వీరాస్ పోయెట్రీ 3


ఇది వీరా గుడిపల్లి కవిత
1.హనుమద్దాసు
2.ఎవరి తోను
3.అమ్మపల్లి వెల్లాలి
4.పలకదు
5.సబర్మతీ ఆశ్రమం
6.గూగూల్ గురువు
7.సమాధానం
8.సన్మానిస్తా
9.సన్మానం
10.తీరని ఋణం
11.ప్రేమ
12.మనుషులూ అంతే
13.గోరింట
14.వ్యసనం
15.పరిష్కారం
16.విపరీత ధోరణులు
17.పర్యావరణ పరిరక్షణ
18.అంతేమరి
విలువల కు విఘాతం కలిగించే పరిస్థితులు
19.వీర సైనిక వందనం
20.కరోన వైరస్
21.అతను మేక రవీంద్ర
22.రైతు మరీ
23.

*****************-
(మన్నెంకొండ వెంకయ్య
కృష్ణాంబ దంపతులకు ఎనిమిదవ సంతానంగా  హనుమద్దాసు జన్మించాడు)
శీర్షిక ః హనుమద్దాసు
**************
అక్కడ అన్నమయ్య
అక్కడెక్కడో రామదాసు
ఇక్కడ హనుమద్దాసు
మన్నెంకొండ హనుమద్దాసు
 పాలమూరు తిరుపతి
వాగ్గేయకారుడు
మన్యంకొండ
లక్ష్మీనరసింహస్వామి ప్రియ భక్తుడు
దేవతల భూమి (తమిళ ప్రాంతంలో)
శ్రీరంగం
అలహరి గ్రామం
పూర్వీకుల పుట్టిల్లు
అలహరి వంశనామమై భాసిల్లింది
కేశవయ్య
కలలోకొచ్చిన ఎంకన్న
మన్నెంకొండకు వెళ్ళమంటే కదా
లక్ష్మీనరసింహస్వామిని సేవిస్తూ స్థిరపడిపోయాడు
ఎవరికి కావలసిన వాల్లను
వాల్లే పిలిపించు కుంటారు
కేశవయ్య ముని మనవడు
హనుమద్దాసు
చదువు ఒంటబట్టకుంటేనేం
వేదాంతి వెంకయ్య
అలహరి వంశం వారసత్వం
మన్నెంకొండ లక్ష్మీనరసింహస్వామి
ఆశీస్సులు
అర్చకత్వం
ధర్మకర్తృత్వం ప్రసాదిస్తే
వారసత్వపు వాసనలొదలక సాగడం
వాగ్గేయకారుడై వెలిగి పోవడం
కోటకదిర
అలహరి  ప్రత్యేక పూజలు
ఆ తరువాతే
మన్యంకొండ ఉత్సవాలు
భక్తి... శక్తి.. ముక్తి
హనుమద్దాసు... మార్గం
మన్యంకొండ ... చెప్పిన సత్యం
మనగురించి మాట్లాడే వారు ఉండాలని
స్వామి కీ తెలుసన్నమాట
లక్ష్మాంబ తత్వదర్శనం
నిత్య రామనామ జపం
హనుమద్దాసు మన్యం కొండ
విడదీయలేని పదాలైపోయాయి
అవసరమెవరిదైనా...
అసలు సత్యమదే మరి
....... వీరా గుడిపల్లి
ఇది వీరా గుడిపల్లి కవిత
2
31/05/2020
ఎవరితోను
**********
ఏమాశించి చేశాడు
సమాధానం లేదు
ఎవరూ తెలీదు
వెతుక్కన్నాడు
దండలేశాడు
షాల్స్ కప్పాడు
తెలుగు అక్షరాలు
చల్లినా, చదివి వినిపించినా
ఎందుకు చేశాడు
సమాధానం లేదు
పాదుల్ని పీకేయాలని చూశినా
పందిళ్ళు కూల్చాలని చూసినా
పెదవి విప్పిందే లేదు
ఓడిపోయింది లేదు
ఎందుకిలా
తనకూ తెలీదంటారు
ఒంటరి ప్రయాణమే
ఆరువేల సైన్యమున్నా
ఎడారి జాడలనే వెతుక్కుంటాడు
ఒయాసిస్సులను తవ్వడానికి
కన్నీటి చారలనే కనిపెడుతూ వెళతాడు
తుడిపేయడానికి.
అక్షరాలు ఎక్కడ కనపడతాయోననీ
అక్షర ప్రేమికులెక్కడున్నారని
నిరంతరం
కొత్త కలాల కోసం
కలాల జాడకోసం సాగే అన్వేషణలో
అడుగులేస్తున్న అక్షర ప్రేమికుడు
అక్షరాలను మోస్తున్న వారికోసం
వెల్తున్న అన్వేషి
ఎవరతనంటే..... మేక రవీంద్రే కదా
........ వీరా గుడిపల్లి

