Tuesday, January 31, 2023

వీరానుగమనం 5 .ఆ 18 నెలలు

వీరానుగమనం 5
ఆ పద్దెనిమిది నెలలు
****************************************
నమ్మండి నమ్మకపోండి
ఉద్యోగం రావాలనే ఆశ ఉండేది కానీ
ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నది గానీ చదివింది గానీ లేదు
 వెంకట నారాయణ సార్ ను అందరూ రవి సార్ అంటారు , ఆయన,నేను  సూర్యాపేట లో సరదాకి ట్యూషన్ చెబుతూ అలా హ్యాపీగా కాలం గడుపుతూ
డీయస్సీ పడగానే రాసాం.
జాబ్ వచ్చేసింది అంతే ఇది నిజం
అంతే సరదాగా నేను రాగిబావి ప్రాథమిక పాఠశాల, రవి సార్ బొడ్డు గూడెం ప్రాథమిక పాఠశాల లో జాయిన్ అయ్యాం.
మాతోపాటు ముషం శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాల ముశిపట్ల ఉమేందర్  ప్రాథమిక పాఠశాల ఆరెగూడెం ,నలుగురం మోత్కూరు లో పోతాయిగడ్డ అనే ప్రాంతంలో రెండు గదుల పోర్షన్ కిరాయికి తీసుకుని ఉండే వాళ్ళం. కిరాయి 300 రూపాయలనుకుంటా తలా 75 రూపాయలు ఇచ్చేవాళ్ళం.అదనపు బిల్లు అంటే కరెంట్ బిల్లు,నల్లా బిల్లు లాంటివేం ఉండేవి కాదు .
అందరి లో నేను ఒక్కడినే పెళ్లి ఐన వాడిని.ఐనా మా ఆవిడ తన డిగ్రీ పూర్తి చేయడం కోసం మహబూబా బాద్ లో వాళ్ళ నాన్న గారి దగ్గర ఉండడంతో నేనూ ఫోర్స్ డ్ బాచిలర్ గా వీరందరితో కలిసి ఉండడం జరిగింది.
ప్రతీరోజూ ఉదయం జాగింగ్ అనంతరం వంట చేసుకుని లంచ్ బాక్స్ సర్దుకుని నలుగురం ఒకేసారి తలా ఒక సైకిల్ పై పాఠశాల కు వెళ్లి డ్యూటీ అనంతరం నాలుగున్నర ఐదు ప్రాంతంలో మోత్కూరు చేరుకునే వాళ్ళం.
సాయంత్రం సరదాగా బస్టాండ్ వరకు వెళ్లి
లడ్డు శీను పండ్ల దుకాణం దగ్గర తలా ఒక అరటి పండు తిని అదో ఇదో సుత్తేసి అలా అలా తిరిగి  టీ తాగి ,వెనక్కి వచ్చేసి వంట చేసుకుని తిని బజ్జోవడం.ఇదీ రొటీన్ దినచర్య మా నలుగురిదీనూ...
కానీ ఈ అందరిలో ఉమేందర్ మాత్రం కసిగా చదువుతూ సబిన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా సెలెక్ట్ అయ్యాడు.ప్రస్తుతం డీఎస్పీ గా పనిచేస్తున్నారు.
మిగతా వారమంతా స్కూలసిస్టెంట్ గా ప్రమోట్ అయ్యాక గెజిటెడ్ హెడ్మాస్టర్ ప్రమోషన్ కోసం క్యూలో ఉన్నాం.
ఐతే స్పెషల్ టీచర్ గా పనిచేసిన ఆ పద్దెనిమిది నెలల కాలం ఏం జరిగింది అనేదే ఇక్కడ నేను ప్రస్తావించదలచుకొన్న అంశం...... సశేషం 

No comments:

Post a Comment