Friday, April 24, 2020

యెవరేమన్నారు p5



************************************







































పోతన సమాధి దగ్గర బమ్మెరలో

ప్రపంచ మహాసభలలో



శివునూరి లలితా కృష్ణ మ
1.వాకిటి రాంరెడ్డి గారు
*వెన్నెల చంద్రుడు -వన్నెల వీరుడు *
2.వాకిటి రాంరెడ్డి గారు
3.చంద్ర శేఖర్ శర్మ గారు
4.డాక్టర్ పాండాల మహేశ్వర్ గారు
5.అమరకుల
6.కళాచందర్
7.అంజయ్య గౌడ్
8.అరాశ
9.అంబటి భాను ప్రకాష్
10.సీ.వీ.కుమార్
11.నాగ మంజరి గుమ్మా
12.వడ్త్య నారాయణ
13.అమరకుల
14.శివునూరి లలితా కృష్ణ
15.శివునూరి లలితా కృష్ణ
16..కొరివి కృష్ణ
17.కళాచందర్
18.మధుర కవి
19..శివునూరి లలితా కృష్ణ
20..... పౌర్ణమి
21.అరవిందరాయుడు
22.సీవీశ్రీ
23.లలితా కృష్ణ
24.శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు3/8/2020
25.యేరువ ఇందిరా రెడ్డి 5/8/2020
26.ఇంద్రావత్ రాహుల్ గారు
27.మల్లావఝల చంద్ర శేఖర్ శర్మ గారు
28.గడ్డం లక్ష్మయ్య గారు కాటారం
***************************************
 Veera Gudipally: 
ఎవరీ వీరా???

ఐ క్యూ కి ఐకానా..???

వేదిక్ మ్యాథ్స్ కి వేదికలిచ్చిన గణితావధానియా ...??

ఏమీ ఆశించని సాహితీసేవాభిలాషియా ??
..??

ఎన్నో హృదయాలను గెలుచుకున్న వీరాభిమానియా ??

మౌనముని శిష్యులా..??

అన్న 
ప్రశ్నలన్నింటికి సమాధానంగా 
 అవునని తలూపక తప్పదు

అంతేనా...

అక్షరాలపై ఆపేక్ష కలవారెవరైనా....
ఆ వైపు చూడాల్సిందే..!!

ఆ పదాలు పాజిటివిటికి పర్యాయపదాలై ఎదిగిపోతాయి 

ఆ వాక్యాల ఒరవడి లో ఉపమానాలన్నీ మౌనంగా ఒదిగిపోతాయి

ఆ సమీక్షల సవ్వడి ఉత్ప్రేక్షలకందక ప్రేక్షకులను...
వీక్షకులను..
ప్రోదిచేస్తాయి

ఆ సహవాసం 
విశ్లేషణలో శ్లేషలు
రూపకపు ప్రాపకాన్ని 

అభ్యుదయభావాల స్వభావోక్తులను 
పరిచయం చేస్తుంది...

అక్షరాలకందని ఔన్నత్యం
పదాలకందని ప్రాశస్త్యం
సేవాదృక్పథమే పథంగా గలిగి

ఔరా అనిపించేలా 
నానార్థాలలో అగుపించే
బహుముఖప్రజ్ఞాశాలి
 మన *వీరా*

అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు
💐💐💐💐💐
*****శివునూరి లలితాకృష్ణ
 కవనజ్యోతి సమూహ
రథ సారథి
వీరాగుడిపల్లి గారికి

 జన్మదిన శుభాకాంక్షలు 
💐💐💐💐💐
[25/01, 6:24 am] 
Maddi Pullarao Poet: హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్.

[25/01, 6:26 am] 
Shiva Kumar Medisree: 
కవి మిత్రులు శ్రీ వీరా గుడిపెల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు
శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం ఆశీస్సులతో మీరు మీ కుటుంబ సభ్యులు సదా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను

[25/01, 6:40 am] +91 94405 22864: 
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

[25/01, 6:43 am] 
Uppalaiah Sir Patimatla Palapittalu: 
హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు వీరన్న 
💐💐💐💐💐
[25/01, 6:59 am] Aparajith: హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు వీరా సర్
🙏🙏🙏👍💓
[25/01, 7:00 am] 
+91 98855 52922: జన్మదిన శుభాకాంక్షలు వీరాగారు
💐💐
[25/01, 7:04 am] 
SRINIVASA CHARY Gajavelli: జన్మదిన శుభాకాంక్షలు
[25/01, 7:06 am] Korada: 🎊🎊🎊🎷🎻🎼🎼నిండు నూరేళ్లూ....బంధు, మిత్ర, సహితముగా... ఆనందోర్సాహాలతో.... 
  జరగాలి మీ జన్మదిన వేడుకలు.... హార్దిక శుభాకాంక్షలతో... కోరాడ.

[25/01, 7:50 am] 
+91 94942 05334: హార్దిక జన్మదిన శుభాకాంక్షలు సర్ 
💐💐💐💐💐💐💐💐
[25/01, 9:08 am] 
+91 99592 67818: 
వీరా సర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 💐💐🎂🍰🍫🍫🎊🎊
[25/01, 10:02 am]

 పిన్నక నాగేశ్వరరావు గారు Poet: జన్మదిన శుభాశీస్సులు వీరా గారూ!!🌳🌹🌴🍁🎄🌸☘️🌷🍀💐
[25/01, 10:02 am]
 K Devika Rani Rathnakar Poetess: వీరా గుడిపల్లి సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు 🙏🤗🎊🙏 కే దేవికారాణి రత్నాకర్ తెనాలి

[25/01, 10:13 am] Madhumohan గారు

Happy Birthday Sir

[25/01, 10:24 am] 
Gorrepati Srinu Garu Poet: Many more happy returns of the day Dear Sir 
💐💐💐💐💐
[25/01, 10:30 am] 
Savithri Shivanoori Sister Of Lalitha:
 వీరా సర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు💐💐