3
ఇది వీరా గుడిపల్లి కవిత
అమ్మపల్లి
1/6/2020
********
*అమ్మపల్లి వెల్లాలి*
***
ఆయన లేనిదెక్కడ
అక్కడికే ఎందుకు వెల్లాలి
భద్రాద్రి
ఒంటిమిట్ట
అయోధ్య
అంతేనా...
ఊరూరుకో మందిరం
ఇంటింటికో దేవుని గది
అక్కడికే ఎందుకు వెల్లాలి
కోదండరామస్వామి ఆలయం
అమ్మపల్లి
అక్కడికే ఎందుకు వెల్లాలి ????
సర్వాంతర్యామి
పాద తాడనంతో పునీతమైన
స్థలం.... యెక్కడున్నా
కోదండ రామ స్వామి...
కంటిచూపుతో పునీతమైన ప్రాంత మేదైనా
కనీసం ఒక్కసారైనా.... వెల్లాల్సిందే......
వెల్లాల్సిందే....అమ్మపల్లి
..... వీరా గుడిపల్లి
ఇది వీరా గుడిపల్లి కవిత
4
10062020
*పలకదు*
******************
రాలిపడే ఆకు
రాపాడే కొమ్మ
రాయని వాక్యం
పలుకని మాట
హార్స్ పవర్ తో లెక్కించలేం
తులసీ దళం తో తూచలేం
కొంటెగా కొట్టేయలేం
మట్టిని చీల్చుకుని వచ్చే మొక్క కాదది
బొట్టు పెట్టి దైవం చేసి
బోనం పెట్టి ఆకలితీర్చామని
తృప్తి పడే మనసు కాదది
నిజాన్ని పసికట్టి
ధర్మం తెలిసి
మౌనంతో కప్పేయబడ్డ
హృదయమది
పలకదు
........ *వీరా గుడిపల్లి*

