్రేమంటే
యేమైనా యివ్వగలిగే స్థితిలో ఉన్నా తానేమీ కోరకపోవడం.
ప్రేమంటే
ఏమైనా తీ‌సుకోగల స్వతంత్రమున్నా యేమీ తీసుకోకపోవడం
ప్రేమంటే తనూ నేను.
యెప్పుడూ యెక్కడా చలించని మనసుంటుందా...
ఉంటుందంటే అబద్దమే
 ప్రతిదీ ప్రేమైపోదు ఆరాధనో ఆకర్షణో
తనముందేదీ నిలబడలేదు. తానే ప్రేమంటే.
దేవాలయాని కెళ్ళినా, పూజల్లో కూర్చున్నా
తనపై నమ్మకమే తప్ప దేవుని పై కాదు
తనకోసం యేమైనా చేయాలనిపిస్తుంది
తానేమీ కోరదు
తనులేకుండా యేక్షణం గడవదు
ఈ నాలుగు అక్షరాలు రాస్తుంది తనే కదూ
ఫస్ట్ క్రష్ తనే, ఫైనల్ క్రష్ తనే
ప్రేమంటేనే తను.
..... వీరా గుడిపల్లి

No comments:

Post a Comment

వీరానుగమనం 3

వీరానుగమనం...3 ప్రేమకధ తనగురించి చెప్పాలి‌.ప్రేమంటే తన గురించే చెప్పాలి. టీ తాగాను చెల్లి తెచ్చిచ్చింది. బాలేదని చెప్పి వె...