[25/01, 10:30 am] 
+91 99373 80136: 
జన్మదిన శుభాకాంక్షలు వీరాగారు💐💐💐💐

[25/01, 10:35 am] సింగీతం సంతోష్ కుమార్: 

happy 🌺🌷🌻🌺🌾💐
🌿☘️🌻🥀🌾🌺🌺💐🌻🌼🍀🌷🌹🌿🌸🌻💐🌾🌺🌺🌾🌻🌻🌷🌷☘️🌻🥀🌾🌺🌺💐🌻🌼🍀🌷🌹🌿🌸🌻💐🌾🌺🌺🌾🌻💐💐
returns 🌷🌻🌻🌺🌺
🌹🌿🌸🌻💐🌾🌺🌺🌾🌻🌻🌷🌷☘️🌻🥀🌾🌺🌺💐🌻🌼🍀🌷🌹🌿🌺💐🌷🌾🌾🌾
of 🌷🌷☘️🌻🥀🌾🌺🌺💐🌻🌼🍀💐🌷🌷
🌾🌷🌷🌹🌹🌾🌼🥀
the 💐💐🌺🌾🌻🌻🌷🌸🌹🌻🌼🌹🌸🍀🌹
🌿🌻🌹🥀🌼🌺🌹🌻
day 🍀☘️🌸🍀🌹🌻🌼🌼💐🌾🌾🥀🥀🌻🌿🌿🌹🍀
Sir.... *సింగీతం సంతోష్ కుమార్*

[25/01, 10:55 am] 
Kalva Rajaiah: జన్మదిన శుభాకాంక్షలు సార్🎂💐🎂💐

[25/01, 11:31 am] Venkatesh Boppena Poet: జన్మదిన శుభాకాంక్షలు సార్🎂💐🎂💐

[25/01, 11:51 am] 
అఫ్సర్ వలీషా గారు: హృదయపూర్వక జన్మ దిన శుభాకాంక్షలు శుభాభినందనలు సార్ మీకు💐💐💐💐💐ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో మరెన్నో ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో, సుఖ సంతోషాలతో జరుపు కోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🎉🎊🎂💐🎉🎊🎂💐🎉🎊🎂💐

[25/01, 12:00 pm] 
సయ్యద్ జహీర్ అహ్మద్ Poet Kurnool: 

గుడిపల్లి వీరా సర్ కు హృదయపూర్వక జన్మదిన శుభాభినందనలు 💐💐💐💐💐💐

[25/01, 12:34 pm] Mekala Ramaswamy Poet: 

గ్రూపు అడ్మిన్ గారైన శ్రీ వీరా గుడిపెల్లి
గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు
***************************
కందము
*******
విద్దెల తల్లిని గొలుచుచు
పద్దతిగా కవనసేవ బాగును తలచే
పెద్దవు! పుట్టిన దినమీ
పొద్దున నిదె యందుకొనుము పొలుపుగ ప్రణతుల్!
**************
మేకల రామస్వామి

[25/01, 1:04 pm] 

అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు Poet Vizag: జన్మదిన శుభాకాంక్షలు శ్రీరామచంద్రుని అనుగ్రహము ఎప్పుడు మీ కుటుంబం పై ఉంటుంది.
ధీర్గాయుష్మాన్ భవ.

[25/01, 1:11 pm] 

Siimhadri Vani గారు Poetess: 
వీరా గుడిపల్లి గారికి జన్మదిన శుభాకాంక్షలు.🎂🎂🍊🍊🍿🍿🍋🍋🍅🍅

సింహాద్రి వాణి
విజయవాడ.

[25/01, 1:14 pm] 
సూర్యారావు దత్తప్ప గూడెం: జన్మదిన శుభాకాంక్షలు సార్ 💐💐💐💐

[25/01, 1:26 pm] Vakiti Ramreddy Poet: *
*గుడిపల్లి వీరునికి జన్మదిన శుభాకాంక్షలు* 

కవన గుండెగుడిలొ కొలువైన గుడిపల్లి 
సాహితీ సేవలకు కవితలోకం ప్రణమిల్లి 
వాఖ్యానంలో విఖ్యాతిగాంచిన వీరుడా 
వినమ్రమనసున్న నిత్యచైతన్య బాలుడా 

ఉమ్మడినల్లగొండ ఉజ్వల ఉపాద్యాయుడా 
చిగురించిన చిత్తలూరు మట్టిపరిమళధీరుడా 
అమ్మానాన్నలే ఆదిదేవుళ్ళని మొక్కినపుత్రుడా 
విద్యబోధనలో గగనమెక్కిన గణితోపాధ్యాయుడా 

ఆదర్శప్రాయమైన మాగుడిపల్లివీరుడా 
అందుకో పుట్టినరోజు కవితశుభావందనాలు 
తల్లిదండ్రుల ఆశీస్సులతో ఆయురారోగ్యంతో 
అనునిత్యంహాయిగా ఆనందముగా ఉండాలని 

నిండు నూరేళ్లు చల్లాగా వర్థిల్లాలని కోరుతూ 
నిండుమనసుతో మీకుజన్మదిన శుభాకాంక్షలు 
ఆత్మీయ అభినందనలతో మీ ఆప్త మిత్రుడూ 
*కవిగాయకుడు పుడమిరత్న వాకిటి రామ్ రెడ్డి* 


[25/01, 1:38 pm] Satyam sir s. w: 🌹పుట్టిన రోజు శభాకాంక్షలు *వీరా రెడ్డి సార్*

[25/01, 2:24 pm] 
+91 94932 73114: Many many happy returns of the day sir 💐💐💐💐💐
Konjeti.Radhika
Rayadurg

[25/01, 2:28 pm]
 +64 21 233 1334: 
వీరా రెడ్డిగారికి జన్నదిన శుభాకాంక్షలు 💐💐💐💐💐🎂
సాహిత్య సేవ లో సరిగమల రసమాధుర్య ధారలు నింపుతూ మైత్రీ భావము జూపుతూ ఎన్నో పలువురు మెచ్చే కార్యక్రమాలు చేబడుతూ మాతృమూర్తి ముద్దు బుద్దవైన వీరా విజయోస్తు. ఆయుష్మాన్ భవ
👏👏👏

జన్మ మెత్తి జయము సాధించి వీరుడ 
వైతి వన్న.వీవు బాగు బాగు పదుగురుపొగ డంగ పనియేమి సాగిపో
విజయ పథము వైపు వీర పుత్ర ********

[25/01, 3:37 pm] 
కేశరాజు వేంకట ప్రభాకర్ రావు గారు Poet: 
జన్మదిన శుభాకాంక్షలు సర్

[25/01, 3:39 pm] 
Lakshmi Chamarthi గారు Khammam:
 హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు sir 🌹🌹🌹

[25/01, 4:14 pm] 

మన్నె లలిత గారు కవయిత్రి: వీరా గారు 
పుట్టినరోజు శుభాకాంక్షలు 

[25/01, 4:19 pm] 
Tiru Venkatacharyulu Ks6: 
శ్రీ వీరాగుడిపల్లి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు.💐💐💐
[25/01, 4:35 pm] Komuravelli Anjaiah గారు Poet And Journalist Sdpt: 
జన్మదిన శుభాకాంక్షలు