5
ఇది వీరా గుడిపల్లి కవిత
10/06/2020
సబర్మతీ ఆశ్రమం
******"*************
పుష్కర కాలం
పవిత్ర పాదాలు నడయాడిన నేల
ఉప్పు సత్యాగ్రహపు
ప్రణాళికలు ప్రాణం పోసుకున్న చోటు
దండి యాత్ర
మొదలైన ప్రాంతం
సబర్మతీ తీరంలో
జాతి పిత సేదదీరిన మట్టి ..
జాతిపిత నివసించిన ప్రాంతం
హృదయ కుంజ్....
జాతి హృదయ మతనే కదా
గోచీ కట్టి
అహింసా ఆయుధం ధరించి
భరతమాత దాస్య శృంఖలాలు తొలగించి బోసినవ్వులలదుకొన్న యోగి
చెప్పాలంటే...
ప్రజాస్వామ్య రాజర్షి
ఆశ్రమం
మీరాబెన్ మనసుపడిన నేల
కిసాన్ ఆశ్రమానికి
ఆలోచనలు మొలకెత్తిన చోటు
మహాత్ముడి మనసింకా తచ్చాడుతున్న నేల
సబర్మతీ ఆశ్రమం
....... వీరా గుడిపల్లి
6
ఇది వీరా గుడిపల్లి కవిత
10)06/2020
గూగుల్ గురువు
*****************
ఏకలవ్యుడు
భయపడాల్సిన పనిలేదు
బొటనవేలు కోరడీ గురువు
గాండీవి
ప్రియ శిష్యుడేంకాదు
ప్రియ శిష్యుడనే పదమే లేదు
అందరూ సమానమే
పక్షపాతం లేదు, పార్థుడైనా సరే
గీత బోధించడానికి
బావమరిదే కానవసరం లేదు
అడిగేదెవరైనా సరే
కాదనకుండా ఇవ్వడమే తన లక్ష్యం
మతం లేదు కులం లేదు
మాయా దర్పణం పనికేరాదు
గురువంటే
నిర్వచనం మారింది
కొడుకును బ్రతికించమనో
పగవాడిని పట్టితెమ్మనో
కోరే స్వార్ధపరుల రంగు బయటపడింది
గురువంటే
అడిగిందివ్వడం
బదులేదీ కోరక పోవడం
శిష్యుడినడ్డం పెట్టుకుని మీసం మెలేయడం
కాదు
పాత వాసనలనొదిలి
పరికిస్తే తెలుస్తోంది
గురువంటె
గూగుల్.......
కాదంటావా....
మహాత్ముడు పుట్టిన నేల
మర్చిపోకు నిజం చెప్పడం
7
......... వీరా గుడిపల్లి
ఇది వీరా గుడిపల్లి కవిత
13/06/2020
*సమాధానం*
***********************
పోతిదేవర శిష్యరికం
పోటెత్తిన సంద్రం లా మలిచింది
శివకవిగాశివాలెత్తేలా చేసింది
పాల్కురికి పాటవానికి
ప్రణతులర్పించేలా చేసింది
మంత్రాల దాష్టీకాన్ని
మంటగలిపే ఘంటారావం
పాల్కురికి రూపంలో
పొటమరించింది.
రగడ  ఛందోరీతులకు దారులేసి
సాహితీ కబ్జాల భారతం పట్టాడు
పురాణాల ఆంతర్యం తెలిసి
బసవ పురాణమై అవతరించాడు.
రుద్ర పశుపతి
ఉడుమూరి కన్నప్ప
మడివాలు మాచయ్య
మసిడి చౌడయ్య
కిన్నెర బ్రహ్మయ్య
యే కధ చూసినా యేమున్నది
పాల్కురికి సోమనాథుడు
పటాపంచలు చేసిన ఆధిపత్య భావజాలం.
విప్లవరీతులేవైనా
అక్షర స్వామ్యం తో సాధించిన వీరుడు
పాల్కురికి సోమన్న పాటవమంతే
సాహిత్యం యేంచేయగలదన్న వారికతనే సమాధానం.
...... *వీరా గుడిపల్లి*
8
ఇది వీరా గుడిపల్లి కవిత
17/06/2020
సన్మానిస్తా....
****************-
నాలుగు అక్షరాలు చల్లి
పది వాక్యాలు మెడలో వేసి
పైనో కవిత కప్పాలనుంది
పాటై జ్ఞాపకంగా నిలిచి
సాహిత్య పేజీగా సహవాసం చేసి
కావ్యమై కలకాలం నిలిచి పోవాలనుంది.
మంజుల,ఉపేందర్ ల ముద్దు బిడ్డ కు
ముద్దుగా ప్రణమిళ్ళాలనుంది.
కల్నల్ సంతోష్ బాబు ను
సన్మానించాలని ఉంది.
ముందే
భారతమ్మ కంఠహారమై పోయాక
అమరపురి ఆహ్వానం అందుకున్నాక
ఇంద్ర సభకా అవకాశం ఇచ్చేశాక
యేం చేయగలను
నాలుగక్షరాలు చల్లి
వాక్యాలు మెడలో వేసి
కవితై కౌగిలించుకుని
సాహిత్యమై తనను సన్మానిస్తా.
......... *వీరా గుడిపల్లి*