[25/01, 4:52 pm] 
సునంద వురిమళ్ళ గారు: 
పుట్టిన రోజు శుభాకాంక్షలు సర్ 💐💐💐💐💐

[25/01, 5:02 pm] +91 79978 40591: హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సార్ 


[25/01, 5:27 pm] Kavita Venkateshwarlu Garu: 
జన్మదిన శుభాకాంక్షలు సార్

[25/01, 5:58 pm] 
Tuniki Venkatesham Poet: పుట్టినరోజు శుభాకాంక్షలు సార్

[25/01, 6:59 pm] 
Aalla Nageshwar Rao Poet: 
శ్రీ వీరా గుడిపల్లి గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

[25/01, 7:01 pm] 
Venkat Reddy Jakkidi Math Sa Poet: 
హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు sir 🌱🌹

[25/01, 7:04 pm] 
Giridhar Kandula: గుడిపల్లి వీరా రెడ్డి సార్ గారికి
హృదయ పూర్వక
జన్మదిన శుభాకాంక్షలు

[25/01, 8:48 pm] 
మన్నె లలిత గారు కవయిత్రి: అన్నకు తగిన చెల్లెలుగా అద్భుతంగా వ్రాసిన కవితకు అభినందనలమ్మా లలితా.
🌿😀🌿🌸💐🌲🌸🌷🪴🌹🪷🌲🌿🌻🌿
మరో మారు వీరా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు 
🌿💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌿.

[25/01, 9:55 pm] 
Ramulu adelli Poet: 
కవితా గానం
కళానిధి
వీరా వారికి హృదయపూర్వక జన్మదిన
 🎂 🎂 🎉 శుభాకాంక్షలు 🌹

ఏడెల్లి రాములు ✍️
 ఎల్కలపెల్లి🌹

[25/01, 9:58 pm] 
Vinjamoori Surya Laxmi Poetess: వీరాగారు
జన్మదిన శుభాకాంక్షలు .
తరణికంటి సూర్యలక్ష్మి .
             *****

[25/01, 10:00 pm] 
Vinjamoori Surya Laxmi Poetess: 1) 
వీరాగారికి
జన్మదిన శుభాకాంక్షలు .
       తరణికంటి సూర్యలక్ష్మి .
                *****

[25/01, 10:25 pm] 
+91 94236 90615: 
సమూహ సారథి వీరా గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు & అభినందనలు.
సాహితీ సేవలో నిరంతరం సాగాలని గీర్వాణిని కోరుకుంటున్నాను.
💐
1.
***వెన్నెల చంద్రుడు -వన్నెల వీరుడు ***

పల్లవి :  పునాస పల్లెల్లో, పుట్టిన వీరుడు
                పుణ్ణమి వెన్నెలై ,నవ్వులు చిందిండు : 2 :

1             ప్రకృతి లోగిల్లో ,పరువాల బాలుడై
                పసిడి బావంతో ,పరమేశ్వరుణ్ణి మొక్కిండు
                తాతల  వాత్సల్యం ,తనువులో నింపిండు
                తరగని ప్రేమంటూ  ,జన్మంతా కోలిచిండు

2             అమ్మా ,నాన్నలకు ,అండగానిలిచి
                అన్నిపనులకు   ఆసరగుండు
                పట్టుదలలకు , విక్రమార్కుడై
                చదువులమీద ,పట్టునిలిపేను

3            చిత్తలూరిలో, సత్తాచాటుతూ
               దోస్తులతోటి ,ఆట లాడెను
               అందరిసేవలో  ,ఆనందముగా
               పల్లెప్రేమలో ,చిందులేసేను

4           లెక్కలమీద ,మక్కువజూపి
              గణిత శాస్త్రంలో ,గణుడయ్యేను
              రంగ మండపం ,గుర్తుతెచ్చుకొని
              శంభు,లింగేశ్వరుని ,కొలిచేను

5           ఉమా ప్రేమలో, ఉశస్సు చెంది
              ఉపాధ్యాయుడై ,యశస్సు పొందె
              గణిత గమనము, వేదగణితము
              శంభో గణితమని, శతకమువ్రాసే

6           కమ్మనికార్యం కవులవేదిక
              కరోనాకాలం ,కలిసిన సమయం
              కవుల మనస్సులో వెన్నెల నిలిపి
              పుణ్ణమి వెన్నెల ,వీరుడైయ్యేను

రచన :వాకిటి రాంరెడ్డి ,కవి గాయకుడు
ఆత్మీయ భారతి సాహిత్య సేవ సంస్థ
పులిగిల్ల ,వలిగొండ ,యాదాద్రి భువనగిరి

2

వీరుడా ,శూరుడా ,కవులవేదిక బీముడా !
వినమ్ర ప్రాణామములు ,అందొకో రాముడా !!
నీ మాటల సత్యాలే, మా ఎదలో ముత్యాలు
నీ మనసైన పలుకులే ,మా భవిత మెలకువలు
అమ్మలాగా లాలిస్తావ్ ,నాన్నలాగా ప్రేమిస్తావ్
అన్నలాగా హత్తుకుని ,తమ్ముడులా ఎత్తుకొని
అక్కలాగా మురిపిస్తావ్ ,చెల్లెలా మెరిపిస్తావ్
అన్నిటిని మరిపిస్తావ్ ,అనందం కురిపిస్తావ్
కవిత కవిత తిరిగేసి ,కవిగొంతును మరిగిస్తావ్
కమనియా బావంతో ,గళమెత్తి చుపిస్తావ్
ఏమని చెప్పను నీకు ,ఎంతని వ్రాయాలి మేము
అంతులేని సంతొషం ,నింపినావు ఆనందం .
మరవలేని బందం,మమతల ఆనందం
వీరుడా వందనం, కవిశూరుడా వందనం
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
వాకిటి రాంరెడ్డి 03042020

3
నిత్యసంతోషమ్ము నిలుపువీరాసారు
పదముల కేళితో పరవశించు
లెక్కతోనుండును లెక్కలమాస్టారు
చిత్తలూరిశివుని సేవజేయు
మాటతో మంత్రాలు మత్తునుకలిగించి
మనిషిహృదిననిల్చు మమతమూర్తి
రమణతత్వముతోడ సమభావమునుజూపు
స్నేహమేముఖ్యమై నిలచునెపుడు

గణిత మవధానమునుజేయు ఘటికుడతడు
కవిత తోమార్చు  మనుజుల గతులతాను
నొప్పి బెట్టడు "నన్నిటి నొప్పుకోడు
తపసి యైనిల్చు నిరతము తలపులందు
... చంద్ర శేఖర్ శర్మ
4
💐💐విమలకీర్తి💐💐
                           ✍️డా.పాండాల.
లెక్కల్లొతా మున్గి తిక్కల్ని తెగటార్చి
చిత్తలూరీశుని చిత్తమెంచి!

మాటతోమంత్రాల్ని మత్తుగావిరజిమ్మి
మానవాహృదినిల్చు మమతలెంచి!

రమణతత్వంబెంచిరమణీయభావాల
స్నేహవాత్సల్యాల శీలమెంచి!

నిత్యసంతోషుడై  నిలువెత్తు సాక్షిగా
గుడిపల్లివంశాబ్ది గుణశశుండు!

వీర సారుగా యాదాద్రి విమలకీర్తి
సత్య కృత్యాల సంస్కార నిత్యదీప్తి!

కాలగతులెల్లమనుజుల గమన కాంతి
తపసి యైనిల్పె తలపులే తనకు యుక్తి

 ,,✍️డా.పాండాలమహేశ్వర్
గౌసుకొండ పోచంపల్లి యాదాద్రి
5
వీరా గుడిపల్లి - అమరకుల శెట్టిపల్లి
°°°°°°°°°°°°°°°°€€€°°°°°°°°°°°°°°
భలే జోడి బలపాల ఒడి అక్షరాల  సవ్వడి
ఓ ధరహాసం ధరణిలో గాత్రమో గంభీరమౌ
ఆ కంఠం వినబద్దౌ గట్టి లెక్కల పద్యాలగూ
చిత్తమంత ఊరి ఊరి మధురోత్కంఠ అగు

లాక్షణికత నైజం నాడి చిక్కని అతి ఛమక్
దొరకబుచ్చుకుంటె దోసిటిలో గాలై పోవును
గణితం అంటే అర్థమే కాని వారు అటెళ్తే సరి
అలవోకగ మంచినీళ్ళలా బోధపడు పద్యాలై

వాదం లేదు వివాదం రాదు గొడవలే రావుగ
గాలియై తిరుగాడు జలమై ఆవరించు భావం
చిత్తలూరి శివుని లా అరుణాచలం రమణులా
అదో బ్రహ్మపదార్థం అంతుబట్టని కెమిస్ట్రీ

                        °°°°°°€€€°°°°°°
                             అమరకుల
                         దృశ్యకవి చక్రవర్తి

6

🌺🌺🌺🌺🌺🌺🌺🌺

అబ్బురమే మా వీరన
దబ్బుననీ యెనిమిదికళ శతకముజేయ!
మబ్బున మబ్బుననే తను
రుబ్బిన ఈ కవనమెంత రుచిగావుందో !?
🌺
మా గుడిపెలి కళ వీరయ
మహా కవనజటాఝూట దారేనయ్యా !
ఏ  దారిన తాను పోను
ఆ దారిన శివుడు అండవుండేనయ్యా !!
🌺

పోతే పోనీ పో యని
పోనీకనె పొరలుకళా పోటై కవనం !
వస్తేరానీ యని వీరన
రానీకే రాయుచుండు రచనల్ శతముల్ !!
🌺
తగవంటే తగదందువు
తనమంటే ముందుందువు తనమేరచనై !
తగదన్నా వినవన్నా !
పరుగున ఆ స్వయంచిత్త కళవేయన్నా !!

🌺
అన్నా ! ఓ మా వీరన !
ఉన్నా ! నీవంటివాడు ఉండాలన్నా !
ఉన్నవంటె లేనట్లే !
లేకున్నను ఉన్నట్లే ! కళ లేపనమన్నా !!

🌺
దశదిశగా సాగు వీర
దశనీదెట్లుందో జూడ దశదెశనీదే !
దశశ్శతక పద్యాలను
దిశగ్గొట్టి చూపు కళాధనుడవు నీవే !!
               🌺
               ✏@ కళాచందర్,
                            జర్నలిస్ట్.
                         ( SK 387 )
7

కం...
గుడి పల్లి వారి కవితలు
నడయాడెడి ఎంకిలాగ నానావిదముల్
గుడియో బడియో ఒడియో
విడియమువలె జెప్పుచుండె వేడుకలలరన్
అంజయ్య గౌడ్ 20.12.2015

అంజన్న...6.3.2016
వీరన్నా! పద్యములో
వారిజరిపు మౌళి మహిమ వర్ణించుట ,నీ
నేరుపు గొనియాడ తరమ
పారావారము వలెనిల పరుగిడు కవితల్
6.3.2016

8
🌺🌺🌺🌺🙏
[3/6, 1:33 PM] Amaravadi (అరాశ): ఒకటా రెండా మూడా
చకచక పద్యాలనారు శతకములంచున్ ప్రకటనము చేసె వీరా
మకరందము జాలువారు మధురత నొప్పన్
                                   అరాశ
8.3.2016

సాయి కృపలేక పద్యాలు రాయలేము
పూర్వ పుణ్యాన సాయికృప పొందగలము
సాయి మహిమలు కీర్తన సలుపు వీర
తప్పు పలుకడు పలికినా తప్పుకాదు
                 అరాశ

9.

వీరాసర్ మీ కోసం......

సీ**
పేరులో నెగలదు వీరప దముజూడు,
         చిత్తలూ రినినమ్మె చింత దీర,
మాటలే మియులేవు మనసునే జేరగా,
        పద్య రచనజేయు పదిల ముగను,
స్నేహభా వముతోడ చేరివచ్చుయతడు,
       మలినమన్నదిలేని మనసు తనది.
గుడిపల్లి యూరికే గొప్పదౌ  పేరును
       కలమునే గదిలించి నిలిపె నిచట.