ఇది వీరా గుడిపల్లి కవిత
17/06/2020
9
అంశం ః సన్మానం
***********************
శీర్షిక ః ఎలా
సరిహద్దు వివాదం
సృష్టించిందెవరో గానీ
మక్మోహన్ గీసిన గీత దాటి
చొరబడాలని
చూసిందెవరోగానీ
సంతోష్ బాబు లిరవైమంది
బలైపోయిన వేళ
అమ్మ మాటలు విన్నాక
కడుపు కోత కన్నా
భరతమాత సేవే గొప్పదని చెప్తున్న
మంజులమ్మ మాటలు
నా దేశానికి భయం లేదని చెప్తున్నాయి
వీరమాతల , వీరపుత్రుల, వీరపత్నుల
రక్షణలో
భరతమాత భద్రం గా ఉందంటున్నాయి.
యే అక్షరాల మాలవేద్దాం
యే కవితల శాలువా..గప్పుదాం
సంతోష్ బాబు తల్లి
కాదు
భారతీయులందరికీ
అమ్మై ధైర్యం చెప్పిన
మంజులమ్మనెలా సన్మానించుకుందాం???
......... *వీరా గుడిపల్లి*
10
ఇది వీరా గుడిపల్లి రచన
19/06/2020
కవుల వేదిక కోసం
తీరని ఋణం
*****"************
పచ్చని జీవితాలు
పదికాలాలు విలసిల్లాలనీ
ప్రాణాలను ఫణముగ బెట్టిన
సైనికులారా వందనం "2"
మా రక్షణకై తెగించి నిలిచిన
అన్నలార అభివందనం "2"
అమ్మా నాన్నల ఆశలు కాదా
అందరిలాగే మీరు
వారసులూసుల
నానందించాలని
అనుకోరా మీరందరిలాగా.."పచ్చని"
మంచు కొండల నడుమా....
ఎడారి వడగాలులలో...
ఎవరూ లేని ప్రాంతం లో..
మాటున దాగిన శతృవు మీదికి
ధాటిగ దూకగ.. వ్యూహము రచించి
దూకే భారతసింహానికి వందనం ...."పచ్చని"
రక్షణ రేకై
లక్ష్మణ రేఖై
విలక్షణ రీతిలొ సేవలనిచ్చే
సైనికులారా వందనం
తీరని ఋణమై
మిగిలే వీరుల పాదాలకు వందనం
ఆ శ్వాసలకే ఊపిరులూదిన
అమ్మలందరికి వందనం...""పచ్చని""
అమరుల త్యాగం ఆస్వాదించే
ఆ గొప్ప మనసులకు వందనం..."పచ్చని"
.... వీరా గుడిపల్లి
11
ఇది వీరా గుడిపల్లి కవిత
30/06/2020
ప్రేమ
**************
నీవు, నేను
విభిన్నాలనుకున్నంత కాలం
అలజడి లేదు ఆందోళన లేదు
శాంత మహా సముద్రం లో నాఆనవాళ్ళు
ఆకలి నిద్ర అమ్మా నాన్న
ఆట,పాట, ఆనందం అదే జీవితం
బంధాలు, అనుబంధాలు అల్లు కున్న లోకంలో
అందరికీ నేనే ప్రాణం.
నా అడుగుల జాడలు వారి కళ్ళల్లో
వెలుగు రేఖలను సంధిస్తుంటే
ప్రపంచ మంతా నా కోసం జీవిస్తుండేది.
ప్రపంచ మంతా నన్నే పట్టించుకునేది
వేరేమి లేనట్లు
బడి గుడి ఆఖరికి నారుమడి,
ఎక్కడ చూసినా నా చుట్టే అంతా.
నేను గుర్తించని స్వర్గం లో నా విహారం.
మనం అభిన్నమని తెలిశాక
అన్నీ మాయమై
అంతా పరీక్షాకాలమై
క్షణాల్లో రంగులు మార్చుకున్న ప్రపంచం
సంధికాలం
అలిగిన తల్లి వేరు
అల్లల్లాడిన చిగురుటాకు
రాలిపోయినవేళ రామగాధల వర్షం
విభిన్నాలభిన్నాలని తెలియడమే ప్రేమ
అభిన్నాలన్నీ విభిన్నాలవవని
తెలియడమే విశ్వప్రేమ
పునర్జన్మల పూసల పేరురాలిపోయి
ఆటంకాల గోలెరుగని ప్రవాహం లో
బిందువైపోవడమే కదా ప్రేమంటే
......... వీరా గుడిపల్లి
12
ఇది వీరా గుడిపల్లి కవిత
01072020
మనుషులూ అంతే
****************
ఒకటీ,ఒకటీ, ఒకటి
ఓకట్లన్నీ సమానమే
యూనిట్లను వెంటేసుకోనంత కాలం
మనుషులూ అంతే
మనసులు ముసుగేసుకోనంత కాలం
వాడినకొద్దీ
అడుగులు మాడి చిల్లులు పడే గిన్నెల్లా
ఎదిగిన కొద్దీ మసిబారే మనసులు
ఆరడుగుల వేదాంతం చెబుతూ
ఆరువేల ఎకరాల కబ్జాకై చూస్తున్నట్లు
నైరూప్యాలే
యూనిట్లను ధరించి విలువలు మార్చుకుంటుంటే
సృష్టి ధర్మం అనుకోవాలా
ఓకట్లన్నీ సమానం కానట్లు
మసిబారిన మనసులు జతకలిసిన
మనుషులూ అంతే
మానవత్వం పారిపోయాక
...... *వీరా గుడిపల్లి*
13
ఇది వీరా గుడిపల్లి కవిత
01072020
గోరింట
************
సోరుప్పు నేల
ఎన్ని సార్లు నాటినా అంటుకోలే
అంటుగొమ్మలు దెచ్చి
నాటిందెన్నిసార్లంటే యేం చెప్పాను
ఆషాఢమాసం వచ్చిందంటే చాలు
ఎవరింటికోవెళ్ళి
బతిమిలాడి తెచ్చుకోవడం
నా ఇంట్లోనే చెట్టు ఉండాలనే కోరిక
యెంతకీ తీరదే
చిట్టి చేతులకు గోరింటాకు పెట్టుకోవాలంటే
నా  చెట్టు ఆకే  కావాలన్న అత్యాశ
పట్టు వదలని విక్రమార్కుని
కధలెన్ని చదివానో
పదేళ్ళకు ఫలించిన ప్రయత్నం
ఊరొదిలే సమయానికి
నెరవేరిన కల
మొక్క నాటుకుంది మారాకు వేసింది
చెట్టై ఎదిగింది
కాలం తో పాటు మార్పు
ఇప్పుడిద్దరం ఊళ్ళో లేం....
ఆ చెట్టును చూసినప్పుడల్లా
నా చెల్లికి నేను
నాకు నా చెల్లి కనిపిస్తుంది.
అమ్మా నాన్నల కు మేమిద్దరం కనిపిస్తాం.
ఇప్పుడు తనింట్లో ఓ గోరింటగా నేను
నా ఇంట్లో ఓ గోరింట గా తను
చిత్తలూరులో ఓ గోరింట గా మేమిద్దరం
ఇప్పుడు ఎక్కడ నాటినా 
అలా అంటుకుంటుంది గోరింట
గోరింటాకంటే
చెల్లి వేళ్ళనంటుకునుండే  అన్నప్రేమ
....... *వీరా గుడిపల్లి.
14
ఇది వీరా గుడిపల్లి కవిత
01/07/2020
వ్యసనం
*******************
సమతులాహారం సరైన మాటే
పాసంగపు తరాజెప్పుడూ తప్పుడు పనిముట్టే
సమతుల్యత లోపించడం
మద్యపానం, ధూమపానం మరేదైనా
వ్యసనమంటే వంకర బుద్దే
అంతఃశ్చేతన పక్కనబెట్టి
దేహానికి ద్రోహం చేసుకోవడం
వలువలు మార్చుకున్నంత సులభంగా
దేహాన్ని మార్చుకోలేమని తెలియక పోవడం.
మనసు బలహీనమైనపుడు
మనిషి తనం ....పతపమవడం
కలలు కల్లలై
సామాజిక ద్రోహిగా మిగలడం
మానసిక బలహీనతతో
మట్టిలో కలువనున్న  దేహం
వంటరి దారులకోసం మంటలమేడలు నిర్మించుకుని తగలబడడం.
మెరుపులు చూసి దీపాలార్పుకోవడం
సమతుల్యత సాధించిన జీవితాలే
వ్యసనాలను పారదోలి...
వ్యక్తిగా నిలబెడతాయని తెలియక పోవడం.
....... *వీరా గుడిపల్లి*
15
ఇది వీరా గుడిపల్లి కవిత
02/07/2020
అంశం ః ధరలు
శీర్షిక ః పరిష్కారం
********************
వస్తుమార్పిడి స్థానంలో
మొదలైన వసూళ్ల పర్వం
ఇంతింతై వటుడింతై అన్నట్లు
ఎదగడమే తప్ప దిగిరావడం తెలియనివి
మొదలంటా నరికినా మళ్ళీ చిగురేసి పెరగడం మాత్రమే తెలిసింది
లాక్ డౌన్ మూతేసినా
లాకులెత్తిన ప్రవాహం లా పరుగెత్తడమే తెలిసినవి
పేదోనికి అందకుండా ఎత్తులకు ఎగిరిపోతూనే ఉండేవి
కనిపించకుండా
పెరిగేవివే ఎగిరేవివే
ధరపై ధరలని పిలవబడుతూ.....
పెట్టుబడి దారుల చేతుల్లో పెరుగుతూ
రాజకీయపు పరిమళం చల్లుకుని
ఇంధనమై మండుతూ
పేదోడిని చితిపేర్చకుండా తగలబెట్టేవి
శరాఘాతం సిగ్గుపడేలా
రక్తంచిందని యుద్ధభూమిలో కనిపించని ఆయుధ పర్వం ధరాఘాతం.
మనిషిని మనిషి మంచితనం తో కూల్చే ప్రణాళికలు
నవమోసాలు మోయకుండా కనిపెంచిన బిడ్డ లు ..,
ధరకట్టడమనేది ... ధరణీ పుత్రుల చేతులు దాటకుండా చేయడమే పరిష్కారం.
..... వీరా గుడిపల్లి
16
ఇది వీరా గుడిపల్లి కవిత
03072020
విపరీత ధోరణులు