ఆ**
మిత్ర పదము తనది  మించెగా భువనాన,
సంత సముగ నుండు శాంతు డతడు     నవ్వు మోము వాడు నవ్వించె డీవాడు,
.వీర నున్న చాలు విరియు ముదము,

అంబటి భానుప్రకాశ్.
10.
3/6, 10:20 PM] C. V. Kumar. poet: ఏడు వందల పద్యమ్ములింత వడిగ
రచన చేసిన కవివీర! ప్రణతులియె
గణిత పద్యాలు వ్రాసెడి ఘనుడ వీవు
నిన్ను పొగడగ తరమె వీరన్న మాకు
- సీ వీ
6.3.2016
11
10.03.2016
అష్ట శతములివ్వి అలవి కాదితరుల
 * అనతి కాలమందు అందగించ *
తప్పు కాదు వీర మెప్పుకోళ్ళివ్వను*
 వేయి పదము లెపుడు వేడ్కయౌను? *
** నాగ మంజరి గుమ్మా. ***

12

అమరకుల---గుడిపల్లిలమైత్రి
--------------------------------------
గుణింతాలగుడిలోన గుణవంతడైన
గణిత సూత్రాల గుడిపల్లి పూజారి
క్షణభంగురపుజీవనంపైచింతనుమాని
క్షణంక్షణంవిద్యార్ధులభవితకొరకుతపించె

గుడిపల్లి సుగుణధనుడు ధాత్రిఁ
బడిబాటనెంచుకున్న ఒజ్జడు
బడిపిల్లలతో గణితప్రక్రియలను
బహుచక్కగచేయించగలఘనుడు

అమరకుల కవనమందు చక్కగ
అమరినావు అందరిమన్ననలు
అందుకునెయమరకులకవనకొలనులొ
అందంగవిరబూసెకలువగుడిపల్లి
నీకుజయము జయముచిరంజీవా! !


వడ్త్యనారాయణ ............✍
13
సయోధ్య ఒకోసారి సన్నిధానమే యౌ
సమ ఉజ్జీగ చేదోడై నిలబెట్టు ఘటనలై
సరికొత్త కోణాల ఆవిష్కరించు సైదోడు
సైరికుడై నిలుచు సద్భావనా దృక్పథము

జూదమంటి ఆయుధాలాట వేదమై నిల్చు
సంబోధనలేవి పోల్చవీల్లేని బంధమై నిల్చు
భవసాగరమేమో వైరుధ్యాల నీ జోడించూ
సరికొత్త లోకాల ఈక్వేషన్ ఐ ఇలా నిలుచు

ఏ రీతి కొలమానాలు ఆ గణితాన ఉండవులే
*ఓ చిరునవ్వు గుణింతమై దృశ్యానికి భాష్యమౌ*
మనమనుకున్న దేదైన మనది కాకనూ పోవచ్చు
మనకెందుకనుకుంటే చివర కవనీయ బంధమవొచ్చు

రవి బంధమై లోకాన ఈ రీతి విస్తరించవొచ్చు కదా
రచన కెంతటి శక్తి;రంజింప జేయు రాజిల్లనూ చేయు
*అన్నయన్న మాట అమ్మకట్టని వెన్నఒడి సద్దిమూట*
అన్ని బంధాల కన్న బలీయమైనదౌ భావనా బంధమే

సాహితీ క్షేత్రాన సహృదయతే చాటవచ్చు అంకురంగ
హితవరులై ఇతరుల మధ్యన సంధానమే చేయవచ్చు
అభీష్టమై సద్గోష్టియై మృష్టాన్నమై మురిసి మెరువవచ్చు
*చిత్తలూరు; శెట్ పల్లి కలాన్*కలగలిసి వెలుగవచ్చు

                       ₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
                        *Vlr అమరకుల*
                         సకసంఖ్య:1128
                     *చిత్తలూరు-శెట్ పల్లి*
                               1510

14
కలము పట్టినంతకలవాణి మెచ్చును
గళమువిన్న'వాణి'కరముమోడ్చు
కలము గళము లందు ఘనుడు మా వీరన్న
లలితకృష్ణ మాట లాక్షణికము
......లలిత

15
25012019/   లలిత
🌻🌻🌻🌻🌻🌻
అగణితగణితవిజ్ఞానశోభిత గురుచంద్రమా!!
బహుముఖ ప్రజ్ఞా విలసిత మేధో సంద్రమా !!
సురుచిరదరహాస సుప్రసన్న  వదనమా !!
చిత్తలూరి చిరయశోసదనమా !!
సాహితీ జగత్తునమేరు శిఖరమా !!
యువకవులమస్తిష్కానప్రేరణాంకురమా !!
స్వర సందేశాలవాణి వరమా !!
విశ్లేషణాద్భుతగంభీరగళమా!!
ఆప్యాయతాక్షరాలనలదుకున్న అక్షరార్ణవమా  !!
సమున్నత భావ మౌక్తికా విరాజిత సువర్ణమా !!
ఆత్మీయతానుబంధాలే వన్నెలైన  పతాకమా !!
నిరాడంబరత ,నిస్వార్థత కు ప్రతీకమా !!
భావుకత కు భాష్యం చెప్పే వైనమా !!
పఠితులహృదయాధినేతవైన కవనమా !!
ప్రతి మదిని ప్రోత్సాహించే సౌశీల్యమా !!
రమణతత్వమే రమణీయ సత్యమన్న సౌజన్యమా !!
జన్మదిన శుభాకాంక్షలు అన్నయ్యా.....
16
🌻🌻🌻🌻🌻🌻
కొరివి కృష్ణ/250120

కడలిని కవితలతో కౌగిలించే కరుణాకరం..
కవనమును కాపాడే కారుణ్యతరంగం
గణిత గమకాలతో గమ్మత్తీకరించే గాండీవం
చెణుకులతో చిరునవ్వులు చిందించే చిత్రవిచిత్ర చిన్ముద్రం
వాతలేస్తున్నాడో వంతపాడుతున్నాడో అర్థమవ్వని వాగ్గేయకారత్వం
మణులు కాదు రమణీయముంటే చాలనే రమ్యరత్నాకరం
సద్దు చేయకుండానే సుద్దుల సద్దులు కట్టే సుధాకరం
అక్షరాల అమ్ములతో అంబారాన్ని ఆవాహన చేసే అక్షర ప్రవాహం..
ఆస్థికుడవా అంటే అక్షర హాలికుడనూ అంటావ్..
నాస్థికుడవా అంటే అస్థిత్వమున్నాక నా ఏంటీ నీ ఏంటీ అంటావ్..
ఇవి కాక....ఇంకే మున్నాయి మీ దగ్గర.!!
ఇంకేవో ఉండే ఉంటాయి లే లోలోన..!!
పుట్టిన రోజు శుభాకాంక్షలుసర్..
Veera Gudipally
17
విరుండవై మహ విరంబునా| చిత్త
లూరుండ వినుమయ  హితంబునా ||వి||

నిర్భయుడా నీ కవన లేపములు |ని|
దుర్భలులకునూ దురితములేగద |దు|

సబ్బండంగా వరములొసంగా |స|
స్వయంబూ నీ లింగడెవుండంగా ||స్వ||

పద్యోక్తీ ప్రతికరంబునా |  నిర్భ
యుండ నిడమయ నిజంబునా ||ప||

జోలికివోవూ జోలికిరావూ |జో|
జోజోరమణా జోజోమంటవ్ |జో|

యేడకిబోవూ యేడకిరావూ |యే|
యేడైనా శివ నీడనెవుంటవ్ |యే|

శతండవై బల శతకమునా |  నువ్
స్వయంభు సుతుడవ్ నిజంబునా ||శ||

   🌺 ధన్యవాదాలు...!  🌺

             🌺
             ✏@ కళాచందర్,
                         జర్నలిస్ట్.