**********************
నీ ఇష్టం
సహజ ధోరణులు
వదలక పోవడం.
భిన్పత్వపు మోజులో మునిగి పోవడం
కాని పనులే కంటికింపనిపించడం
ఆహారనియమాలైనా
వస్త్రధారణైనా
సంప్రదాయమైనా
మాటతీరు
భాషాసౌగంధ్యం
వక్రీకరించి వంపులు తిరగడం
ఎదురు తిరగడం గొప్పనిపించడం
ఏం చెప్పినా వినకపోవడం
అంతా తెలుసనుకోవడం
చింపుకోవడం
చీల్చుకోవడం
ఛీదరించడం
రింగులుగా పొగనొదలడం
రీతి దప్పి జుట్టు కత్తిరించడం
వెకిలి మాటలు
తాత్కాలికానందంలో తన్మయమందడం
పెద్దలనెదిరించడం
విపరీత పోకడలే కదా
కరోనా ప్రియ మిత్రులేకదా
శాశ్వతానంద రహస్యం
సనాతన ఋషి పరంపర చాటిన సత్యమని తెలియక పోవడం
సత్యశోధన తేలియనంత కాలం
విపరీత ధోరణుల వలలో విలవిల లాడగూడదంటే
సనాతనమనే చిన్నచూపు మానడం
సన్మార్గంలో సన్మిత్ర స్నేహితుని గ్రహించక పోవడం... మానడమా...
మనిషని మరిచి పోవడమా..
నీ ఇష్టం
.....  *వీరా గుడిపల్లి*
17
*సాహితి బృందావన  విహార సమూహ వేదిక జాతీయ వారోత్సవాలు కవిత పోటీలలో భాగంగా*
2) మీరు పెట్టుకున్న శీర్షిక
అంతే మరి
3) కవి/ కవయిత్రి పేరు
*వీరా గుడిపల్లి*
4) ఊరు  జిల్లా
హైదరాబాద్
5) చరవాణి సంఖ్య
9701618916
6) మేము ఇచ్చిన అంశం
పర్యావరణ పరిరక్షణ
04/07/2020
************
ఇది వీరా గుడిపల్లి కవిత
04072020
అంతే మరి
**********************
అంతే మరి
మనిషి తెలివైనోడు
అన్నీ తెలిసే చేస్తున్నాడు.
ధూమపానం దేహ కాలుష్యం
మద్యపానం మనో కాలుష్యం
వృక్షాలను నరకడం హరిత సంహారం వన దహనం
వాయు, ధ్వని, జల... కాలుష్యం
తెలియక చేసిందేముందిక్కడ
మంచి నీరు,
పైరు గాలి, సకాలంలో వర్షాలు అవసరమని తెలియని ప్రాణమా
ఉషోదయం, పక్షుల కిలకిలా రావాలు, భవిష్యత్ దర్శనం చేయించే ఆరుద్రలు
సముద్ర స్వరం
ఎనభై నాలుగు లక్షల జీవుల మనుగడ
అంతా తెలిసే చేస్తున్నాడు
స్వీయ క్రమశిక్షణ, నియంత్రణ మరిచిపోయిన హీన స్థితికి బానిసై
పర్యావరణ పరిరక్షణ
ప్రతివారి ధర్మమనే ధర్మసూక్ష్మం దహించ బడుతుంది
స్వార్థం పడగవిప్పి ప్రకృతిని తొలుచుకు తినడం మొదలెట్టింది.
రాజ్యం కొరడా ఝలిపించందే తినే తిండి కూడ కల్తీ చేసుకునే  జాతి గా ఎదుగు తుంది
తప్పదు రాజ్యం తానై కదలాలి. తనపర భేదం లేకుండా పర్యావరణ పరిరక్షణ చేయాలి.
అంతా బాగుండాలి.అక్కడే మనముండాలి
ఈ మధ్యనే ఎవరో అన్నారు
అందరూ బాగుండాలి.అందులో మనముండాలని.
అంతేమరి.
..... వీరా గుడిపల్లి
18
*సాహితి బృందావన  విహార సమూహ వేదిక జాతీయ వారోత్సవాలు కవిత పోటీలలో భాగంగా*
2) మీరు పెట్టుకున్న శీర్షిక
అంతే మరి
3) కవి/ కవయిత్రి పేరు
*వీరా గుడిపల్లి*
4) ఊరు  జిల్లా
హైదరాబాద్
5) చరవాణి సంఖ్య
9701618916
6) మేము ఇచ్చిన అంశం
మానవీయ విలువలకు విఘాతం కలిగించే పరిస్థితులు
05/07/2020
************
ఇది వీరా గుడిపల్లి కవిత
05072020
అంతే మరి
**********************
జేజకు దండం పెట్టు నాన్నా అన్నప్పటినుండి విలువలు నాటే ప్రయత్నం
సంప్రదాయం సనాతన ధర్మం, మానవత్వం పరిమళింపజేసే మార్గాలే కదా
విఘాతమెక్కడ కలుగుతుంది
విలువల పతనం మొదలౌతుందెక్కడ
వానల్లు కురవాలి వానదేవుడా అనే పాటల స్థానంలో
రెయిన్ రెయిన్ గో అవే  అనే పాటల్ని పాడుకోవడం
సహజత్వానికి దూరంగా జరుపుతూ సామాజిక పతనానికి చేరువజేసే విధానాలు
వృద్ధాశ్రమాలు అభివృద్ధి చెందడం, విడాకుల సంఖ్య పెరగడం
యేరకమైన అభివృద్ధి
విలువల పతనాభివృద్ధి మాత్రమే
ఆర్థిక స్వావలంబనకై ఆశపడడం సరేగాని
ఆశలు వెఱ్ఱి తలలేయడం కదా కారణం
మహిళా సాధికారత దిశగా పయనించడమే మనసు మురిసే విషయం
నిర్భయ లాంటి సంఘటనలకు మూలమైన విధాన లోపాలు దిద్దుకోవడమే మన ముందున్న మార్గం
మనుషులు గా మారే మార్గాలు వెతుక్కోవాలి.
.....  *వీరా గుడిపల్లి*
19
*సాహితి బృందావన  విహార సమూహ వేదిక జాతీయ వారోత్సవాలు కవిత పోటీలలో భాగంగా*
2) శీర్షిక
వందనం
3) కవి పేరు ః  య*వీరా గుడిపల్లి*
4) ఊరు ః హైదరాబాద్
5) చరవాణి సంఖ్య
9701618916
6) మేము ఇచ్చిన అంశం
సైనికులకు వందనం
06/07/2020
************
ఇది వీరా గుడిపల్లి కవిత
06072020
**********************
తలవంచని నా కొడుకు తలను చూడాలని తలెత్తుకు పోయారన్న ఓ తండ్రి
భరతమాత సేవలో నా కొడుకు బలైపోయాడని సంతోషించిన ఓ తల్లి
సరిహద్దులకు బిడ్డల్ని పంపి మన ప్రాణ రక్షణకై తపిస్తున్న తల్లి దండ్రులున్న నేల నాది.
భరతమాత సేవలో తరించడమే భాగ్యమని భావించే వీరులున్న జాతి నాది
అనాదిగా
త్యాగ మూర్తులులు, తపోధనులు అవతరించిన మట్టి నాది
అరంగుళమైనా వదులుకోవడానికి సిద్ధంగా లేమని సరిహద్దులలో నిలబడిన సిధ్ధపురుషులున్న దేశం నాది
అమ్మా,నాన్నా,ఆళి  ఆశీస్సులతో భారతాంబ సేవకై యల్వోసీ దగ్గర తిష్ట వేసికూర్చుని కాపలా కాస్తున్న కర్మయోగుల
ధైర్యం నాది
అఖండ భారతావనికి అన్నీతామై నిలబడిన
కర్మయోగులు, సిద్ధ పురుషులు, త్యాగ మూర్తులైన భారత సైనికులకు
శిరసాభివందనం.
........ *వీరా గుడిపల్లి*
20
*సాహితి బృందావన  విహార సమూహ వేదిక జాతీయ వారోత్సవాలు కవిత పోటీలలో భాగంగా*
2) శీర్షిక
కరోనా వైరస్
3) కవి పేరు ః  *వీరా గుడిపల్లి*
4) ఊరు ః హైదరాబాద్
5) చరవాణి సంఖ్య
9701618916
6) మేము ఇచ్చిన అంశం
భావిభారత పౌరులపై కరోనా ప్రభావం
07/07/2020
************
ఇది వీరా గుడిపల్లి కవిత
07072020
**********************
కరోనా వైరస్
ఇంతకాలం ఏం నేర్పాం
ఏం నేర్పుతున్నాం.
ఫ్యాషన్ పేరుతో చింపుల బట్టలు
తిట్టు మాటలే సాన్నిహిత్య గాఢతకు సూచీలని
మొహం కడగకుండా బెడ్ కాఫీలని
నాగరికత పేరుతో నాశనం చేసుకున్న సాంప్రదాయం
భవిష్యత్తరాల భవిష్యత్తు నే ప్రశ్నార్థకంగా మార్చేశాం.
స్వార్థమే పరమార్థమని పర్యావరణం ప్రమాదంలో పడేశి
యెనబైనాలుక్కోట్ల జీవజాలం ,సమస్త ప్రకృతి మనిషి కోసమనే మాయలో పడేశాం.
వికటించిన ఆశలు,విపరీత ధోరణుల కాపురం ఫలితంగా జనించిన
కరోనా వైరస్
కళ్ళు తెరిపించింది కుళ్ళబొడిచింది.
భవిష్యత్ భారతమెలా ఉండాలో తేల్చి చెప్పింది.
ప్రపంచాన్ని గడగడలాడించింది పవిత్ర జీవనమంటేంటో తెలియజేస్తుంది.
వేదాల వెలుగులో
ప్రకృతితో సహజీవనం చేయమని
భవిష్యత్ భారతానికి
వేయాల్సినకొత్త దారులు
పాతవేనని పాఠాలు చెబుతుంది
కరోనా వైరస్
..... *వీరా గుడిపల్లి*
21