🌺🌺🌺✅💐✅🌺🌺🌺
18
సుకవి మిత్రులు శ్రీ గుడిపల్లి వీరా రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆ భగవంతుఁడు మీకాయురారోగ్యైశ్వర్యసుఖసంతోషశాంతిశుభసంతృప్తులనొసంగుఁగాక యని ప్రార్థించుచు...

శ్రీ వాణీ గిరిజేశు లెల్లపుడు స♦చ్ఛ్రేయాన్వితాశీస్సులన్
సేవాతత్పరు "వీర" గారికిడి; సు♦శ్రీ వైభవౌన్నత్య స
ద్భావోపేత విశిష్టకావ్య రచనా ♦ వ్యాసంగ సంసిద్ధికై
చేవన్ బుద్ధిని నిచ్చుఁగాక యని య♦ర్చింతున్ సదా దైవమున్!

భవదీయ మిత్రుఁడు
గుండు మధుసూదన్
వరంగల్
19

పేర్మి సోమిరెడ్డి పిచ్చమ్మ లనియెడి
పుణ్య దoపతులకు పుట్టినారు
చిత్తలూరు శివుని చిత్తమ్ము మెచ్చగా
కన్న వారలకును ఖ్యాతి దెచ్చె

గణితావధానియితడున
గణితంబగు ప్రజ్ఞ గల్గె ఘనుడీతడుస
ద్గుణరాశులెన్నొ కూర్చిన
మణిహారముగాదెవీరమాన్యుoడితడున్

మనసు మాటలందుమంచి మా వీరన్న
సహనమందుతనకుసాటిలేరు
వాణియందుతనదువ్యాఖ్య లేకున్నచో
చిన్నబోవునదియునెన్ననిజము

పద్యకవనమరసిహృద్యమయిన వ్యాఖ్య
ఆత్మ తత్వ బోధ నదియు జేర్చి
విషయ మద్భుతముగవీనులవిందుగా
వీరగారుదెల్పువిజ్ఞుడతడు

కలము బట్టినంతకలవాణిమెచ్చును
గళము విన్న 'వాణి'కరము మోడ్చు
కలముగళములందుఘనుడు మా వీరన్న
లలితకృష్ణమాటలాక్షణికము
20

*అంతర్జాలం వేదికగా*
*కవన వనంలో వెన్నెలలు* *విరబూయిస్తున్న*
*పౌర్ణమి పురస్కారం*


ప్రపంచమంతా ప్రకంపనలు సృష్టిస్తున్న కరోనాను కట్టడి చేయడం కోసం ప్రభుత్వం స్వీయ నిర్బంధం  ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే.
అంతర్జాలం వేదికగా వాట్సాప్ లో....
స్వీయ నిర్బంధసమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ  సాహితీసేవచేస్తున్నసమూహాలు ఎన్నో...

 *వినూత్న దృక్కోణంలో కవన వనంలో వెన్నెలలు* *విరబూయిస్తున్న*
*పౌర్ణమి పురస్కారం*
మరి... ఆ వివరాలలోకి.....వెళ్తే
......
విశిష్ట సాహితీ సేవా తత్పరతతో   పౌర్ణమి పురస్కారాలపేరిట ఆన్లైన్లో ప్రశంసా పత్రాలు, నగదుబహుమతులు పేటీఎంద్వారా అందజేస్తూ
 సరికొత్త ప్రస్థానానికి తెరతీసి వాట్సాప్ సాహితీ లోకంలో ప్రభంజనం సృష్టిస్తున్నారు బహుముఖప్రజ్ఞాశాలి, గణితావధాని శ్రీ
 గుడిపల్లి వీరా రెడ్డి గారు.


     నల్లగొండ జిల్లా చిత్తలూరు గ్రామానికి చెందిన సంస్కారసుగుణ శీలురు సహృదయు లైన శ్రీ సోమిరెడ్డి, పిచ్చమ్మగారల గారాలతనయుడు గుడిపల్లి వీరారెడ్డి గారు.
వృత్తి గణితఅధ్యాపకులు, ప్రవృత్తి రచనా వ్యాసంగంతో పాటుసాహితీ సేవాతత్పరత.

 సాహితీసేవాభిలాషచే
సమూహనిర్వాహకులుగా
ప్రోత్సహిత భాషణా భూషణులుగా ప్రసిద్ధి కెక్కారు.
   విభిన్న పంథాలో సాగే వీరి హృదిలో అంకురించిన సత్సంకల్పం
గాంధేయవాదానికి సంబంధించిన రచనలసంకలనమే
కవితాగానం.
తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖకవులు డాక్టర్. పోరెడ్డి రంగయ్య గారు, అవధాని  శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు, దండమూడి శ్రీ చరణ్ గారు,డాక్టర్. రామకకృష్ణ మూర్తి గారు  కోరాడ.గారు, వాకిటి రాంరెడ్డి గారు, సివి శ్రీ గారు., కవయిత్రులు డాక్టర్. బల్లూరి ఉమా దేవి గారు, విజయదుర్గ గారు,
డాక్టర్ దేవులపల్లి పద్మజ గారు, గంజాం భ్రమరాంబ గారు మరెందరో నిత్యం ఈ సమూహంలో సాహితీ పరిమళాలను వెదజల్లు తున్నారు.
ప్రతీరోజు అంశాలకు కవితలతో కవులను చైతన్యవంతులను చేస్తుందీ సమూహం.


 గాంధేయవాదానికి సంబంధించిన అంశాలపై కవులకలాలకు పదును పెట్టేలా చైత్రమాసపౌర్ణమి తో తమ జైత్రయాత్రను ప్రారంభించారు.
పౌర్ణమి రోజున గాంధీ మార్గం అన్న అంశం తో పోటీ నిర్వహించగా
తెలుగు రాష్ట్రాలకవులు కవయిత్రులు  ఈపోటీలో పాల్గొన్నారు.
సమర్థవంతమైన న్యాయనిర్ణేత చే
వారిలో పదిమందిని(సుజాత గౌడ్ గారు, అంబటి భానుప్రకాష్ గారు, నిమ్మ రాంరెడ్డి గారు, తగిరంచనరసింహారెడ్డి గారు, వకుళ వాసు గారు, గుండ్ల రాజు గారు సంధ్యా శర్మ గారు, బాల సరస్వతి గారు, అరవిందరాయుడు గారు, సాగర్లసత్తయ్య గారు ) ఎంపిక చేసి వారికి ఆన్లైన్లో ప్రశంసా పత్రాలు పేటియం ద్వారా నగదు బహుమతి ని అందజేశారు.
ప్రతీపౌర్ణమి కి పోటీలు నిర్వహించడం.ప్రశంసా
పత్రాలు,  బహుమతుల పంపిణీ
నిజంగా ఇది అత్యంత సాహసం తో పాటు అనేక శ్రమతో కూడుకున్న పని
అంతేకాదు పోటీలో  పాల్గొన్న ప్రతీ ఒక్కరి కవితను స్వయంగా తామే బ్లాగ్ లో భద్రపరచడం వారి నిబద్దతకు చిత్తశుద్ధి కి సంయమనానికి నిదర్శనం.

పోటీలో పాల్గొన్న ప్రతీ ఒక్కరికి విశ్లేషణాత్మకమైన
సమీక్షలచే మరింత ఉత్సాహంగా పాల్గొనేలా క్రీడాస్ఫూర్తి తో సాగే వాతావరణం నెలకొల్పడం వీరి కార్యదక్షతకు ప్రతీక.


గణితావధానిగా, టీచర్స్ ఎక్సలెన్స్ అవార్డు,  నేషన్ బిల్డర్  అవార్డు,  స్ఫూర్తిశ్రీ పురస్కారం తెలుగు కవితా వైభవం వారిచే ఎన్నో పురస్కారాలు పొందిన వీరి  కలం పేరు వీరా గుడిపల్లి

వీరా గుడిపల్లి కలం పేరుతో వెలువడిన వీరి
రచనలలో కొన్ని
 గణిత గమనం, వేదగణితం వంద పరిష్కారాలు, గణితావధానం,శంభో శతకం, వీరాస్... గణిత శతకం, రమణ స్తుతి, ఏకవాక్య కవితలు మొదలగు 13 పుస్తకాలను రచించారు.. అంతే కాకుండా 152 గణిత వ్యాసాలు, కవితలు వివిధ పత్రికల్లో ప్రచురించబడినవి.


   వినూత్న ఒరవడి కి శ్రీకారం చుట్టి కార్యాచరణ ప్రణాళిక రచించడమే తరువాయి కార్యరూపందాల్చడానికి శతథా సహస్రథా  చేస్తున్న
వీరి కృషిఅభినందనీయం

చెరగని చిరునవ్వు చిరునామాగా ఏ కాస్త ప్రతిభ ఉన్నా ఆప్యాయతాక్షరాలతో
విశ్లేషణాద్భుతస్వర పదస్పందనలతో వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ  వారిచే అద్భుతాల్ని సృష్టింపజేయడం  వీరికి వెన్నతో పెట్టినవిద్య.సృజన కు పట్టం కడుతూ యువత ను ప్రేరేపిస్తూ
వందలాది మంది కవులుగా  ఎదగడం వెనక వీరి  ప్రోత్సాహం  ఉంటుంది అనడం లో  అతిశయోక్తి లేదు.
సహృదయులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే నిరాడంబరులు వీరు
మరెన్నో కీర్తి శిఖరాలు అధిరోహించాలని
ఆశిస్తూ....
21

వీరన్న రెక్క

వర్డ్స్ అంటారు
వాక్యాలకొద్దీ రాస్తారు
పుస్తకమంటే
గ్రంథాలయమౌతుందేమో

వీరన్న కలం
అన్ లిమిటెడ్ పొయిట్రీ
.... Aravinda Rayudu
22
Words   నానీ

వీరాజీ గణ'న
చాలా కచ్చితం!
పద్యం రాసినా
లెక్క చెప్పినా!

....సీవీశ్రీ

🌷🌷🌷🌷🌷🌷🌷
25.01.2018

సహస్రవాణి వరపుత్రులు
స్వరసందేశాల మాంత్రికులు *వీరా*
 *అభినవకళావాచస్పతి*
గoభీరస్వర మధురిమకిది  జన్మదిన శుభవేళ 
స్వర సందేశాలా అవి......
 డెందములను కoదళిoపజేసే   *స్పందనలు* 
వెన్ను తట్టి ముందుకు నడిపించే *ప్రోత్సాహకాలు* 
ఉన్నత శిఖరాల నధిరోహిoచడానికి  పేర్చిన *సోపానశ్రేణులు* 
విషయమేదైనా వివరణాత్మకవిశ్లేషణతో నున్న *విజ్ఞానభాoడాగారాలు*
బంధుత్వాన్నికలుపుకునే *ఆత్మీయపలకరిoపులు* 

*సంగీతసాహిత్య*ప్రక్రియలన్నీ*
   ఆ స్వర సందేశాల కై వేచి చూస్తాయి 
 వాణి వీనులు ఆ స్వర సందేశాల కలవడ్డాయి
*పుష్పాలమకరందానికి అలవడిన తేనెటీగలవలె*

సమూహం లో లేకున్నా *వీరన్నా* మా ఊహల్లో మీరేనన్నా
మీకు *జన్మ దిన శుభాకాంక్షలు అన్నయ్యా!!!!*

🌷🌷🌷🌷🌷🌷🌷
*****లలితాకృష్ణ

🌻🌻🌻🌻🌻🌻
25.01.2020

స్పందనల సాహితీ లోకంలో ఆబాలగోపాలాన్ని  అలరించే అక్షరాలగారడీ.........వీరా

చమత్కారచంద్రికలను కురిపిస్తూ...
చెణుకులతో చమక్కు మనిపించే
కవనగరిమ.......... వీరా

విపరీతార్థమో ..సమాజంలోని
వింత పోకడలను విప్పి చెప్పడమో
అర్థం అయ్యి కానట్లుగా దోబూచులాడే
పదాల..వాక్యాల ఆవిష్కరణ..వీరా

హృద్యపద్య వచన కవితలను
అలవోకగా సంధించే సవ్యసాచి....వీరా
వినూత్నప్రక్రియల
స్వర గంభీరపదాలసమాహారం.....వీరా

భావుకతకు భాష్యంచెప్పే సజీవ దృశ్యాలకు సాక్ష్యమైన అద్భుతకవనం .... వీరా

వేదగణితంలోమేథపెంచే
అగణితగణిత విజ్ఞానగని....... వీరా

రచనలకు రమ్యత్వాన్ని ఆపాదించే రమణుల శిష్యులు............ వీరా

ప్రోత్సాహక భాషణముల
 విభూషితుడు......వీరా

ఆత్మీయానుబంధాల నలదుకున్న ఆప్యాయతామూర్తి...
వీరా అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు.