ఇది వీరా గుడిపల్లి కవిత
20/05/2020
శీర్షిక ః అతను మేక రవీంద్ర
**********************
ఎక్కడ ఓ పూవు వికసించినా
అక్షర పరిమళం మనసున పరుచుకున్నా
ఆ వనం తనదేనని ప్రకటించగలడు
ఆరువేల
కవన సైన్యానికి అప్రకటిత రారాజు తాను

అక్షరాలను శ్వాసించేవాళ్ళు
ఆలంబనకై చూస్తున్న రోజుల్లో
ఆశల్ని నాటి
ఒంటరిగా వనాలను నాటిన మాలి మరి

నమ్మలేని నిజాలెన్నింటికో
నమ్మకమైన సాక్ష్యం అతను
కవిమిత్ర నుండి పద్యశ్రీ వరకు ఎన్ని మజిలీలో

అంతర్జాల సమూహాలను
అక్షరాలతో స్నేహింపజేసిన అభినవ తెలుగు భోజుడు
పురస్కారాలకు కొత్త భాష్యం చెప్పి
 అక్షర ప్రేమికులకు అందమైన మార్గాలను వేసిన మార్గదర్శి.

సాహిత్య పుర వీధుల్లో అడుగడుగునా కనిపించే కటౌట్....
అందరి హృదయాలలో చెదరని చిత్రం...
పిలవాలను కుంటే పలకాలనుకుంటే
మేక రవీంద్ర అతని పేరు
**********వీరా గుడిపల్లి*******
22
ఇది వీరా గుడిపల్లి కవిత
07/07/2020
రైతు మరీ!!
****************

అన్నంమెతుకుల
ఆత్మ స్వరూపం
ఆకలి పేగులు చేసే భజన
నాగలి కర్రు గీసేగీతల శైలి
గుంటుక వేసే మేకప్ పూతలు
గొర్రుచాళ్ళ సందుల్లో పారే కలుపును పీకే సైనికుడు

తొలకరి కోసం ఆకాశం వైపు చూస్తూ
దేశానికి అన్నం పెట్టే భాగ్యం కోసం
చూసే చూపులకు
జరిగిన నష్టం,కురవని వర్షం అందని ధరలు ఏవీ  కనిపించడంలేదు

మేఘాన్ని ప్రార్థించడం కోపాన్ని పాతిపెట్టడం అలవోకగా అలదుకున్న సుగుణం
పండిన పంటంతా పెట్టుబడుల ప్రత్యామ్నాయంగా మారి ఋణపీడితుడిగా మార్చినా
ఆకలి తీరనున్న వందల ముఖాలు కళ్ళల్లో మెదులుతుంటే
కాలంతో ప్రయాణిస్తూ
కటిక పేదరికాన్ని కప్పుకుంటూ కంటినిండా నిద్ర పోతున్న కర్మయోగి
రైతు మరీ !!!!!!
.... వీరా గుడిపల్లి

23


No comments:

Post a Comment