********లలితాకృష్ణ
  🌻🌻🌻🌻🌻🌻

24

శ్రీ ఐతగోని వెంకటేశ్వర్లు గారు
3/8/2020
రాఖీ పౌర్ణమి

సాహిత్యముచిన్నాపెద్ద, మిత్రుడు బంధువు పరిచయస్థుడు...కులమతప్రాంతీయబేధాలు లేని....ఒక సమరసమనస్స్థితి.....

ఇది కలిగిన వ్యక్తి కవిగా సాహితీవేత్తగా అర్హుడు. అలాంటి అర్హత కల్గిన వీరా గారికి అభినందనలతో

కం: ఆరసి కృష్ణుడు బ్రోచుత
సౌరభనిష్యంద పూర్ణ సాహిత్య సుసం
స్కారమనస్సుమముగలుగు
వీరా! గుడిపల్లి మిమ్ము  విశ్రుత లీలన్.....

మరియు చక్కటి సమన్వయము చేస్తున్న సోదరి లలితకు....అభినందనలు

కం: లలిత వచోవిలసితయయి
లలితా మహిత కళయైన లలితకు శుభముల్
లలితా పరమేశ్వరి యిడ
లలిత మదిని దలచుచుందు రసపద్యమునన్
25

యేరువ ఇందిర రెడ్డి
అంశం: కవి లోక మణిహారం
*******************

ఓ గొప్ప వ్యక్తిత్వానికి కి
ఆకృతి ఇస్తే వీరా అన్న..!!

మంచి తననానికి పేరు
పెట్డితే అది వీరా అన్న నే..!!

దాతృత్వ నిలువెత్తు
నిదర్శనం వీరా అన్న..!!

గణితం లో ప్రయోగాలు చెయ్యాలి
అన్న  కు మాత్రమే సాధ్యం .!!

అజాత శత్రువు ఎవరన్నా కవులలో.ఉన్నారు అంటే వీరా అన్న. !!

అన్నగా ఎందరో చెల్లెళ్ల
అభిమానం స్వంతం
చేసుకున్న అన్న కాలంలో మనం ఉన్నాం అంటే
నే మన అదృష్టం కాక మరేమిటి..!!
మాట తీరు మహా అద్బుతం..!!
చిత్తలూరి లోని
మాణిక్యం. !!
అమ్మను అమితంగా
ప్రేమించే గొప్ప తనం..!;
ఏమి కానీ వారికి కూడా
నేను ఉన్నాననే గొప్ప మనుసు..!!
పసి నవ్వు లాంటి చిరునవ్వుతో
నడిచే గ్రంధాలయం..!!

ఎందరో విద్యార్థులకు
మార్గ నిర్దేశనం చేసిన
అపర ద్రోణాచార్యులు. !!

 ఆధునిక రమణ మహర్షులు..

ఎవరి మనుసు .నొప్పించడం
తెలియదు
మెప్పించడమే తెలుసు..!!

వృత్తి ప్రవృత్తి సేవలో అన్నిటా ముందుండే వీరా అన్నయ్యా గురించి రాయాలి అంటే
నా మేధస్సు సరిపోదేమో..!!
ఒక మాహాగ్రందమే
లిఖించ వచ్చు..
చెల్లిగా కొన్ని అక్షరాలు
పేర్చడం తప్ప ఏమివ్వలేని నిరుపేద
చెల్లిని..

- యేరు వ ఇందిర రెడ్డి.హైదరాబాద్
*******************
26.
*వీరాస్ కవి సమయం*
 ★★★★★★★★★★★★

కవి పేరు : ఇంద్రవత్ రాహుల్ 
జిల్లా : నిజామాబాద్ 
చరవాణి : 9848054079
కవిత సంఖ్య : 100
 శీర్షిక :  తెలుగు వీరుడు వీర గుడిపల్లి

  *తెలుగు వీరుడు వీర గుడిపల్లి*
నాలో అక్షర నాటు మడిని 
నాటిన తెలుగు వీరుడు 
 అక్షరాలతో చెలిమి చేస్తూ
 అక్షర సమూహాలను
 అందమైన పదకోశాలుగా పేర్చుతూ 
ఎక్కడో ఉన్నా చిన్ని బాల కవిని 
ప్రశంస చేసి నీ వెంట
నేను ఉన్నాను అని  
ధైర్యం నింపిన
 త్రిభాషా కోవిదుడు
 వీర పేరుతో వీరాస్ కవి 
సమయం వేదిక తయారు చేసి 
ఎందరో  హృదయాలలో
 చెరగని ముద్ర వేసిన
 తెలుగు మహా పండితుడు
 అక్షర ఖ్యాతిని పెంచుతూ
 చక్కటి సందేశాన్ని అందిస్తూ
ఈరోజు 100 కవనలు నాతో 
పూర్తి చేపిచిన మహా కవి 
శ్రీ శ్రీ శ్రీ వీర గుడిపల్లి గారు 
అందుకే నా తెలుగు సాహిత్య
జీవితం ఆ మహా కవికి అంకితం 
నా పాదాభివందనాలు... 
        
*హామీ పత్రం*: ఈ కవిత నేను స్వయంగా రాసాను... అని హామీ ఇస్తున్నాను.
27

నిత్యసాహితీతపములోనిలిచిమీరు
యెందరెందరోకవులకానందమవగ
బృందమునజేర్చపద్యాలువేడుకౌను
సంబరమ్ములు తాకునాయంబరమును

వీరారెడ్డికియిష్టము
సారస్వతమూర్తులిలను సద్భాషణలున్
భారముదగ్గించు రమణుని
సారముతోజనులహృదిని సత్పండితుడై

మాటలు పలకని వారికి
బాటలుజూపించునతడు బంధముతో యా
మాటలతల్లినిగొలువగ
ధీటుగవెలుగొందుజేయ ధీరుడువీరా

కవులకునిలయముతనమది
భవితనుగల్పించుతాను బాధ్యతనొందున్
నవయువతకుజూపుపథము
కవివీరారెడ్డిభువిని ఘనతలనొందున్
28

వీరన్నాకైతలు మం
జీరల దారలు కురిసియు జీవించె మదిన్!
ధీరా! వందనమంటిని
యీరోజున రమణవిభుడు యిందున వెల్గెన్!
🌷🥙🙏బాగుబాగు
5/9/2020 

No comments:

Post a Comment